మెదక్

కంది జైలు నుంచి ఐదుగురు ఖైదీలకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మార్చి 29: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 38 జీవో ప్రకారం జిల్లా జైలులో శిక్షలను అనుభవిస్తున్న మొత్తం ఐదుగురు ఖైదీలకు మంగళవారం విముక్తి లభించింది. క్షణికావేశం తాళి కట్టిన మగువలను మట్టుబెట్టిన కేసుల్లో నేర నిరూపణ కావడంతో యావజీవ కారాగార శిక్షలో ఇద్దరు, కన్న తండ్రినే కిరాతకంగా హతమార్చిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మరో వ్యక్తితో పాటు దొంగ తనాలకు పాల్పడినట్లు నేర నిరూపణ కింద సాధారణ జైలు శిక్ష అనుభవిస్తున్న ఇద్దరికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్షతో జన జీవన స్రవంతిలోకి మళ్లీ వచ్చారు. నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బాస్కర్ తన తండ్రిని హత్య చేసిన కేసులో నేరం రుజువు కావడంతో యావజీవ శిక్షను విధించారు. దీంతో ఎనిమిది సంవత్సరాలుగా జైల్లోనే ఉంటున్నాడు. సత్ప్రవర్తన కింద గతంలోనే వదిలిపెట్టాల్సి ఉన్నప్పటికీ చివరి క్షణంలో పొరపాటు చేయడం వల్ల నిలిచిపోయింది. ప్రస్తుతం మానసిక స్థితి అంతంత మాత్రంగానే ఉన్న బాస్కర్‌ను ప్రశ్నిస్తే దేనికి సరియైన సమాధానం చెప్పడం లేదంటే జైల్లో ఒంటరి జీవితం వల్ల కలిగే నష్టం ఏమిటో స్పష్టమవుతోంది. భార్య, పిల్లలు ఉన్నారా ఉన్నారేమో ఇంటికి వెళతావా అంటే వెళ్లానేమో, నేరానికి ఎందుకు పాల్పడ్డావని ప్రశ్నిస్తే కూడా అతనికి ఏమి గుర్తుకు రావడం లేదు. జైలుకు వచ్చినప్పటి నుంచి మీ కుటుంబ సభ్యులు ఎప్పుడైనా వచ్చారా అంటే వచ్చారో, పోయారో అని సమాధానం ఇస్తున్నాడు. సంగారెడ్డి మండలం పసల్‌వాదికి చెందిన మల్లప్ప తాళి కట్టిన చేతితోనే భార్యను హత్య చేసినట్లు నిందారోపణలు ఎదుర్కొన్న సంఘటనలో న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షను విధించింది. 9 సంవత్సరాల పాటు జైల్లో ఉన్న మల్లప్ప విడుదల కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఫోటోలు తీసుకోవడానికి కూడా సిగ్గుపడుతున్న మల్లప్ప పొరపాటు ఎందుకు చేసావని ప్రశ్నిస్తే దాటవేతను అనుసరించాడు. ఏ గ్రామమని అడిగితే సంగారెడ్డిలోని కింది బజార్ అని సమాధానం ఇచ్చిన మల్లప్పలో జైలు జీవితం కనువిప్పును కలిగించిందని చెప్పవచ్చు. మల్లప్ప జైలు జీవితాన్ని అనుభవిస్తూనే పని చేసి కొంత డబ్బును కూడగట్టుకుని ఆ మొత్తాన్ని తీసుకుని వెళ్లాడు. తన సత్ప్రవర్తన వల్లనే జైలు నుంచి విముక్తి లభించిందని ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. న్యాల్‌కల్ మండలం తాటిపల్లికి చెందిన సిహెచ్.