మెదక్

ప్రజలను అష్టకష్టాల పాలు చేసిన కేంద్రానికి బుద్ధిచెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 15: ముందస్తు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజలను అష్టకష్టాల పాలు చేసిన మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లెపల్లి ఆదిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గురువారం సంగారెడ్డి ఐబి అతిధి గృహంలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ మోదీ తీసుకున్న నిర్ణయంతో బ్లాక్‌మని ఎక్కడ కూడా బయటకు రాకపోవడం గమనార్హమన్నారు. నోట్లు రద్దయి 40రోజులు గడుస్తున్న ప్రజలు బ్యాంకులు, ఎటిఎంల ముందు గంటల తరబడి పడిగాపులు గాయాల్సిన పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో విదేశాల్లో ఉన్న నల్లడబ్బును తీసుకొచ్చి పేదల అకౌంట్లలో జమ చేస్తానన్న హామీని విస్మరించి, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారన్నారు. మొన్నటివరకు కేంద్రంపై ఒంటికాలుపై లేచిన కెసిఆర్ ఢిల్లీ టూర్ తర్వాత నోటికి తాళం ఎందుకు పడిందని, ఆ రహస్య మిలాఖత్‌ను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ, డబుల్ బెడ్ రూం ఇళ్లు, కెజి టూ పిజి నిర్బంధ విద్య, రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం తదితర ఎన్నో హామీలిచ్చి విస్మరించారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎండి జలాలోద్దీన్ మాట్లాడుతూ జిల్లాలో సిపిఐ పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేస్తామన్నారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర నాయకులు మంద పవన్, దయాకర్‌రెడ్డి, జిల్లా నాయకులు తాజోద్దీన్, షఫి, గంగాధర్, బాబుమియా, వజీర్‌బేగ్ తదితరులు పాల్గొన్నారు.

మిత్రుని అంత్యక్రియలకు హాజరైన గద్దర్
తూప్రాన్, డిసెంబర్ 15: తూప్రాన్‌కు చెందిన కొక్కొండ మోహన్‌రెడ్డి అంత్యక్రియలకు జననాట్యమండలి వ్యవస్తాపక అధ్యక్షుడు గద్దర్ హాజరయ్యారు. మోహన్‌రెడ్డి, గద్దర్ తూప్రాన్‌లోని ఉన్నత పాఠశాలలో విద్యాబ్యాసం చేశారు. గద్దర్ ఇక్కడకు వచ్చినప్పుడల్లా తన మిత్రుడని కలిసివెళ్ళేవారు. కొద్దిరోజులతో అస్వస్థతకు గురైన మోహన్‌రెడ్డి చనిపోవడంతో విషయం తెలుసుకున్న గద్దర్ హాజరయ్యారు. అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్‌రాంరెడ్డి, నర్సింహారెడ్డి, బూపతిరెడ్డి, అంజిరెడ్డి, సత్యనారాయణ, కిష్టయ్య, బిక్షపతి, రాములు తదితరులు పాల్గొన్నారు.