మెదక్

చెత్త శుద్ధిపై ప్రత్యేక శ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, నవంబర్ 2: మున్సిపల్ పట్టణాల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యను తొలగించడానికి కమిషనర్లు, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది చిత్తశుద్దితో పని చేయాలని కలెక్టర్ మానిక్యరాజ్ కణ్ణన్ ఆదేశించారు. చెత్తను డంప్ చేయడానికి అవసరమైన డంప్ యార్డుల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని వారం రోజుల్లోగా గుర్తించి పనులను ప్రారంభించాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ పట్టణాల పరిధిల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి లక్ష్యాన్ని సాధించాలని కోరారు. జిల్లాలోని మున్సిపల్ ప్రాంతాల్లో మంచినీటి ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్ చేయించాలన్నారు. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డులు శుభ్రంగా ఉండటం లేదని తనకు పిర్యాదులు అందుతున్నాయని కమిషనర్‌ను ప్రశ్నించగా మున్సిపాలిటీలో 99 మంది కార్మికులున్నారని, ఆ సిబ్బందితో ప్రతి రోజు ఆయా వార్డుల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహింపజేస్తున్నామని సమాధానం ఇచ్చారు. ప్రతి రోజు మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉదయమే వార్డులను పర్యటించి అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే శుభ్రపర్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెత్త సేకరణ కూడా ఇంటింటికి వెళ్లి సేకరించుకునేలా కార్మికులకు ఆదేశాలివ్వాలని తెలిపారు. పట్టణాల్లోని వ్యాపార సంస్థలు రోడ్లపై చెత్తను పారవేస్తే వారిపై జరిమానాలు విధించాలన్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపల్ పట్టణంలో చెత్తను ఏ విధంగా సేకరిస్తున్నారని, చెత్త సేకరణకు ఎన్ని రిక్షాలున్నాయని, అందులో ఎన్ని పని చేస్తున్నాయని కమిషనర్‌ను ప్రశ్నించగా మొత్తం 31 రిక్షాలతో చెత్త సేకరణ చేయిస్తున్నట్లు సమాధానమిచ్చారు. పట్టణంలో ఆయా దుకాణాదారులు రోడ్లపై చెత్తను పారబోస్తున్నారని, వారిపై జరిమానాలు వేస్తున్నారా అని కలెక్టర్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎన్ని దుకాణాలకు జరిమానాలు విధించారని కమిషనర్‌ను ప్రశ్నిస్తూ ఇక ముందు దుకాణాల ముందు చెత్త పారబోస్తే తప్పనిసరిగా జరిమానాలు విధించాలని ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం 5.30 గంటలకే మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు ప్రతి వార్డులలో పర్యటించి, పర్యవేక్షించాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి చెత్త సేకరించే విధంగా మున్సిపల్ కార్మికులను ఆదేశించాలన్నారు. అలాగే మురికి కాల్వలను శుభ్రపర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపల్ పట్టణాలు, నగర పంచాయతీల్లో చెత్తను వేసుకునేందుకు ప్రతి ఇంటికి చెత్త బుట్టలను పంపిణీ చేయించాలని తెలిపారు. హరితహారం కార్యక్రమంలో మున్సిపల్ పట్టణాల పరిధిలో ఎన్ని మొక్కలు నాటారు, అందులో ఎన్నింటిని కాపాడారో పూర్తి వివరాలు అందజేయాలని కమిషనర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, సంగారెడ్డి తహశీల్దార్ మహిపాల్‌రెడ్డి, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్లు, జోగిపేట నగర పంచాయతీ కమిషనర్ పాల్గొన్నారు.