నాగేష్ భార్య నర్సమ్మను కిరోసిన్ పోసి హత్య చేసినట్లు నేరం నిరూపితం కావడంతో తొమ్మిది సంవత్సరాలుగా జైల్లో మగ్గాడు. ఇతనికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. జైలుకు వచ్చినప్పటి నుంచి విడుదలయ్యే వరకు కుటుంబ సభ్యులుకానీ, ఇతర బంధువులు ఎవరు కూడా కనీసం పరామర్శించడానికి కూడా రాలేదు. విడుదలైన నాగేష్‌ను ఎక్కడికి వెళతావని ప్రశ్నిస్తే నా ఇంటికి వెళతానని అన్నారు. ముగ్గురు సంతానం ఎక్కడున్నారో తెలియదని, తన అన్నదమ్ములు కూడా రాలేదని విచారం వ్యక్తం చేసాడు. జైలు నుంచి విడుదల కావడం సంతృప్తిని ఇస్తుందని ప్రభుత్వానికి నమస్కరిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేసాడు. మునిపల్లి మండలం మక్తక్యాసారం గ్రామానికి చెందిన మురళి, పటన్‌చెరుకు చెందిన రమేష్‌లు దొంగతనాలకు పాల్పడి నేరం రుజువు కావడంతో సాధారణ జైలు శిక్షణను అనుభవిస్తున్నారు. రమేష్ 14 నెలలుగా జైల్లో ఉంటుండగా మురళి యేడాది కాలంగా జైల్లో ఉన్నాడు. తమను విడుదల చేయడానికి ప్రభుత్వం జివోను తీసుకురావడం సంతృప్తిగా ఉందని, ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దన్యవాదాలు తెలిపారు. భవిషత్తులో మళ్లీ ఎప్పుడు దొంగతనాలకు పాల్పడమని పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాల మేరకు హుటాహుటీన మధ్యాహ్నం 12 గంటలకు ఖైదీలను విడుదల చేయడంతో విడుదలైన వారి బంధువులు ఎవరు కూడా జైలుకు రాలేకపోయారు. తప్పులు చేస్తే శిక్షలు అమలైతే వాటి పర్యావసానం ఏ విధంగా ఉంటుందో విడుదలైన ఖైదీలు వ్యక్తం చేస్తున్న భావాల ద్వారా స్పష్టమవుతోంది. నేరం చేయడానికి ముందు కొన్ని క్షణాలు కోపాన్ని ఆపుకుని ఆలోచిస్తే ఇలాంటి శిక్షలు తప్పడమే కాకుండా సాటి మనుషుల ప్రాణాలు నిలుస్తాయని చెప్పవచ్చు.

ఘణపురం కుడి, ఎడమ కాలువల నిర్మాణం త్వరలో పూర్తి

మెదక్, మార్చి 29: మంజీరపై 1905లో నిర్మించిన ఏకైక మధ్య తరహా ప్రాజెక్ట్ ఘణపురం ప్రాజెక్ట్, కుడి, ఎడమ కెనాల్స్ ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు వ్యవపరుచుతోంది. ఇప్పటికే ఘణపురం ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువల పనులు ప్రభుత్వ నిధులు, జైకా నిధులతో ఆధునీకరణ పనులు పూర్తి స్థాయికి చేరుకున్నాయి. ఘణపురం ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువల ఆధునీకరణ కోసం జైకా నిధులు 24 కోట్లు మంజూరైనట్లు మెదక్ డివిజన్ ఇరిగేషన్ శాఖ డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.శివరాజ్ మంగళవారం నాడు ఇక్కడ మాట్లాడుతూ తెలిపారు. ఎంఎన్ కెనాల్ (మిగతా 3వ పేజీలో) 43.6 కిలోమీటర్లు ఉండగా, 20 కిలోమీటర్లు ఆధునీకరణ పనులు పూర్తి అయినట్లు ఆయన తెలిపారు. ఎఫ్‌ఎన్ కెనాల్ 12 కిలోమీటర్లు ఉండగా ఆ పనులు ఆధునీకరించబడ్డాయని శివరాజ్ తెలిపారు. ఎఫ్‌ఎన్ కెనాల్‌లో రెండు బ్రాంచ్ కెనాల్స్ ఉన్నట్లు ఆయన తెలిపారు. అందులో అన్నారం, దవలాపూర్ ఉన్నట్లు తెలిపారు. జైకా నిధులు ఈ ఆధునీకరణ పనులకు మంజూరైన 24 కోట్లు