మెదక్

అంబేద్కర్ ఆశయాలను విస్మరించిన కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, డిసెంబర్ 9: డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఆశయాలను గత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని బిజెపి రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం మెదక్ జికెఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా దేశంలో ప్రతి ఒక్కరు సమానులుగా ఉండాలనే భావనతో పద్దనోట్లను ప్రధాని మోదీ రద్దు చేశారని ఆయన తెలిపారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఆనాడే పెద్దనోట్లను రద్దు చేయాలని పార్లమెంట్‌లో తీర్మానించినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేయలేదన్నారు. ఈ నెల 6న అంబేద్కర్ వర్దంతి సందర్భంగా మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయనతో పాటు బిజేపి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు. అంతకు ముందు జికెఆర్ గార్డెన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బ్యాండ్ మేళాలతో ఉరేగింపుగా వెళ్లారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ పెద్దనోట్లు రద్దు చేసి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. దేశంలో నెలకొన్న అవినీతిని నిర్మూళించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. స్వచ్చ భారత్ కార్యక్రమంలో పరిసరాల పరిశుభ్రత, శరీర పరిశుభ్రత మాత్రమే ఉంటుందని తెలిపారు. కానీ భారతదేశంలో పరిశుభ్రమైన ఆర్దిక కార్యక్రమాలు నిర్వహించడానికి పెద్దనోట్లు రద్దు చేయడం జరిగిందన్నారు. ఇది ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నప్పటికీ ప్రతిపక్షాలు వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు రెచ్చిపోవడం లేదన్నారు. బ్యాంక్ అధికారులు చాలా చక్కగా పనిచేస్తున్నారని వారికి కితాబునిచ్చారు. నగదు కష్టాలు త్వరలో తిరుతాయి. నగదు కార్యక్రమాలను తగ్గించాలని సభలు, సమావేశాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్వైపింగ్ మిషన్లు అన్ని వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకొని ప్రజలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్యులకు నష్టం లేదన్నారు. ఐదు శాతం ఉన్న ధనవంతుల దగ్గర కిలోల వంతున బంగారం, కోట్ల రుపాయలు నల్లధనం బయటపడుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే 90 కోట్ల ప్రజలకు బ్యాంక్‌లలో ఖాతాలు ఉన్నట్లు తెలిపారు. జన్‌దన్ ద్వారా 25 కోట్ల ప్రజలు అకౌంట్లను ప్రారంభించుకున్నట్లు తెలిపారు. పార్లమెంట్‌లో జరుగుతున్న అంశాలపై ప్రతిపక్షాలు చర్చించకుండా పార్లమెంట్‌ను అడ్డుకుంటున్నాయని తెలిపారు. అవినీతి, నల్లధనాన్ని వెలికి తీసేందుకు నోట్ల రద్దును ప్రధాని చేశారన్నారు. నోట్ల రద్దు ద్వారా పేద ప్రజలకు, గ్రామ ప్రజలకు, దళితులకు అనేక సౌకర్యాలు లభిస్తాయని తెలిపారు. నోట్ల రద్దుతో 95 శాతం ప్రజలకు నష్టం జరగదన్నారు. జిల్లా బిజేపి అధ్యక్షులు చోళ రాంచరణ్‌యాదవ్, బిజేపి నాయకులు ధర్మకారి శ్రీనివాస్, గోదల మల్లేశం, సుభాష్‌చంద్రబోస్‌గౌడ్, వినేష్‌లాల్, శేర్‌సింగ్, సునీల్, రఘు, సంతోష్, మార్కెట్ కృష్ణ, కండెల సుధాకర్, జనార్దన్, నాగరాజు, అరుణ్, సుభాష్, గుండు మల్లేశం, శ్రీపాల్ తదితరులు పాల్గొన్నారు.