శాంతి భద్రతలపై డిజిపి ఆరా

జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
మెదక్ టౌన్, నవంబర్ 2: కొత్త జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ ఎలా ఉంది, పోలీసుల పనితీరు ఎలా ఉందనే అంశాలపై రాష్ట్ర డిజిపి అనురాగ్‌శర్మ జిల్లా ఎస్పీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ చందనాదీప్తి కార్యాలయంలో వీడియో కాన్పరెన్స్ ద్వారా డిజిపి ఎస్పీతో మాట్లాడారు. సిబ్బంది వివరాలు, పనితీరు గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది నియామకం ఇంకా కావాలని జిల్లా ఎస్పీ చందనాదీప్తి ఆయనకు విడియో కాన్పరెన్స్ ద్వారా తెలిపారు. ప్రజా రక్షణ తదితర అంశాలపై డిజీపి సూచనలు చేశారు. రాష్ట్రంలో జరిగే పోలీస్ నియామకాల ద్వారా ఖాళీలన్నింటిని భర్తి చేస్తామని డిజీపి పేర్కొన్నారు. నేర శాతం తగ్గించేందుకోసం చేపట్టాల్సిన జాగ్రత్తపై ఆయన సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ చందనాదీప్తిని మెదక్ జ్యూవెలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాజీర్ వారి కమిటి కార్యదర్శి రవితో పాటు స్వర్ణకార సంఘం అధ్యక్షులు జియల్.శ్రీనివాస్‌లు కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

సమన్వయ కృషితో రైతు సమస్యల పరిష్కారం

* ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి హరీష్
సిద్దిపేట, నవంబర్ 2: రైతుల సమస్యలు పరిష్కారానికి ఆత్మకమిటి, కోఆపరేటీవ్, మార్కెటింగ్ పాలకవర్గాలు సమన్వయంతో పనిచేయాలని మార్కెటింగ్ శాఖమంత్రి హరీష్‌రావు అన్నారు. బుధవారం స్థానిక ఏడిఎ కార్యాలయంలో వ్యవసాయ సాంకేతిక యజమాన్య సంస్థ ఆత్మకమిటీ ప్రమాణస్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొత్త జిల్లాలు ఏర్పాటైనందున అధికారులంతా పాలన పై దృష్టి పెట్టాలన్నారు. రైతు ముంగిట్లోకి సులభంగా తెలంగాణ ప్రభుత్వం సేవలందిస్తుందన్నారు. రైతులకు చేరువలో ఉండేలా విద్యుత్, వ్యవసాయం, విత్తనాలు, బీమా వ్యవసాయ అనుబంధ ఆంశాల పై దృష్టి పెట్టాలన్నారు. ఆత్మకమిటి అందరితో కలిసి పనిచేసి రైతులకు వ్యయప్రయాసలు తగ్గించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులందరికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలానికి చెందిన వ్యవసాయ రంగ ప్రజాఫ్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. నూతన అధునాతన దిగుబడులు సాధించేలా రైతులకు మెలకువలు తెలపాలన్నారు. రైతుబజార్‌లో మార్కెటింగ్ శాఖ కన్సల్టెన్సీ నిర్వహించి సూచనలు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. రైతులు ఏ సీజన్‌ళో ఏ పంటలు వేయాలి, ఏ విత్తనాలు వేయాలి అవగాహన కల్పిస్తారన్నారు. రైతు సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేలా వ్యవహరించాలన్నారు. బీమా పై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉందన్నారు. రైతు ఆధార రాష్టమ్రని, మంచిపేరు తెచ్చుకోవాలన్నారు. అనంతరం ఏడిఎ వెంకటేశ్వర్లు, ఆత్మకమిటి చైర్మన్ సత్యనారాయణరెడ్డి, వైస్‌చైర్మన్ బాల్‌రెడ్డి, సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం కమిటి చైర్మన్‌ను మంత్రి హరీష్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అత్తర్‌పటేల్, ఎంపిపిలు యదయ్య, మాణిక్యరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, జడ్పిటిసి కమల, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తాగునీటి కోసం రాస్తారోకో

