మహబూబ్‌నగర్

పాలమూరు ఎత్తిపోతల నిర్వాసితుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 10: పాలమూరు ఎత్తిపోతల పథకం రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న నిర్వాసితులు శుక్రవారం ఆందోళనకు కలెక్టరేట్‌లో ఆందోళనకు దిగారు. ఏదుల రిజర్వాయర్‌లో(మిగతా 3వ పేజీలో)
(1వ పేజీ తరువాయి) ముంపుకు గురవుతున్న బండరాయిపాకుల గ్రామానికి చెందిన పలువురు ముంపుబాధితులు ప్రభుత్వం తయారు చేసిన నిర్వాసితుల జాబితాల్లో తమ పేర్లు ఎందుకు లేవని, తమ పొలాలకు డబ్బులు కూడా ఇవ్వడంలేదని కలెక్టరేట్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. కొందరు ముంపుబాధితులు అక్కడే ఉన్న వనపర్తి డిప్యూటీ తహశీల్దార్ మల్లికార్జున్‌ను నిలదీశారు. తమ గ్రామంలో ఇంటింటి సర్వే తమరే చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాని చెందిన వన్నోజు సాయి ప్రకాష్ మాట్లాడుతూ తమ గ్రామంలో తాము ముంపు బాధితులమని తమ ఇండ్లు భూములు కోల్పోతున్నప్పటికిని జాబితాల్లో పేర్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా గ్రామానికి చెందిన లింగారెడ్డి సైతం తమ ఇల్లు గ్రామంలో దాదాపు 50 ఏళ్లకు పైబడి ఉందని గ్రామం పుట్టినప్పుటి నుండి తామంతా గ్రామంలోనే ఉన్నామని ప్రస్తుతం తమ గ్రామం ఏదుల రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతుందని అన్నారు. అయితే కొందరు దళారులు, అధికారులు కమ్మకై తమకు ప్రభుత్వ పరంగా రావల్సిన పరిహారం రానివ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ సొంత గ్రామానికి చెందిన వారి జాబితా లేదని పెళ్ళిళ్లు చేసుకుని గత 20 ఏళ్లుగా అత్తగారింట్లో ఉంటూ తమ గ్రామానే్న పరిచిన ఆడపిల్లల పేర్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఇండ్లు లేకున్న ఇండ్లు ఉన్నట్లు సృష్టించి బై నంబర్లు వేసి నిజాయితీ పరులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కలెక్టరేట్‌లో ముంపు బాధితులు ఆందోళనకు దిగారు. అయితే సాయంత్రం కలెక్టర్ శ్రీదేవిని కలిసి ముంపు బాధితులు వినతి ప్రతాన్ని అందజేశారు. కలెక్టర్ సూచన మేరకు డిఆర్‌ఓ దగ్గరకు వెళ్లారు. అప్పటికే సమాచారం తెలుసుకున్న వనపర్తి ఆర్డీఓ రామచంద్రరావు, గోపాల్‌పేట తహశీల్దార్ ఏసయ్యలు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. డిఆర్‌ఓ భాస్కర్‌తో ఏదుల రిజర్వాయర్ ముంపు బాధితులు బండరాయిపాకుల గ్రామస్తులు తమ గోడును వెలబోసుకున్నారు. అదేవిధంగా తమ పొలాల్లో క్యాంపులు వేశారుని అసలు తమకు భూమికి సంబందించిన పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టును ఎలా నిర్మిస్తారని వారు డిఆర్‌ఓను ప్రశ్నించారు. అయితే ఇందుకు స్పందించిన డిఆర్‌ఓ భాస్కర్ మరోసారి గ్రామంలో పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో నిర్వాసితులు శాంతించారు. జాబితాను నిలిపివేయాలని తాము అభ్యంతరం తెలుపుతున్నామని బండరాయిపాకుల గ్రామం ఏదుల ముంపు బాధితులు డిఆర్‌ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. కాగా డిప్యూటీ తహశీల్ధార్ మల్లికార్జున్ మ్రాతం తాము సర్వే చేసేటప్పుడు సమగ్రంగానే చేశామని ఇప్పుడు ఏమి జరిగిందో తనకు తెలియదన్నారు.