మెదక్

సర్వమత సమానత్వమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, డిసెంబర్ 19: మెదక్ సిఎస్‌ఐ చర్చిలో యునైటెడ్ క్రిస్మస్‌ను ఆదివారం రాత్రి 12 గంటల వరకు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి యం.పద్మాదేవేందర్‌రెడ్డి, బిషప్ రెవ. రైట్ సల్మాన్‌రాజ్, ప్రిసిబిటరి ఇన్‌చార్జి రెవ.ర్యాబిన్‌సన్ తదితర గురువులు పాల్గొన్నారు. యునైటెడ్ క్రిస్మస్‌లో ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి కేక్‌ను కట్‌చేసి క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని మతాలను సమతుల్యంగా గౌరవిస్తున్నట్లు పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే క్రిస్మస్ వేడుకల సందర్భంగా నిరుపేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించినట్లు ఆమె తెలిపారు. ఈ విధంగా అన్ని మతాలు సమదృష్టితో చుస్తున్నట్లు ఆమె తెలిపారు. బిషప్ రైట్ రెవ.సాల్మాన్‌రాజ్ మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలు దేశమంతటికీ అనుకూలమైన పండుగని తెలిపారు. ఈ వేడుకలలో భాగంగా బిషప్ మాట్లాడుతూ గతంలో మూలకు పడిన వైద్య, విద్యా సంస్థలను పునరుద్ధరిస్తామని ప్రకటించారు.