మెదక్

ఉపాధి కార్మికులకు పని కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోగిపేట, నవంబర్ 3: ఉపాది హామి పథకం క్రింద పనిచేస్తున్న కార్మికులందరికి పని కల్పించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్ అన్నారు. గురువారం అందోల్ మండలంలోని చింతకుంట, తాలెల్మల గ్రామాలను సందర్శించి కలెక్టర్ మాట్లాడారు. చింతకుంట గ్రామంలోని చెరువు క్రింద ఉపాది కార్మికులు చేపడుతున్న పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఒక్కొక్క కార్మికునికి 194 రుపాయలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పని కల్పించకుంటే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాది కూలీలందరికీ జాబ్‌కార్డులు ఇప్పించాలని ఆదేశించారు. వ్యవసాయ కూలీలతో ఆయన స్వయంగా మాట్లాడటం జరిగింది. అనంతరం తాలెల్మ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడి సిబ్బందితో ఆయన ఆమట్లాడారు. ఆస్పత్రికి సంబంధించి రికార్డులు సక్రమంగా రాయాలని ఎయన్‌యం, ఆశ వర్కర్లను ఆదేశించారు. డెలివరీకి సంబంధించి సిబ్బంది వెనువెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లకుండా ఇక్కడే వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే ప్రతి అధికారిపై చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో అందోల్ మండల తహశీల్దార్ నాగేశ్వర్‌రావు, ఎంపిడిఓ కరుణశీల, ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది డాక్టర్లు రూపెన్ చక్రవర్తి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.