మెదక్

హోరెత్తుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట/ సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 1: సిద్దిపేట మున్సిపల్ ఎన్నిల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం, పాదయాత్రలు నిర్వహిస్తు వార్డుల్లో దూసుకుపోతున్నారు. వార్డుల ప్రచారంలో మహిళలు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. ఇంటింటికి వెలుతు బొట్టుపెట్టి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. శుక్రవారం నాడు అన్ని వార్డులలో పలు పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. 1వ, 2వ, 3వ, 7వ వార్డుల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి హరీష్‌రావు పాదయాత్ర,విస్తృత ప్రచారం నిర్వహించారు. 6వ వార్డులో టిఆర్‌ఎస్ అభ్యర్థి పొన్నమల్ల సువర్ణలక్ష్మి, 7వ వార్డులో మల్యాల ప్రశాంత్, 10వ వార్డులో వేణుగొపాల్‌రెడ్డిలు ప్రచారం నిర్వహించారు. 32వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తాడూరి సాయిఈశ్వర్ ఇంటింటి ప్రచారం చేశారు. 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి బాబా షర్పోద్దీన్, 25వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిని ప్రమీల వార్డులో పాదయాత్ర చేశారు. టిఆర్‌ఎస్ అభ్యర్థులు గ్యాదరి రవీందర్ 11వ వార్డు, ఖాజ అక్తర్ 12వ వార్డు, నాయకం లక్ష్మన్ 17వ వార్డు, ఖాజ నసీరోద్దీన్ 20వ. 25వ వార్డులో మస్కూరి మమత వార్డులలో ప్రచారం నిర్వహించారు. అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని స్థానాలు అధికార టిఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందనే అవకాశం ఉన్నప్పటికి కొన్ని వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు అధికార పార్టీ అభ్యర్థులను బయపెట్టించే పరిస్థితి నెలకొంది. బిజెపి అభ్యర్థులు 14, 17వార్డుల్లో నువ్వనేనా అనే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. టిడిపి 10వ వార్డులో గట్టిపోటి ఇస్తుంది. కాంగ్రెస్ ఉనికిచాటుకోడానికి పోటిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎంఐఎం ముస్లీం ఓట్లు ఉన్న చోట్ల కొంత ప్రభావం చూపనుంది.