మెదక్

తెల్లకార్డు ఉంటే ఇక కల్యాణ లక్ష్మీ కటాక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ టౌన్, జనవరి 20: కల్యాణ లక్ష్మిపథకంలో తెల్లకార్డుదారులందరికీ కులమతాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మిచెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం మెదక్ పట్టణంలోని టిఎన్‌జివో భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మాదేవేందర్‌రెడ్డి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌లకు 103 మంది లబ్ధిదారులకు రూ.60 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ జల్లాకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల ద్వారా నాలుగు కోట్ల రుపాయలు మంజూరయినట్లు ఆమె పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మిపథకాన్ని దళిత, గిరిజన, బిసీ, మైనార్టీల కోసం ప్రవేశపెట్టినప్పటికీ ప్రభుత్వం తెల్ల రేషన్‌కార్డుదారులందరికీ వర్తించేలా సవరణ చేసిందన్నారు. ఈ పథకం ద్వారా పేద కుటుంబీకులైన వారందరూ తమ ఆడ పిల్లల పెళ్లిలను చేసే వారికి వర్తింపజేస్తుందన్నారు. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపడుతోందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామిలన్నింటినీ నెరవేర్చడంతోపాటు కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు మరింత చేరువగా ఉంటుందన్నారు. అభివృద్ధి బాటలో ముందడుగువేస్తూ రైతులకు 9 గంటల విద్యుత్‌ను అందిస్తున్నారన్నారు. ఆసరా, వితంతు, వృద్ధాప్య పెన్షన్లను నిరంతరాయంగా అందించడంతోపాటు రానున్న ఏప్రిల్ మాసం నుంచి ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లకు అందించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే అభివృద్ధి పథకాలను పేదలు సక్రమంగా ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ మెంచు నగేష్, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మెదక్ ఎంపిపి లక్ష్మీ కిష్టయ్య, రామాయంపేట ఎంపిపి విజయలక్ష్మీ, మెదక్ జడ్పిటిసి లావణ్యరెడ్డి, రామాయంపేట జడ్పిటిసి బి.విజయలక్ష్మీలతో పాటు మెదక్, మెదక్ మండలం, హావేళి ఘణాపూర్, నార్సింగి, నిజాంపేట మండలాల తహశీల్దార్లు, కళ్యాణ లక్ష్మీ, శాది ముబారక్ లబ్దిదారులు పాల్గొన్నారు.

ఓటు హక్కుపై అవగాహన పెంచేందుకు ప్రచార రథం

ప్రారంభించిన ఇన్‌చార్జి కలెక్టర్
సంగారెడ్డి టౌన్, జనవరి 20: ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని శుక్రవారం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా ప్రచార రథాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. 18సంవత్సరాల వయస్సు నిండిన యువతి, యువకులు విధిగా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలన్నారు. ఈ ప్రచార రథం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో పర్యటించి ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పిసుందన్నారు. ఓటు విలువను ప్రజలు తెలుసుకొని యువతి, యువకులు ఎపిక్ కార్డును పొందాలని సూచించారు. నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఓటు ద్వారే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో డిఆర్వో రఘురాంశర్మ, ఎఓ కిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.