ఉద్రిక్తత పోలీసుల రంగప్రవేశం
గజ్వేల్, నవంబర్ 2: గజ్వేల్ మున్సిపల్ పరిదిలోని ప్రజ్ఞాపూర్‌లో తాగునీటి కోసం మహిళలు బుధవారం రాజీవ్ రహదారిపైకి చేరుకొని ధర్నా, రాస్తారోకో చేపట్టారు. గత రెండు సంవత్సరాలుగా ప్రజ్ఞాపూర్‌లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చి ఇబ్బందులు పడుతున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులపై తిరుగబడినంత పనిచేశారు. ముఖ్యంగా ఆందోళనకు దిగిన ప్రతి సమయంలో ప్రజాప్రతినిదులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని నచ్చజెప్పుతూ వచ్చారు. ఇక తాము ఎదుర్కొంటున్న దాహార్తి సమస్య పరిష్కారం కావడం కష్టమేనని బావించిన మహిళలు ఖాళీ బిందెలతో రాజీవ్ రహదారిపైకి చేరుకోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్తలానికి చేరుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు అక్కడికి చేరుకొని మహిళలలకు నచ్చజెప్పినప్పటికీ వారు వినకపోవడంతో జాయింట్ కలెక్టర్ హన్మంతరావుతో మాట్లాడించారు. ఒకటిరెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో పరిస్తితి సద్దుమణిగింది.

పోచారం ప్రాజెక్టులో ఇక బోటింగ్
మెదక్ రూరల్, నవంబర్ 2: జిల్లా సరిహద్దులో గల పోచారం ప్రాజెక్టులో బోటు ట్రయల్ రన్ నిర్వహించారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి స్వయంగా బోట్లు ప్రయాణించి ప్రాజెక్టు మొత్తం కలియతిరిగి ప్రాజెక్టు నీటి మధ్యలో ఉన్న ఐలాండ్ (పాటిగుట్ట ద్వీపం)ను సందర్శించారు. ఐలాండ్‌లో హోటల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న, గుట్టపైన గల అతిథిగృహాల వద్ద పదేసి టాయిలెట్లు నిర్మించాలని సంబంధిత ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. గత నెల 16న టూరిజం శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రాజెక్టును సందర్శించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ది పరుస్తామని ప్రకటించిన విషయం తెల్సిందే. గత వారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ భారతి హొళ్లికేరిలు సందర్శించి బోట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కలెక్టర్ ఇప్పటికే పలుమార్లు ప్రాజెక్టును సందర్శించి పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టేందుకు అధికారులకు తగు ఆదేశాలిస్తున్నారు. కాగా రెండు కొత్త బోట్లు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో హుసేన్‌సాగర్ నుండి ఒక బోటును తీసుకువచ్చి ప్రాజెక్టులో ట్రయల్ రన్ చేయగా కలెక్టర్ భారతి హొళ్లికేరి స్వయంగా పరిశీలించారు. బోటులో పాటిగుట్ట వరకు వెళ్లి అక్కడ ప్రమాదకరంగా ఉన్న రాళ్లపై నిల్చుండి ప్రాజెక్టును పరిశీలించారు. సందర్శకులు సేద తీరేలా హోటల్, పార్కులను ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. సందర్శకులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం రెండు అతిథిగృహాలను సందర్శించి వాటిని వాడుకోలేకి తెచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా టాయిలెట్స్ నిర్మించాలన్నారు. ప్రాజెక్టు మధ్యలో ఉండే దీపం వరకు బోట్లను నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాజెక్టు వద్దకు వచ్చే సందర్శకులు పారిశుద్ద్యం పాటించాలని, చెత్త, కవర్లు వేయడానికి చెత్త కుండీలను సమకూర్చాలని అధికారులకు సూచించారు. వసతి గృహాల మరమ్మత్తులు, విద్యుద్దీకరణ, కాఫీ క్లబ్, పార్కులు చేయిస్తామన్నారు. తమకు ఉపాధి కల్పించాలని పోచారంకు చెందిన మత్స్యకారులు కలెక్టర్‌ను కోరగా వాటర్ బాటిల్స్, కూల్‌డ్రింక్స్, టీ స్టాల్ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తామన్నారు. పోచారం ప్రాజెక్టును పర్యాటకులు సేదతీరేలా పర్యాటక ప్రాంతంగా తయారుచేస్తామని కలెక్టర్ భారతి పేర్కొన్నారు. ఆమె వెంట డిఆర్‌ఓ నగేశ్, మత్స్యశాఖ ఎడి లక్ష్మీనారాయణ, ఎంపిడిఓ రాంబాబు, తహశీల్దార్‌లు అమీనుద్దిన్, రవికుమార్, ఎస్‌ఐ శ్రీకాంత్, మాజీ సర్పంచ్ సత్యనారాయణలున్నారు.
సొసైటీ అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి పరిశీలన
కోనాపూర్ సొసైటీ అద్యక్షులు, తెరాస రాష్ట్ర కార్యదర్శి ఎం.దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, తెరాస నాయకులు ప్రాజెక్టులో బోటులో ప్రయాణించారు. నిజాం హయాంలో నిర్మించి షికర్ ఘర్‌గా పిలవబడే పోచారం ప్రాజెక్టును అభివృద్దిపరిస్తే పర్యాటకులు సేద తీరేందుకు అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇప్పటికే రోడ్డు బాగుచేశారన్నారు. త్వరలో కొత్త బోట్లతో పాటు పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్, కౌన్సిలర్లు వెంకటరమణ, శ్రీనివాస్, తెరాస నాయకులు జయరాంరెడ్డి, సత్యనారాయణ తదితరులున్నారు.

