మహబూబ్‌నగర్

హరితహారం ద్వారా 4.50 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్‌గల్, జూన్ 10: పాలమూరు జిల్లాలో హరిత హారం పథకం ద్వారా 4.50కోట్లు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్దం చేయడం జరిగిందని డిఆర్‌డిఏ పిడి మదుసూదన్ నాయక్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అన్నారం, బుసిరెడ్డిపల్లి గ్రామాల్లో వన నర్సరీలను ఆయన పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపడుకునేందుకు మొక్కల పెంపకాన్ని చేపట్టాలన్నారు. డి ఆర్ డి ఏ ద్వారా జిల్లాలో 60లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లోని ప్రతి మహిళా సంఘం సభ్యురాలు 10మొక్కలు నాటి పెంచేలా చూడాలని ఆయన సూచించారు. స్వయం ఉపాధి సంఘాలు, రైతులు తమ పంటపొలాలల్లో 200మొక్కలు నాటుకుంటే ప్రతి నెలకు 3వేలు చెల్లిస్తామని చెప్పారు. ఈ పర్యాయం వర్షాలు అనుకూలంగా కురుస్తాయని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. హరితహారంలో మొక్కలు నాటేందుకు నర్సరీలనుండి ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మహిళా సమైఖ్య భవనం ముందు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిపియం జయన్న, ఏసి ప్రభాకర్, ఏపియం మద్దిలేటి, సర్పంచ్ మహేష్ నాయుడు, ఎన్‌పిఎం జమ్మాపూర్ నాగరాజు, వెంకటేష్ తదితరులు ఉన్నారు.