మెదక్

టూరిజం సర్క్యూట్‌గా ఏడుపాయల క్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, అక్టోబర్ 21: తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన శ్రీ ఏడుపాయల వనదుర్గాదేవి పుణ్యక్షేత్రాన్ని పర్యాటక శాఖ సర్క్యూట్‌గా ఏడుపాయలను అభివృద్ధి చేయనున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి తెలిపారు. ఏడుపాయల్లో వనదుర్గామాతను శుక్రవారం రోజు జిల్లా కలెక్టర్ దర్శించుకున్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరికి ఆలయ పూజారులు, సిబ్బంది పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. కలెక్టర్ అమ్మవారికి కుంకుమార్చన తదితర (మిగతా 3వ పేజీలో) విశేషాలంకరణ పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల భారీ వరదలు, వర్షాల వల్ల మంజీర పొంగి పొర్లడంతో ఏడుపాయల ఆలయానికి చాలా నష్టం సంభవించిందని ఆమె పేర్కొన్నారు. ఏడుపాయల్లో కుంగిపోయిన రోడ్డును, క్యూలైన్స్ డ్రిల్స్ తదితర ప్రదేశాలను కలెక్టర్ పరిశీలించారు. ఘణపురం చెక్ డ్యామ్, హరిత హోటళు, భక్తుల సౌకర్యాలకు చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో పర్యాటక శాఖ హరిత హోటల్‌లో జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి సమీక్ష నిర్వహించారు. ఏడుపాయల్లో భక్తుల వసతులను కల్పించే విధంగా అన్ని శాఖలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా భక్తులకు మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించాలని ఆర్‌డబ్ల్యూయస్ అధికారులను ఆదేశించారు. ఏడుపాయలను తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. భక్తులకు పూర్తి స్థాయిలో వసతులు సమకూర్చుతామని, శుభ్రతలు పాటించే విధంగా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని ఈఓను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెదక్ డిఆర్‌ఓ నగేష్, పంచాయితీరాజ్ ఇఇ వెంకటేశ్వర్‌రావు, ఇరిగేషన్ ఇఇ ఏసయ్య, ఆలయ ఈఓ వెంకటకిషన్‌రావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.