మహబూబ్‌నగర్

సమస్యల పరిష్కారమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, జూన్ 10: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నాఠు. శుక్రవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని వీరన్నపేట, పాతతోట, సంజయ్‌నగర్ వార్డులలో ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సంజయ్‌నగర్‌లో పవర్‌బోర్డుకు భూమిపూజ చేసి డ్రిల్లింగ్ పనులను ప్రారంభించారు. వార్డుల పర్యటన సందర్భంగా ఆయా వార్డుల ప్రజలు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు సమస్యలు ఏకరువు పెట్టారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ తమ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రజా సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. మహబూబ్‌నగర్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా వార్డులలో తాగునీరు, రోడ్లు, విధి దీపాలు తదితర వౌళిక సదుపాయాల కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజలు ఎమైన సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ బుక్యాదేవ్‌సింగ్ నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, టిఆర్‌ఎస్ నాయకులు వెంకటేశ్వర్‌గౌడ్, వెంకటయ్య, పిల్లి సురేష్ పాల్గొన్నారు.