మెదక్

కాంగ్రెస్ మెడలు వంచేంత దమ్ము కెటిఆర్‌కు ఉందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 9: కాంగ్రెస్ పార్టీ మెడలు వంచ్చేంత దమ్ము,్ధర్యం కెటిఆర్‌కు ఉందా? నీ వయస్సు ఎంత.. నీ రాజకీయ అనుభవమేంత? అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) ప్రశ్నించారు. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నామంటూ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను సంగారెడ్డిలో ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డి కేక్ కట్ చేసి సోనియాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోనియాగాంధీ జన్మదినం రోజే తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసినందున ఐబి అతిధి గృహం ముందు కృతజ్ఞత సభను నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని గుర్తుచేశారు. తెలంగాణాను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా కెసిఆర్ గారడి మాటలు నమ్మి ప్రజలు టిఆర్‌ఎస్ అవకాశం ఇచ్చారన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే టిఆర్‌ఎస్ కనుమరుగయ్యేదని, ఇప్పుడు పదవులు అనుభవిస్తున్న వారందరూ బజారు పాలయ్యేవారన్నారు. మీవి పర్మినెంట్ పదవులు కావని 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి ఎల్లకాలం రుణపడి ఉంటారన్నారు. సోనియాను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొన్నం శంకర్‌రెడ్డి, నాయకులు ఆంజనేయులు, శ్రీకాంత్, సోంతోష్‌కుమార్, రఘు, సాబేర్, తోపాజీ అనంతకిషన్, శంకర్‌నాయక్‌తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీశ్రేణులు పాల్గొన్నారు.