మెదక్

పాడిపరిశ్రమకు 25 శాతం కేంద్ర సబ్సిడీ సాధనకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, నవంబర్ 22: కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి ఉమాభారతిని ఢిల్లీలో బుధవారం కలుసుకొని పాడి రైతులకు 25 శాతం సబ్సిడిని ఇవ్వాలని కోరుతామని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. పాడి పరిశ్రమలో ఎస్సీ, ఎస్టీ, బిసీ వర్గాల వారు అధికంగా ఉంటారన్నారు. వీరందరికి కూడా 25 శాతం సబ్సిడీ ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి ఉమాభారతిని కోరుతానని ఆయన తెలిపారు. జిల్లాలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరానికి చాలా సమీపంలో ఉన్న సంయుక్త జిల్లాలు పాడి పరిశ్రమలో వెనుకబడటం పట్ల ఆయన విచారం వ్యక్తం చేవారు. 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగుళూర్, చిత్తూర్, మరొక జిల్లా నుండి 10 లక్షల లీటర్ల పాలు హైదరాబాద్ నగరానికి చేరుతున్నాయని ఆయన తెలిపారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామన, యాదాద్రి రైతులకు కేవలం అతి సమీపంలో హైదరాబాద్ నగరం ఉండటం వలన పాడి సంతతిని అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో రైతులు పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లీడర్ నాలుగు రుపాయలు పెంచిన ఘన చరిత్ర ఉందని మంత్రి తెలిపారు. పాలకేంద్రానికి సంబంధించిన రైతులకు మేనేజింగ్ డైరెక్టర్ వద్ద ఉన్న 50 కోట్ల రుపాయలు రైతులకు ఖాతాలో పడే విధంగా చర్యలు తీసుకుంటానని హరీష్‌రావు ప్రకటించారు. డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి రెండువేల మంది రైతులకు లక్ష రుపాయల చొప్పున రుణాలు అందజేశారన్నారు. తాను బుధవారం ఢిల్లీకి వెళ్తున్నట్లు మంత్రి తెలిపారు. ఢిల్లీలో పాల ఉత్పత్తుల రైతులకు అందజేసే 25 శాతం సబ్సిడి విషయంలో చర్చిస్తానని ఆయన ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల రైతులకు లీటర్‌కు నాలుగు రుపాయలు పెంచిన ఘన చరిత్ర ఉన్నందున ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి వివరిస్తూ పాల ఉత్పత్తిదారులకు 25 శాతం సబ్సిడి కోరుతానన్నారు. కరువు, వడగండ్ల వాన వంటి బీభక్ష పరిస్థితులో రైతులకు పాడి పరిశ్రమ అండగా నిలుస్తుందన్నారు. బిసీల సంక్షేమంలో భాగంగా నియోజకవర్గాలుగా రాష్ట్రంలో 119 గురుకుల పాఠశాలలను వచ్చే సంవత్సరం ప్రారంభిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మత్య్సశాఖకు వంద కోట్ల చేప పిల్లలు చెరువులలో వేయడం జరిగిందన్నారు. పాత మెదక్ జిల్లాకు గత ప్రభుత్వాలు ఐదు లక్షల చేపపిల్లలు చెరువులలో వేయగా తెలంగాణ ప్రభుత్వంలో ఐదు కోట్ల చేపపిల్లలను చెరువులలో వేయడం జరిగిందన్నారు. మత్య్సకారులకు 30 కోట్ల చేపపిల్లలు ఉచితంగా ఈ ప్రభుత్వం అందిస్తుందన్నారు. దీని ద్వారా 300 కోట్ల రుపాయలను మత్య్సకారుల సంపాదన ఉంటుందన్నారు. వీరికి అనుగుణంగా మిషన్ కాకతీయ క్రింద చెరువులను అభివృద్ది చేయడం జరిగిందన్నారు. గొల్లకుర్మలకు 400 కోట్ల రుపాయల రుణాలను అందజేయడం జరిగిందని మంత్రి తెలిపారు. అంతే కాకుండా మరో 600 కోట్ల రుపాయలను యాదవులకు గొర్లు, మేకలు అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాబడుతున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని వర్గాలతో పాటు బిసీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మేలు రకం పాడి గేదెలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇతర రాష్ట్రాల నుండి కొత్త పాడి పరిశ్రమలు కొత్త వంగడాలను తెచ్చుకొని పాడి పరిశ్రమను అభివృద్ది చేసుకోవాలని మంత్రి సూచించారు. కొత్త వంగడాలపై పరిశోధన జరగాలని ఆయన సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పాడి పరిశ్రమ అభివృద్దిపై దృష్టి కేంద్రీకరించారన్నారు. ఇదిలా ఉండగా గోదావరి, కృష్ణ జలాలతో తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ దగ్గర నర్సాపూర్ 50 కిలోమీటర్లు, మెదక్ వంద కిలోమీటర్లు, కూరగాయలు, పాడి పరిశ్రమలకు అతి దగ్గరలో ఉందన్నారు. ఘణపురం ప్రాజెక్ట్ రెండు పంటలకు అనుగుణంగా తయారు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాళేశ్వరం నీళ్లను కూడా ఘణపురం ప్రాజెక్ట్‌లో కలుపనున్నట్లు తెలిపారు. అందువలన పాడి పంటలకు కొదవ లేదన్నారు. తెలంగాణ రాష్టమ్రంతా పచ్చదనంతో కనిపిస్తుందన్నారు. మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ కనెక్టింగ్ జరుగుతుందన్నారు. ఏడాదినర్దంలో మెదక్ పట్టణానికి రైలు వస్తుందని ఆయన తెలిపారు. రైలు వస్తే పాడి, కూరగాయల వ్యాపారానికి అనువుగా ఉంటుందని మంత్రి తెలిపారు. హార్టికల్చర్, గ్రీన్ హౌస్‌లకు ప్రభుత్వం 75 శాతం సబ్సిడి ఇస్తుందన్నారు. నీళ్లకు కొదవ లేదు, కరెంట్ కొదవలేదు, మన ప్రాంతానికి మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు. నావంతు పూర్తి సహకారాన్ని మెదక్ జిల్లా ప్రజలకు అందజేస్తానని మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జడ్పి చైర్మన్ రాజమణి మురళీయాదవ్, పశుగణాభివృద్ది సంస్థ చైర్మన్ లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటి చైర్మన్ కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, డాక్టర్ రాంజీ తదితరులు పాల్గొన్నారు.