ఖర్చు అయినట్లు కూడా ఆయన తెలిపారు. ప్రభుత్వ గ్రాంట్స్ క్రింద మరో 21 కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఎంఎన్ కెనాల్‌లో మిగిలిన 23.6 కిలోమీటర్ల ఆధునీకరణ పనులలో భాగంగా ప్రభుత్వ గ్రాంట్స్ నుండి మంజూరైన నిధులతో 19 కిలోమీటర్లు సిసి లైనింగ్ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. మిగిలిన 4.6 కిలోమీటర్ల కెనాల్ యేక్క రీసెక్షనింగ్ పనులు నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ నిధులలో ఎంఎన్ కెనాల్‌లోని 4 బ్రాంచ్ కెనాల్స్ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఇందులో గాంధారిపల్లి, పొడ్చన్‌పల్లి, యూసూఫ్‌పేట, మిన్‌పూర్ ఉన్నట్లు తెలిపారు. ఈ పనులు 30 శాతం పూర్తి అయినట్లు తెలిపారు. మిగిలిన 70 శాతం పనులు 2016 డిసెంబర్ వరకు పూర్తి చేయాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ పనులకు 2017 వరకు వ్యవధి ఉన్నప్పటికినీ త్వరలో ఈ పనులు పూర్తి చేయాలన్నదే తమ లక్ష్య సాధనమని బి.శివరాజ్ తెలిపారు. ఘణపురం ఆనకట్ట ఎత్తు పెంచడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించిన 50 కోట్లలో 44 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. దీనికి సంబంధించిన సర్వే పనులు కూడా జరుగుతున్నాయన్నారు. ఈ పనులను రాఘవ కన్‌స్ట్రక్షన్ హైదరాబాద్ అగ్రిమెంట్ జరగాల్సి ఉందని ఆయన తెలిపారు. మరో నెలలో ఘణపురం ఆనకట్ట ఎత్తు 1.75 మీటర్లు పెంచాల్సిన ఉందన్నారు. దీని ద్వారా ఘణపురం నీటి మట్టం అధనంగా .2 టిఎంసి పెరుగుతుందని డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివరాజ్ తెలిపారు. ఘణపురం ఆనకట్ట క్రింద కుడి, ఎడమ కాలువల ద్వారా 21 వేల 625 ఎకరాలు సాగులో ఉండగా కట్టం పెంచడం వలన 35 వేల ఎకరాల సాగుభూమికి పెరుగుతుందన్నారు. ఎంఎన్, ఎఫ్‌ఎన్ కెనాల్స్ షటర్స్ ఆధునీకరణ పనులకు 1.53 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఎంఎన్ కెనాల్ పొడవున 70 స్లూస్, ఎఫ్‌ఎన్ పొడవున మరో 70 స్లూస్ మరమత్తు పనులు జరుగుతున్నట్లు తెలిపారు. అంటే 140 స్లూస్ పనులు నడుస్తున్నట్లు తెలిపారు. ఈ పనులను హైదరాబాద్ మెకానికల్ వర్క్‌షాపు వారు చేపట్టినట్లు తెలిపారు. ఎంఎన్ కెనాల్ మొయిన్ గేట్లు ఐదు ఉండగా, ఎఫ్‌ఎన్ కెనాల్ మొయిన్ గేట్లు నాలుగు ఉన్నాయన్నారు. ఈ గేట్ల మరమత్తులకు 80 లక్షలు కెటాయించినట్లు తెలిపారు. గేట్ల మరమత్తుల డిజైన్ అప్రువల్ చీఫ్ ఇంజనీర్ ద్వారా కావాల్సి ఉందన్నారు. ఇటీవల ఎంఎన్ కెనాల్ క్వాలిటి కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవేందర్‌రెడ్డి జరగుతున్న ఎంఎఫ్, ఎంఎన్ కెనాల్స్ పనులను పరిశీలించారన్నారు. ఎట్టకేలకు వచ్చే ఖరీప్ సీజన్‌కు చివరి భూములకు నీళ్లందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.

