మహబూబ్‌నగర్

రాష్ట్రంలో నయా దొరల పాలన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూన్ 10: తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ఘనమైన విజయాలు సాధించామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని, అమరవీరుల త్యాగాల ఉద్యమంలో పాల్గొన్న ప్రజల ఆకాంక్షలను మరిచి అధికారమే పరమావదిగా తెలంగాణలో నయాదొరలపాలన తరహా రెండేళ్లుగా కొనసాగుతుందని తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షులు సంకర్‌ప్రభాకర్, డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి హరిబాబు, కెఎన్‌పిఎస్ జిల్లా కమిటి సభ్యుడు రవికుమార్, డిటిఎఫ్ తాలుకా అధ్యక్షుడు రంజిత్‌కుమార్, సిఎల్‌సి జిల్లా ఉపాధ్యక్షుడు సుభాన్, రత్నంలు ఆరోపించారు. శనివారం స్థానిక రామిరెడ్డి గ్రంథాలయంలో వారు విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమద్రోహులు, పచ్చితెలంగాణ వ్యతిరేకులు అందరు కలిసి అధికార పీఠాన్ని ఎక్కి కూర్చోని మేము బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తామని చెప్పారు. రైతు ఆత్మహత్యలలో దేశంలో మొదటిరాష్ట్రంగా మార్చివేశారని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాటాలో రూ.50వేల కోట్లు కాగా రెండేళ్ల పాలనలో రూ.1.20కోట్లు అయ్యిందన్నారు. రెండేళ్లలో 2,224 పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆత్మహత్యలు నివారించే చర్యలుగాని ప్రభుత్వం చేపట్టడం లేదన్నారు. రైతాంగానికి ఎలాంటి సహాయం అందించినా ప్రభుత్వం గ్రీన్‌హౌస్, కలివేషన్ పేరుతో భూస్వాములను లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తుందన్నారు. కోదండరామ్‌పై మంత్రులు విరుచుకపడి విమర్శిస్తున్నారని, ప్రజల పక్షాన పోరాడేవారిని పాలకుల బెదిరింపులు ఏమి చేయలేవన్నారు. సోదర సంస్థగా జెఎసికి ప్రజాఫ్రంట్ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. 2లక్షల ఉద్యోగాలు డిఎస్సీ కాంట్రాక్ట్ ఉద్యోగాల విషయంలో మాటతప్పిన ప్రభుత్వాన్ని నిలదీయాలని సంఘాల నాయకులు హెచ్చరించారు.