మెదక్

న్యాయమూర్తులతో ఎస్పీ చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జనవరి 20: మెదక్ జిల్లా ఎస్‌పి చందనాదీప్తి, అడిషనల్ ఎస్పీ రాంచంద్రారెడ్డిలు శుక్రవారం 8వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎన్.రాజ్‌కుమార్, ప్రథమ శ్రేణి న్యాయమూర్తి డి.వెంకటేశంలను కలిసి న్యాయపరమైన సమన్వయం గురించి చర్చించారు. ఇందులో భాగంగా పరిష్కరించిన కేసులు, పెండింగ్ కేసులు, ఎన్‌బిడబ్ల్యు పెండింగ్ కేసులు తదితర విషయాలను చర్చలు జరిపారు. త్వరలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాలని తెలిపారు. జిల్లాలో సాయుధ ఎస్పీగా విధులు నిర్వహించిన ఎన్‌వి.కిషన్‌రావు బదిలీపై హైదరాబాద్ ఇంటలిజెన్స్ విభాగానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఎస్పీ చందనాదీప్తి, డిఎస్పీ నాగరాజులు ఆయనకు శాలువ కప్పి సత్కరించి రిలీవ్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పీ రాంచంద్రారెడ్డి, మెదక్ డిఎస్పీ నాగరాజు, ఎస్‌బి ఎస్సై నాగేష్, సిబ్బంది పాల్గొన్నారు.
అర్హులైన రైతులందరికీ రుణాలు

గజ్వేల్, జనవరి 20: రైతు సంక్షేమమే లక్ష్యంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని, ఇందులో భాగంగానే అర్హులైన రైతులందరికి రుణాలు ఇవ్వడంతోపాటు రూ. 2వందల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు డిసిసిబి చైర్మెన్ చిట్టి దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గజ్వేల్ మండల పరిదిలోని దిలాల్‌పూర్‌లో నగదురహిత లావాదేవీలపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ముఖ్యంగా రైతులు నగదురహితంపై దృష్టి సారించాలని, ఇందులో భాగంగానే డిసిసిబి ద్వారా 3వందల ఎటిఎం కార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రధాన పట్టణాల్లో ఎటిఎంలను అందుబాటులోకి తెస్తుండగా, కొత్తగా 15 డిసిసిబి బ్రాంచులను ఏర్పాటుచేసి వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఇప్పటికే డిసిసిబి ద్వారా రూ. 3వందల కోట్లు రుణాలు ఇవ్వగా, దీర్ఘకాలిక, బంగారు, వాహన, చిరువ్యాపారులకు రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం గృహ, వాహన రుణాలిస్తుండగా, డిపాజిట్‌లపై అధిక వడ్డి ఇస్తూ సుమారు రూ. 2వందల కోట్లు సేకరించినట్లు చెప్పారు. కాగా డిసిసిబి ద్వారా రుణాలు పొందిన రైతులు తిరిగి చెల్లించి సహకరించాలని కోరారు. పిఎసిఎస్ చైర్మెన్ వెంకట్‌నర్సింహారెడ్డి, డిసిసిబి మేనేజర్ పవన్‌కుమార్, ఫీల్డ్ అఫీసర్ శ్రీకాంత్‌రెడ్డి, ఎఫ్‌ఎల్‌సి శ్రీనివాస్, సిఇఒ బాలయ్య, సర్పంచ్ బూదమ్మ, స్థానిక నేతలు పాల్గొన్నారు.