మెదక్

కరవు రైతుకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 21 : సిద్దిపేట జిల్లా రైతాంగానికి గత సంవత్సరం కరవు వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం మంజూరైనట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. శనివారం ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ గత సంవత్సరం వర్షాకాలంలో కరవుతో దెబ్బతిన్న వర్షాధార పంటలైన మొక్కజొన్న, పత్తి, కంది పంటలకు నష్టపరిహారం వర్తిస్తుందన్నారు. జిల్లాలో పంట నష్టం విలువ 81, 14, 89, 612 రూపాయలు కాగా, మొదటి దశలో 28,66, 51, 933 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇందులో సిద్దిపేట జిల్లాలోని పూర్వపు మెదక్ జిల్లా మండలాలకు 22, 86, 86,066 రూపాయలు సిద్దిపేట జిల్లా కార్యాలయం నుంచి, పూర్వపు కరీంనగర్ జిల్లా మండలాలకు 3, 39, 31, 668 రూపాయలు కరీంనగర్ జిల్లానుంచి, పూర్వ వరంగల్ జిల్లా మండలాలకు 2,41,34,199 రూపాయలు వరంగల్ జిల్లా కార్యాలయం నుంచి నేరుగా రైతుల ఖాతాలో ఆన్‌లైన్ ద్వారా జమవుతాయన్నారు. ఈ నష్టపరిహారం మంజూరుతో 2,04,091 రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. పంట నష్టపరిహారం ఇన్‌పుట్ సబ్సిడీ ఆన్‌లైన్ చెల్లింపుపు సమాచారంపై సంబంధిత మండల వ్యవసాయాధికారులను, గ్రామ రెవెన్యూ అధికారులను సంప్రదించాలని కోరారు.

మెదక్ జిల్లాలో..
ఏడు నగదు రహిత గ్రామాలు
మెదక్ టౌన్, జనవరి 21: మెదక్ జిల్లాలోని ఆరు మండలాల్లో ఏడు గ్రామాలను నగదు రహిత లావాదేవీల నిర్వాహణ గ్రామాలుగా గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ భారతి హోళ్లికేరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చేగుంట మండలం ఇబ్రహీంపూర్, చిన్నశంకరంపేట మండలం చిన్న శివనూర్, ఆరెపల్లి, రేగోడ్ మండలం కొత్వాల్‌పల్లి, తూప్రాన్ మండలం హిమాంపూర్, వెల్దుర్తి మండలం బండపోసానిపల్లి, నార్సింగి మండలం భీమ్‌రావ్‌పల్లి గ్రామాలు డిజిటల్ చెల్లింపులతో కొనసాగుతున్నట్లు ప్రకటించినట్లు ఆమె తెలిపారు. ఆయా గ్రామాల్లో అందరికీ బ్యాంక్ ఖాతాలు తెరిపించడంతో పాటు ఆధార్, టెలిఫోన్ నంబర్లతో అనుసంధానం చేసినట్లు ఆమె తెలిపారు.