మెదక్

ఒక్క రోజులోనే 342 నల్లా కనెక్షన్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూప్రాన్, ఎప్రిల్ 5 : ఒక్క రోజులోనే 342 నల్లా కనెక్షన్‌లు ఇచ్చిన గనత మల్కాపూర్ గ్రామానికే దక్కుతుందని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ పేర్కొన్నారు. మంగళవారం మల్కాపూర్ గ్రామంలో పర్యటించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. వాటర్‌షెడ్ పథకం ద్వారా గోదావరి నీటిని ఇంటింటికీ నల్లా కనెక్షన్ ద్వారా నీరు అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలోనే మల్కాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. త్వరలోనే డబుల్‌బెడ్రూం నిర్మాణాలు చేపడతామని తెలిపారు. ఒక్క రోజులోనే జెసిబిలతో నల్లా పైప్‌లైన్ తీయడం ఇంటింటికీ నల్లా కనెక్షన్‌లు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ రోజే వడ్డెపల్లి నుండి మేయిన్ పైప్‌లైన్‌ను వేసి రాత్రి వరకు మల్కాపూర్‌కు గోదావరి నీటిని పంపిణీ చేస్తామని చెప్పారు. గ్రామాన్ని సర్పంచ్ స్వామి, ఎంపిడిఒ శ్రీనివాస్‌రావు, యువకులు కలిసి అభివృద్దిలో ముందుకు రావడం హర్షనీయమని అన్నారు. ఈ సందర్బంగా గఢా హన్మంతరావు మాట్లాడుతూ 100 శాతం అక్షరాస్యత సాదించిందని చెప్పారు. మల్కాపూర్‌లో జరుగుతున్న అభివృద్ది పనులను పక్క గ్రామాలవారు చూసి తాము తామ గ్రామాలను అభివృద్ది చేసుకుంటామని ముందుకు వస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ శ్రీనివాస్‌రావు, ఇఒపిఅర్డి రాఘవరావు, అర్‌డబ్ల్యుఎస్‌ఎఇ రాజ్యలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.