మెదక్

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ స్కీం వర్కర్ల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జనవరి 20: స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను మానుకోవాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు డిమాండ్ చేశారు. స్కీం వర్కర్ల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముఖ్య అతిధిగా హాజరైన చుక్క రాములు మాట్లాడుతూ సరళీకృత ఆర్థిక విధానాల ప్రభావంతో ప్రభుత్వాలు పూర్తిగా పెట్టుబడిదారుల పక్షం వహిస్తున్నాయన్నారు. 2009-10 నుండి 2015-16 వరకు సుమారు 20లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదార్ల నుండి వసూలు చేసే పన్నులు కూడా ప్రభుత్వాలు వదుకున్నాయని, పేదల కోసం పని చేసే స్కీం వర్కర్లకు బడ్జెట్‌లో కోతలు పెడుతున్నాయని విమర్శించారు. ఈ స్కీంలు చేసే పనులను స్వచ్చంద సంస్థలకు అప్పగించడం లేదా ప్రైవేట్ వారికి ఇవ్వడం పెరిగిందని, ఇది మధ్యాహ్న భోజన రంగంలో ఎక్కువగా జరుగుతుందని ఈ పద్దతి మానుకోవాలని డిమాండ్ చేశారు. స్కీంలను యథావిధిగా కొనసాగించాలని, స్కీంలో పని చేస్తున్న వారందరికి కనీస వేతనం 18వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిఆర్వో రఘురాంశర్మకు వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ప్రవీన్, స్వాతి, ఖాజాపాషా, అశోక్, అంగన్‌వాడి యూనియన్ నాయకులు మంగ, శశికళ, బ్రమరాంభ, జమున, విఓఎల నాయకులు నగేష్, వెంకటేశ్, ప్రవీన్, అర్భన్ హెల్త్ యూనియన్ నాయకులు సంగీత, మధ్యాహ్న భోజనం నాయకులు సాయిలు, వసంత, ఉపాధిహామి ఎఫ్‌ఏలు రాములుతో పాటు స్కీం వర్కర్లు పాల్గొన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో పోలీసు విధులు

సిద్దిపేట, జనవరి 20 : పోలీసులు సమాజంలో భాగమేనని..ప్రజా రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తుంటారని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్ అన్నారు. శుక్రవారం ముస్తాబాద్ చౌరస్తా వద్ద రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన 2కె రన్‌ను ప్రారంభించిన ఆనంతరం మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌ను నేరరహితంగా మార్చెందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ప్రజలతో మమేకపై పనిచేస్తారని, ప్రజలు పోలీసు శాఖకు పూర్తిగా సహకరించాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపడతానన్నారు. సిద్దిపేటలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పట్టణంలో మెయిన్‌రోడ్డు డివైడర్ల వద్ద ఇష్టారీతిగా ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవటంతో పాటు, ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు డివైడర్లను మూసివేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో ఆధునాతనమైన ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసేందుకు రూ.1.58 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. వీటిని పట్టణంలోని వివిధ ప్రాంతాల్లోని ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవలే వరంగల్ జిల్లా నిట్ ఇంజనీరింగ్ కళాశాల ఫ్రొఫెసర్, బిహెచ్‌ఇఎల్ ఇంజనీర్లు పట్టణంలోని ట్రాఫిక్ జంక్షన్లను పరిశీలించినట్లు తెలిపారు. త్వరలో ఆధునికమైన ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుచేసి ట్రాఫిక్ సమస్యను క్రమబద్ధ్ధీకరిస్తామన్నారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ పోలీసు శాఖ ప్రజల భాగస్వామ్యంతో ముందుకువెళ్ల్లే విధంగా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. సిద్దిపేట కమిషనరేట్‌ను నేరరహితంగా మార్చేందుకు సిపి శివకుమార్ కృషి అభినందనీయమన్నారు. నేర రహిత గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. గ్రామాలను నేరరహితంగా మార్చేందుకు తమవంతు కృషిచేస్తామన్నారు. పోలీసు శాఖకు తమవంతు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్లు వేణుగోపాల్‌రెడ్డి, అడిషనల్ సిపి బాబురావు, ఎసిపి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.