జూనియర్ కళాశాలల్లో
ఇక డేగకన్ను
* అధ్యాపకులు, విద్యార్థుల కదలికలపై సిసి కెమెరాల నిఘా
జోగిపేట, నవంబర్ 2: సంగారెడ్డి జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలలకు సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా జూనియర్ కళాశాలల అధికారి కిషన్‌నాయక్ తెలిపారు. బుధవారం జోగిపేట పట్టణంలోని మహిళా, పురుషుల జూనియర్ కళాశాలలను ఆయన సందర్శించి మాట్లాడారు. జిల్లాలో ప్రతి జూనియర్ కళాశాలలకు నాలుగు సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జిల్లాలో 20 జూనియర్ కళాశాలలు ఉన్నట్లు ఆయన తెలిపారు.
3014 మంది మొదటి, 3910 మంది ద్వితీయ సంవత్సరంలో విద్యార్థులు చదువుతున్నట్లు తెలిపారు. ఉత్తమ ఫలితాల సాదన కోసం సిబ్బంది కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బయో మెట్రిక్ ద్వారా విద్యాబోధన, విద్యార్థుల హాజరు పట్టిక ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గోవిందరామ్, వెంకటరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాల కుట్ర
* చనిపోయిన వారి పేరుతో
కోర్టులో కేసులు
* బహిరంగ చర్చకు
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సిద్ధమా?
* మంత్రి హరీష్‌రావు సవాల్
సిద్దిపేట, నవంబర్ 2: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. 50టిఎంసిల సామర్థ్యంతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ను అడ్డుకునేందుకు మృతి చెందిన వారి పేరుతో, దుబాయి, గల్ప్‌కు పోయిన వారి పేరుతో కోర్టులో కేసులు దాఖలు చేశారని నీటి పారుదల శాఖమంత్రి హరీష్‌రావు ఆరోపించారు. వారి పేర్ల పై 2013చట్టం ప్రకారం భూసేకరణ చేయాలని ఆరోపిస్టు కోర్టులో పిల్ దాఖలు చేశారన్నారు. ఈ విషయం పై చర్చించేందుకు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సిద్దమా అని సవాల్ విసిరారు. సిద్దిపేట శివానుభవ మండపంలో బుధవారం జరిగిన రైతురక్షణ సమితి సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణమంటే దశాబ్దాలు పట్టేదన్నారు. దేవాదుల ప్రారంభించి 16ఏండ్లైనా ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. గోదావరి నీరుతెచ్చి యుద