మెదక్

నగదు రహిత విధానానికి సిద్దిపేటతో శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, డిసెంబర్ 5 :నగదు రహిత విధానం అమలు కోసం రాష్ట్రంలో సిద్దిపేటను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేశారని, ఈ నియోజికవర్గంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావ్ అన్నారు. పెద్దనోట్లు రద్దుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రత్యామ్నాయంగా నగదురహిత లావాదేవీలకు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. సోమవారం ఆర్టీఓ కార్యాలయంలో లారీ, ఆటో, కారు, డ్రైవర్లు, ట్రాన్స్‌ఫోర్టు సంస్థలకు చెందిన యజమాన్యాలతో జరిగిన సమావేశంలో నగదురహిత విధానాలపై అవగాహన కల్పించారు. నోట్ల రద్దుతో చిల్లర దొరకకపోవడంతో ఎదురవుతున్న సమస్యలపై ఆటో, కారు, లారీ డ్రైవర్లు ఏవిధంగా నష్టపోతున్నారో, వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నగదు రహితం ద్వారా చిల్లర సమస్యకు పూర్తిగా చెక్ పెట్టవచ్చని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లు డిపాజిట్లు చేసి చిన్ననోట్లను విడుదల చేయటం లేదన్నారు. నగదు రహిత విధానాలకు ప్రజలు అలవాటు పడేందుకే చిల్లర నోట్లను విడుదల చేయటం లేదని ఆయన అన్నారు. నియోజక వర్గాన్ని నగదురహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు రూపేకార్డు తీసుకోవాలన్నారు. రూపే కార్డులకు ఏలాంటి సర్వీస్ టాక్స్ పడదని చెప్పారు. ఈకార్డు ద్వారా ఏవైన ప్రమాదం జరిగినా 5 లక్షల ప్రమాద బీమ వర్తిస్తుందని పేర్కొన్నారు. అవసరం దేనినైనా నేర్పిస్తుందని, అధికారుల బృందం ఇంటింటీకి వచ్చి అకౌంట్లు, కార్డులు అందచేస్తారని, చిరు వ్యాపారులకు ప్రత్యేకంగా స్వైప్ మిషన్లు ఏర్పాటు చేస్తారని చెప్పారు. నియోజక వర్గంలో 5600 స్వైప్ మిషన్లు అవసరమని అంచనా వేశామని, రెండురోజుల్లో 2500 మిషన్లు అందచేయనున్నామని అన్నారు. ఆటోడ్రైవర్లకు క్యూఆర్, యుఎస్‌ఎస్‌జీ వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నగదు రహిత నియోజకవర్గంగా సిద్దిపేటను మోడల్‌గా ఎంపిక చేశారని, త్వరలో రాష్టమ్రంత విస్తరించనున్నట్లు తెలిపారు. అంతకుముందు స్వైప్ మిషన్ ద్వారా కార్డును వినియోగించుకొని, క్యాష్‌లెస్‌గా మార్చుకుందామని స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఆనంతరం పత్తి మార్కెట్ యార్డులో పండ్లు, మాంసం దుకాణదారులు, చిరువ్యాపారులకు నగదు రహిత విధానంపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో జెసి హన్మంత్‌రావు, ఆర్టీఓ ఏసురత్నం, చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ అత్తర్‌పటేల్ పాల్గొన్నారు.