పేట బల్దియా ఎన్నికల్లో టిఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ తథ్యం
* ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి
సిద్దిపేట, మార్చి 29 : సిద్దిపేట అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిందని, మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేసి మరోమారు ఆదర్శంగా నిలుస్తుందని ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో 2, 3 వార్డుల్లో ఎంపి కొత్తప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలసి పాదయాత్ర చేపట్టారు. ఇంటింటా తిరుగుతూ టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తున్నట్లు తెలిపారు. 34వ వార్డుల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టిఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. కాగా సిద్దిపేట పట్టణంలోని 10వ వార్డు టిఆర్‌ఎస్ అభ్యర్థి మచ్చ వేణుగోపాల్‌రెడ్టికి మద్దతుగా ఎమ్మెల్యే, అంచనాల కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఇంటింటీకి తిరుగుతూ టిఆర్‌ఎస్‌కి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.
టిఆర్‌ఎస్‌లో పలువురి చేరిక
సిద్దిపేట పట్టణంలోని 11వ వార్డుకు చెందిన అరుందతి సంఘం సభ్యులు ఎంపిపి ఎర్ర యాదయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
టిఆర్‌ఎస్ అభ్యర్థి గ్యాదరి రవీందర్ విజయానికి కృషిచేస్తామన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ సంక్షేమ పథకాలపై ఆకర్శితులై టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. అరుందతి సంఘం సభ్యులను ఎంపిపి యాదయ్య, మాజీ చైర్మన్ రాజనర్సు పార్టీ కండువాలను కప్పి ఆహ్వనించారు. ఈకార్యక్రమంలో టిఆర్‌ఎస్ అభ్యర్థులు జూలురి నటరాజ్, కొర్తివాడ రామన్న, వేణుగోపాల్‌రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
నంగునూరు,మార్చి 29 : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నంగునూరు మండలం ఘనపూర్ గ్రామంలోమంగళవారం నాడు జరిగింది. గ్రామస్తులు, రాజగోపాల్‌పేట పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బోడ గంగారెడ్డి(38) తనకున్న ఐదెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు . గత ఏడు పంటల సాగు కోసం అప్పులు చేసి నాలుగు బోర్లు వేశాడని తెలిపారు. పంటల సాగు కోసం, బోరు బావుల తవ్వకానికి సమారు ఆరు లక్షల వరకు అందిన కాడికి అప్పులు చేశాడు. ఈ క్రమంలో ఈ ఏడు భూగర్భ జలాలు అడిగంటి పోవడంతో బోరు బావుల్లో నీరు రాక వేసిన మెక్క జొన్న, బబ్బెర పంటలు ఎండి పోయాయి. ఈ సంవత్సరం కూడా వానలు కురుస్తాయోలేదోనని రోజు మధనపిడిన గంగారెడ్డి పంటలకు చేసిన అప్పులు ఎలా తీర్చెదని తీవ్ర మనస్థాపానికి గురై గ్రామ శివారులోని అక్కెన పల్లికి వెల్లే దారిలోమైసమ్మ గుడి వద్ద మంగళవారం తెల్లవారు జామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఇరుగు పొరుగు చూసి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న ఆర్‌ఐ సందీప్, విఆర్‌ఓలు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి పంట పొలాలను పరశీలించారు. మృతుని భార్య సునిత ఫిర్యాదు మేరకు రాజగోపాల్‌పేట హెడ్‌కానిస్టేబుల్ శంకర్‌నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం

* ఎన్టీఆర్‌కు ఘన నివాళి
సంగారెడ్డి టౌన్, మార్చి 29: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో వేడుకలను జరుపుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు శశికళ యాదవరెడ్డి పార్టీ కార్యాలయంలో జెండావిష్కరణ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జడ్పీ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహం, పోతిరెడ్డిపల్లిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు శ్రీనివాస్‌గౌడ్, నర్సింలు, నాగేందర్, మహ్మద్ ఖాజా, అశోక్, అంజయ్య, అయ్యప్ప, బందేన్నగౌడ్, మల్లేశం, మానయ్యగౌడ్, విష్ణువర్ధన్, బాల్‌రాజ్, చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

కరవు రైతులపై కక్షసాధింపా!
