మెదక్

డబుల్ బెడ్ రూం నిర్మాణాలను వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మా ణ పనులు సిద్దిపేట జిల్లాలో వేగవంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. ప్రజలకు దసరాకు కానుకగా ఇచ్చేందుకు పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. శుక్రవారం కలెక్టర్‌రేట్ కార్యాలయంలో 40 మంది ఎజెన్సీలకు సంబంధించి ఇంజనీర్లతో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై సమిక్షించారు. జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపై టెండర్ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్, జనగామ, దుబ్బాక, గజ్వేల్ నియోజక వర్గాల్లో 9వేల ఇళ్లు నిర్మించాలని లక్ష్యాంగా నిర్ణయించుకోగా, 4200 ఇళ్లు పురోగతిలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేపట్టాలని, జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. సంక్రాంతి పండుగకు పనులు ప్రారంభించేందుకు కావాల్సిన సన్నహాలు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని హుస్నాబాద్‌లో 160, బెజ్జంకి 80, శనిగరం 40, దుబ్బాకలో 500, గంబీర్‌పూర్‌లో 30, దుబ్బాక అర్బన్‌లో అదనంగా 500 ఇళ్లు, జనగామ నియోజక వర్గంలో 145 ఇళ్ల నిర్మాణాలకు ఆకునూర్‌లో 21, కొమురవెళ్లిలో 38, మద్దూరు మండలం బైరాన్‌పల్లిలో 18, నర్సయపల్లిలో 18 ఇళ్లు, జాలపల్లిలో 30 ఇళ్లు, కొండాపూర్‌లో 20 ఇళ్లు మొత్తం 50 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. గజ్వేల్ నియోజక వర్గంలో 1400 ఇళ్లకు 3 భాగాలుగా విభజించినట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లనిర్మాణంలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో లబ్ధిదారుల పాత్ర ఉండవద్దని కలెక్టర్ అయా ఏజెన్సీ ఇంజనీర్లకు ఆదేశించారు. జిల్లా లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని సం క్రాంతి రోజున ప్రారంభిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా జనవరి నెలఖారులోగా లోపు ప్రారంభం కావాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించే అన్ని ప్రాంతాల్లో పనులు ప్రారం భం కాకముందే లె అవుట్స్ సరిగ్గా చూపించి కలెక్టర్ అనుమతి పొందాలన్నారు. ప్రతి లె అవుట్ తప్పని సరిగా సర్వే చేయించాలన్నారు. ఈ పనులను ఏడాది కాలంలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్స్ నిర్మిస్తున్న కంట్రాక్టర్లకు తనవంతు సహాకారం పూర్తిగా ఉంటుందని హామీనిచ్చారు. ఈసమీక్షలో జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌బాబు, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ ఆర్డీఓలు ముత్యంరెడ్డి, విజేందర్‌రెడ్డి, శంకర్, ఆర్‌అండ్‌బి ఇఇ బాలనర్సయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ముక్కోటి ఏకాదశికి సర్వం సిద్దం

