మహబూబ్‌నగర్

పలుచోట్ల మోస్తరు వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 9: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఓ మోస్తారు వర్షం కురిసింది. అందులో భాగంగా కల్వకుర్తి మండలంలో దాదాపు మూడు గంటల పాటు ఎడతెరపిలేని భారీ వర్షం కురిసింది. దీంతో కల్వకుర్తి పట్టణంలో రోడ్లన్ని జలమయమైయ్యాయి. భారీ వర్షంతో మండలంలోని వివిధ గ్రామాల్లో చెరువుల్లోకి నీరు వచ్చి చేరింది. అదేవిధంగా వెల్దండ, ఆమనగల్లు, మిడ్జిల్ మండలాల్లో కూడా ఓ మోస్తారు వర్షం కురిసింది. జడ్చర్ల మండలంలోని కొన్ని గ్రామాల్లో జల్లులు కురిశాయి. దేవరకద్ర, దన్వాడ, మక్తల్ ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. మహబూబ్‌నగర్ పట్టణంలో సైతం సాయంత్రం చిరుజల్లులు కురియడంతో వాతావరణమంతా చల్లబడి పోయింది. అయితే ఉదయం నుండి మహబూబ్‌నగర్ పట్టణంలో ఉక్కపోత, ఎండ వేడిమి సాయంత్రం వరకు ఉంది. సాయంత్రం తర్వాత ఒక్కసారిగా మేఘాలు కమ్ముకోవడంతో చల్లనిగాలులు వీస్తూ చిరుజల్లులు కురిశాయి.