మెదక్

గత నెల ప్రజావాణి వినతులకు 24లోగా పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 21 : ప్రజా వాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన దరఖాస్తులను 30రోజులకు మించి ఉన్న దరఖాస్తులను ఈనెల 24లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం జెసి హన్మంత్‌రావు, ఇతర అధికారులతో కలసి ప్రజా వాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణీ కోసం కార్యాలయం ముందు జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్దఎత్తున బారులు తీరారు.
కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, జెసి హన్మంత్‌రావులతు ప్రజలు సమస్యలను విన్నవించగా, సామరస్యంగా ఆలకించి సమస్య పరిష్కారానికి ఆవసరమగు ఆదేశాలు జారీ చేశారు. ఇన్ని రోజులుగా సమస్య ఎందుకు పరిష్కారం కాలేదని, ఇంతకు క్రితం దరఖాస్తు ఇచ్చారా అడిగుతూ దరఖాస్తు దారులకు దైర్యం కల్గించారు. సమస్య పరిష్కారం కోసం దరఖాస్తులపై ఎండస్ చేసి అందచేశారు. అలాగే జెసి హన్మంత్‌రావు, ముఖ్య శాఖల అధికారులు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. సోమవారం జరిగిన ప్రజావాణీలో 102 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
నెల రోజుల్లోగా ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి
ప్రజావాణీ కార్యక్రమం పూర్తయిన ఆనంతరం జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజులకు మించి అధికారుల వద్ద పరిష్కారం కాకుండ ఉన్న దరఖాస్తులన్నిటిని ఈనెల 24లోగా పరిష్కరించాలని సంబంధిత తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, తహశీల్దార్ కార్యాలయాలకు సంబంధించిన దరఖాస్తులు అధికంగా ఉన్నాయని సంబంధిత అధికారులతో సమీక్షించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ హన్మంత్‌రావుకు ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తులను 30 రోజుల్లోగా పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉంచవద్దని సూచించారు. ప్రజా వాణీ దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈకార్యక్రమంలో డిఇర్‌డిఓ సత్యనారాయణరెడ్డి, ఆర్టీఓ ముత్యంరెడ్డి, డిపిఓ సురేష్‌బాబు, మహిళ శిశుసంక్షేమ, వికలాంగుల సంక్షేమాధికారి సుధాకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఉపాధి పనుల గడ్డపారలూ.. దొడ్డిదారిన అమ్ముకున్నారు?
* ఎంపిడివో, టెక్నికల్ అసిస్టెంట్‌లపై
చర్యలకు ఎంపిటిసిల డిమాండ్
నారాయణఖేడ్ వనంబర్ 21: కంగ్టి మండలానికి ఉపాధి కూలీలు పనులు చేసేందుకు ప్రభుత్వం గడ్డపారలను ఎంపిడివో కార్యాలయానికి పంపించగా స్థానిక ఎంపిడివో మధుసూదన్, టెక్నికట్ అసిస్టెంట్ విఠల్ కలిసి బీదర్‌లో 2900 గడ్డపారలను అమ్ముకున్నారని గాజుల్‌పాడ్ ఎంపిటిసి సావిత్రిబాయి, కంగ్టి ఎంపిటిసి సచిన్‌స్వామి, సిద్దంగిర్గా ఎంపిటిసి విద్యావతిసిద్దు, సుక్కుల్‌తీర్థ్ ఎంపిటిసి విఠల్‌రావు, చౌకన్‌పల్లి ఎంపిటిసి బాలప్ప అరోపించారు. సోమవారంనాడు కంగ్టిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉపాధి కూలీలకు గడ్డ పారలు ఇచ్చి వేసవి కాలంలో పని కల్పించాలని అదేశాలతో పని ముట్లు పంపించగా ఎంపిడివో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్‌లు కలిసి అక్రమంగా అమ్ముకున్నారని ఈ విషయంలో జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఎంపిడివో కార్యాలయం అవినీతి పరులకు నిలయంగా మారిందని ధ్వజమెత్తారు. కూలీల సొమ్మును అమ్ముకున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.