* ఓట్లు, సీట్ల కోసం తెరాస పాకులాట
* రోహిత్ మృతిపై సిఎం స్పందించరా?
* ప్రాజెక్టుల రీ డిజైన్ పాలకులకే లబ్ధి
* సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, మార్చి 29: కరవు కోరల్లో చిక్కి గిలగిల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు దోరణిని అనుసరిస్తుందని, అప్పుల బాధతో అనేక మంది అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోగా ఓట్లు, సీట్ల కోసం మాత్రమే ప్రాకులాడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దుయ్యబట్టారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. మంగళవారం స్థానిక కేవల్ కిషన్ భవన్‌లో కరువు, రైతాంగ సమస్యలు, సామాజిక అంశాలపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తమ్మినేని వీరభ్రదం మాట్లాడుతూ కరువు నివారణ చర్యల కింద రైతాంగానికి నష్టపరిహారం అందించాలని, ప్రజల దాహర్తి తీర్చేందుకు తాగునీరు, పశుగ్రాసం కొరతను నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కరువునివారణకు కేంద్రానికి నివేధిక పంపామని, కేంద్రం నిధులిస్తేనే నష్టపరిహారం చెల్లిస్తామని చెబుతున్న ప్రభుత్వానికి రైతులపై ఉన్న చిత్తశుద్దికి దర్పం పడుతుందని ధ్వజమెత్తామరు. కేంద్రం నిధులు ఇవ్వకుంటే వ్యవసాయదారులను ఆదుకోరా అని నిలదీసారు. ప్రభుత్వం వాస్తవాలను గుర్తించి ప్రజాపరిపాలన కొనసాగించాలని హితవుపలికారు. ప్రభుత్వ పాలన మొత్తం అవినీతి మయంగా మారిపోయిందని, వార్డు మెంబర్ నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు డబ్బులను ఎరవేసి టిఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని, లొంగని వారిని అణిచివేతకు గురి చేస్తూ తప్పుడు కేసులు బనాయింస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని, ఇది భవిష్యత్ తరాలకు ముప్పు వాటిల్లక తప్పదన్నారు. ప్రాజెక్టులను రీ డిజైన్ చేయడం సరికాదని అన్ని పార్టీలు చెప్పినా సిఎం కెసిఆర్ పెడచేవిన పెట్టారని, రీ డిజైన్ వల్ల రైతుల ప్రయోజనం కంటే పాలకులు ఉపయోగపడే విధంగా ఉందని విమర్శించారు. కెసిఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామిలు 5 శాతం కూడా అమలు చేయలేదు కానీ 99 శాతం హామిలు పూర్తిచేశామంటూ అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటిలో జరిగిన సంఘటనపై కెసిఆర్ స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. యూనివర్శిటి విసిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసినా అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర హోం మంత్రి రోహిత్ ఘటనపై కులాల గురించి మాట్లాడం సిగ్గుచేటని, బిసి వర్గానికి చెందిన వారైతే చంపుతారా అని ప్రశ్నించారు. విసిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కరువు, ప్రాజెక్టుల నిర్మాణం, అవినీతి, అక్రమాలపై ఉద్యమిస్తామన్నారు. విలేఖరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం, నాయకులు మానిక్యం, అడివయ్య పాల్గొన్నారు.