సంగారెడ్డి, జనవరి 6: ధనుర్మాసం ప్రారంభంలో వచ్చే ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణ శివారులో ఉన్న వైకుంఠపురంలోని శ్రీ మహాలక్ష్మీ గోదా సమేత విరాట్ వెంకటేశ్వర స్వామి (అభిష్టసిద్ది) దివ్యక్షేత్రంలో నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేసారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఏర్పాట్లపై వివరించారు. వేలాదిగ తరలివచ్చే భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి మొదలుకుని 14వ తేదీ మకర సంక్రాంతితో వేడుకలు పూర్తవుతాయని తెలిపారు. 11వ తేదీన రథయాత్ర కార్యక్రమంతో పాటుగా కూడారై (క్షీరాన్న నివేదన, అక్షయ పాత్ర వితరణ), 13వ తేదీన భోగి సందర్భంగా గోదా శ్రీనివాస కల్యాణా న్ని వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేసారు. కల్యాణం పూర్తయిన అనంతరం స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన లడ్డూను వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. గత యేడాది కల్యాణం రోజున నిర్వహించిన లడ్డూ వేలం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2016 సంవత్సరంలో నిర్వహించిన వేడుకల్లో 77,77,777.77 రూపాయలకు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహా సతీమణి పద్మినీ లడ్డును దక్కించుకుని రికార్డు నెలకొల్పారు. లడ్డు వేలం ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి అంతా ఏడు ఏడుగానే పెరుగుతూ వచ్చింది. 2015లో ప్రస్తుత సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ 7,77,777.77 రూపాయలకు దక్కించుకుని రికార్డును సృష్టించగా నిరుడు నిర్వహించిన కార్యక్రమంలో పద్మిని రికార్డును తిరగరాసారు. అదే పరంపర కొనసాగితే ఈ యేడాది 7,77,77,777.77 రూపాయల వేలం పాట పాడితే దేశంలోనే అతిపెద్ద రికార్డు సృష్టించడం ఖాయమని నిర్వాహకుల్లో పెద్ద చర్చ కొనసాగుతుంది. 14వ తేదీ సంక్రాంతి రోజున ఊంజల్ సేవ, ఏకాంత సేవతో ధనుర్మాస ఉత్సవాలు ముగియనున్నట్లు నిర్వాహకులు వివరించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా స్వచ్చంద కార్యకర్తలు దగ్గరుండి సేవలు అందిస్తారని వరదాచార్యులు పేర్కొన్నారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే భక్తులు వాహనాలను క్రమ పద్దతిలో పార్కింగ్ చేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ విలేఖరుల సమావేశంలో ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు కుమార్‌రాజ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలి

సంగారెడ్డి, జనవరి 6: సమాజ శ్రేయస్సు కోసం మహిళా సమాఖ్యలు పని చేసి మార్పు తీసుకురావాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మానిక్యరాజ్ కణ్ణన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో స్ర్తి నిధి సమీక్ష సమావేశంలో పాల్గొ ని ఆయన మాట్లాడారు. స్ర్తి నిధి నుంచి ఇచ్చే రుణాలు ఎక్కువ శాతం విద్యా, ఆరో గ్యం, వివాహాలకు ఇవ్వాలన్నారు. అవసరం ఉన్న వారందరికి రుణాన్ని ఇస్తున్నామా లేదా అని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు. గత సంవత్సరంలో స్ర్తి నిధి క్రింద రుణం తీసుకొని గేదెలు కొనుకున్న వారు పాలు ఎవరికి అమ్ముతున్నారు, వాటికి ఏదైనా డిమాండ్ ఉందా అనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. అవసరం లేని చోట్ల రుణాలు ఇవ్వకూడదన్నారు. రరుణం ఇచ్చే విషయంలో ఖచ్చితంగా వ్యవహరించాలని, అంతేకాకుండా వారికి సకాలంలో అందేలా చూడాలన్నారు. స్ర్తి నిధి మహిళలు తమ చుట్టు ఉన్న సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వారికి మేమున్నామని ధైర్యం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. గ్రేడింగ్ ఏడాదికి ఒకసారి కాకుండా ప్రతి మూడు మాసాలకు ఒకసారి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో సుమారు 48 శాతం మహిళలు విద్యావంతులుగా ఉన్నారని కలెక్టర్ తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో చిన్న చిన్న అవసరాలకు ప్రజలు రుణం కోసం ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించడం సరైన పద్దతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళలు విద్యావంతులైనందున వారి చుట్టు ఉండే సమాజాన్ని చైతన్యవంతులను చేసి అధిక వడ్డీలు కట్టే ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వం స్ర్తి నిధి ద్వారా ఇచ్చే రుణాలను సద్వినియోగపర్చుకుని తమ కుటుంబాల ఆర్థిక పరిపుష్టికి కృషి చేయాలని ఉద్బోధించారు. ఈ సమీక్షా సమావేశంలో డిఆర్‌డిఓ అరుణ, డిపిఓ వెంకటేశ్వర్లు, ఎపిఎంలు, విఎల్‌ఇలు, మహిళ సమాఖ్య అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.