మెదక్

కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తున్న రాష్ట్ర సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జనవరి 23: రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం విడుదలచేస్తున్న నిదులను టిఅర్‌ఎస్ సర్కార్ పక్కదారి పట్టిస్తోందని బిజెపి జిల్లా అధ్యక్షులు నరోత్తంరెడ్డి విమర్శించారు. సోమవారం గజ్వేల్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మతప్రాతిపదికన రిజర్వేషన్‌లు చెల్లవని రాజ్యాంగం చెబుతున్నప్పటికీ సిఎం కెసిఆర్ మైనార్టీలను మభ్య పెడుతున్నట్లు విమర్శించారు. ముఖ్యంగా 50 శాతానికి మించకుండా రిజర్వేషన్‌లు అమలుచేయాల్సి ఉండగా, రాష్ట్రంలో మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తామని ఆ అంశాన్ని కేంద్రంపై నెట్టడం ఎంతమాత్రం తగదని నిలదీశారు. అయితే దివంగత వైఎస్‌ఆర్ హయాంలో మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్‌లు కల్పించగా, ఈ అంశం కోర్టులో ఉన్న విషయాన్ని గమనించాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో 54 శాతం ఉన్న బిసిల కోసం కమిషన్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికి సిఎం కెసిఆర్ పట్టించుకోకుండా రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. కాగా కేంద్ర ప్రభుత్వం బిసిలు, ఎస్సిల అభ్యున్నతి కోసం విడుదల చేసిన నిదులు దారి మల్లించడంతోపాటు చివరకు భూసార పరీక్షల నిదులు, విత్తనరాయితీని ఇతర పథకాలకు దారి మళ్ల్లించగా బిజెపి వత్తడితో పంపిణికి సిద్దమవుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుండగా, నిలదీస్తున్న ప్రతిపక్షాలపై అక్రమంగా కేసులు నమోదు చేయిస్తున్నట్లు తెలిపారు. నేతలు ఎల్లు రాంరెడ్డి, పేర్ల శ్రీనివాస్, రాములు, జనార్దన్, శ్రీదర్, బి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మానవ తప్పిదాల వల్లే అధిక రోడ్డు ప్రమాదాలు
* సిద్దిపేట సిపి శివకుమార్
సిద్దిపేట, జనవరి 23: మానవతప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, ప్రమాదాలు తగ్గించేందుకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకే రోడ్డ్భుధ్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సిపి శివకుమార్ అన్నారు. రోడ్డు భధ్రత వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఆర్టీఏ కార్యాలయంలో ర్యాలీని సిపి శివకుమార్, ఆర్టీఓ ఏసురత్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ యేడు రోడ్డు ప్రమాదాల వల్ల వేలాదిమంది విలువైన ప్రాణాలు కోల్పోయారన్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. అతివేగం, అజాగ్రత్తలే ప్రమాదాలకు ముఖ్య కారణమన్నారు. మద్యం సేవించి, సెల్ మాట్లాడుతూ నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. చోదకులు హెల్మెట్, సీటుబెల్టు తప్పకుండా వాడాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు.