మెదక్

క్యాష్‌లెస్ దిశగా దత్తత గ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, డిసెంబర్ 23: నగదు రహిత గ్రామాలుగా ఎర్రవల్లి, నర్సన్నపేటలను సిఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. శుక్రవారం రెండు గ్రామాలలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారభించారు.
ఈసందర్భంగా ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన సభలో సిఎం మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ లాగా ఈరెండు గ్రామాలు నగదు రహిత లావాదేవిలు నిర్వహించేందుకు ఇందుకోసం వంద శాతం బ్యాంకు ఖాతాలను తీసుకున్నట్లు తెలిపారు. ఆదర్శ గ్రామాలుగా రాష్ట్రంలో ఒక గుర్తింపును పొందగా నగదురహిత గ్రామాలుగా అంతే గుర్తింపు పొందనున్నట్లు చేప్పారు. ఎర్రవల్లి గ్రామానికి చెందిన 10 దుకాణ యాజమానులకు స్వైఫ్ మిషన్లను సిఎం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, ఇ,ద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్, ఖమ్మం ఎంపిలు కొత్తప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జడ్పిచైర్‌పర్సన్ రాజమని, సిఎం కార్యలయ ముఖ్యకార్యదర్శి చిత్రరామచంద్రన్, కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, జెసి హన్మంతరావు, ఆర్డీఓ విజేందర్‌రెడ్డి, విడిసి అధ్యక్షులు కిష్టారెడ్డి, రాంచంద్రం, సర్పంచ్‌లు బాల్‌రెడ్డి, భాగ్య, తహశీల్దార్ పరమేశంతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

భారీ బందోబస్తు మధ్య సిఎం పర్యటన
* దళితవాడల్లో పాదయాత్ర
సిద్దిపేట, డిసెంబర్ 23: సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో సిఎం కెసిఆర్ పర్యటన భారీ బందోబస్తు మధ్య విజయవంతమైంది. ప్రజలకిచ్చిన హామీమేరకు సిఎం కెసిఆర్ దత్తత గ్రామాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన డబుల్‌బెడ్ రూంల నిర్మాణాల ప్రారంభోత్సవం పోలీసు బందోబస్తు మధ్య పకడ్బంధీగా నిర్వహించారు. హైద్రాబాద్ రేంజ్ ఐజి నాగిరెడ్డి, డిఐజి అకున్ సభర్వాల్, సిపి శివకుమార్ పర్యవేక్షణలో అదనపు సిపి బాబురావు, ఏసిపిలు నర్సింహారెడ్డి, గిరిధర్, డిఎస్పీలు భాస్కర్‌రావు, సీతారాం ఆధ్వర్యంలో 15మంది సిఐలు, 40మంది ఎస్‌ఐలు, 300మంది పోలీసులు, రోప్‌పార్టీలు సిఎం పర్యటనలో బందోబస్తు చేపట్టారు. డబుల్‌బెడ్ రూం ఫ్రారంభోత్సవంలో భాగంగా నర్సన్నపేటలో పైలాన్ ఆవిష్కరించారు. ఎర్రవల్లిలో డబుల్‌బెడ్ రూం పైలాన్‌తో పాటు కమ్యూనిటి హాల్, కల్యాణమండపాలను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు.
ఎర్రవల్లి దళితవాడల్లో సందర్శించిన సిఎం కెసిఆర్
డబుల్‌బెడ్ రూంల ప్రారంభోత్సవం సందర్భంగా సమావేశంలో పాల్గొన్న అనంతరం తిరుగుప్రయాణంలో ఎర్రవల్లి దళితవాడల్లో సిఎం కెసిఆర్ పాదయాత్ర చేశారు. సిఎం కెసిఆర్, మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపిలు ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గృహనిర్మాణ కార్యదర్శి చిత్ర, కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డిలు దళితవాడల్లోని ప్రధాన వీధుల్లో పాదయాత్ర చేస్తు డబుల్‌బెడ్ రూంల సామూహిక ప్రారంభోత్సవాలను పరిశీలించారు. పలువురితో కెసిఆర్ ముచ్చటించారు. కొత్తగా నిర్మించిన ఇండ్లు ఏలా ఉన్నాయని పలుకరించగా సంతోషంతో ఉబ్బితబ్బిబైనారు. కెసిఆర్ పర్యటన సందర్భంగా పోలీసు యంత్రాంగం డేగకళ్లతో బందోబస్తు చేపట్టారు. 9గం.కు కెసిఆర్ వాహనంలో తిరుగుప్రయాణమైనారు.