మహబూబ్‌నగర్

నామినెటేడ్ పోస్టుల భర్తీ షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 9: ముఖ్యమంత్రి కెసి ఆర్ నామినెటేడ్ పదవులను ఒక్కోక్కటిగా భర్తికి శ్రీకారం చుట్టారు. నామినెటేడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కావడంతో జిల్లాలో ఆశవహుల ఆశలు ఫలించబోతున్నాయి. గత నెలరోజుల క్రితం దేవరకద్ర మార్కెట్ కమిటీకి కార్యవర్గాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఎట్టకేలకు జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీ కార్యవర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం సాయంత్రం మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పదవులు దక్కిన నేతలు ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతున్నారు. మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రాజేశ్వర్, వైస్ చైర్మన్‌గా బాలరాజులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. హన్వాడ, మహబూబ్‌నగర్ మండలాలకు సంబందించిన పలువురిని మార్కెట్ కమిటీలో డైరెక్టర్ పోస్టులు వరించాయి. ఏది ఏమైనప్పటికిని గత రెండేళ్ల నుండి నామినెటేడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నాయకులకు ఎట్టకేలకు పదవులు లభించాయి. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సిపార్సు మేరకు ఈ పోస్టులు నాయకులకు దక్కాయి. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సిఫార్సు చేసిన వారికి పోస్టులు దక్కడంతో ఆయన అనుచరుల్లో ఆనందం వెల్లువిరుస్తుంది.