మెదక్

దరఖాస్తు చేస్తే మంజూరైనట్టేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 5: మెడికల్ కళాశాలపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో హిరో అవుదామనుకుంటే.. జిరో అవడం ఖాయమని, ఈ విషయంలో మళ్లీ స్పందించి మా సమయాన్ని వృధా చేసుకోమని సిడిసి చైర్మన్ విజయేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. మెడికల్ కళాశాల కోసం పెట్టుకుంది దరఖాస్తు మాత్రమేనని, కానీ జగ్గారెడ్డి మెడికల్ కళాశాల మంజూరైనట్లు ప్రవరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని విమర్శించారు. ఆదివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విజయేందర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల పక్షాన అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. గెలిపించిన ప్రజల సంక్షేమానికి పాటుపడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందని, అర్థం..పర్థం లేని ఈ విషయంలో స్పందించి తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోమన్నారు. సంగారెడ్డికి మెడికల్ కళాశాల రాలేదు.. ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్లలేదన్న విషయాన్ని గమనించాలన్నారు. జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తానని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారని, అయినప్పటికి కళాశాల ఏర్పాటుకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అహర్నిషలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో జిల్లాకేంద్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను తీసుకొచ్చి మరిన్ని అభివృద్ధి పనులు మంజూరు చేయించేందుకు ప్రయత్నిన్నాడన్నారు.
పదవి కోల్పోయి ఖాళీగా ఉన్న మీకు ఏం చేయాల్లో అర్థంకాక ఈ విషయాన్ని ముందేసుకొని రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు చాల విజ్ఞులని, వారికి అంతా తెలుసని, అసత్య ప్రచారాలు మానుకోవాలని హితువుపలికారు. సమావేశంలో మార్కెట్ కమిటి చైర్మన్ కొండల్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోవర్ధన్‌నాయక్,టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు చిల్వెరి ప్రభాకర్, పట్టణ అధ్యక్షులు శ్రీనివాసచారి, ప్రధాన కార్యదర్శి నర్సింలు, నాయకులు రాంరెడ్డి, జలాలోద్దీన్‌బాబా, హరికిషన్, వెంకటేశం, రవి తదితరులు పాల్గొన్నారు.

మిషన్ భగీరథ పనుల పరిశీలన
గజ్వేల్, ఫిబ్రవరి 5: మండల పరిదిలోని రిమ్మనగూడ, కొడకండ్లలో మిషన్ భగీరథ పనులను ఆదివారం జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన సరఫరా అవుతున్న నీటిని తాగడంతోపాటు ఎంతో ఖర్చుతో ఇక్కడికి రప్పిస్తున్న గోదావరి జలాలను వృధా చేయవద్దని సూచించారు. ఆయన వెంట సర్పంచ్ మహేందర్‌రెడ్డి, ఎంపిటిసి అంజియాదవ్ తదితరులు ఉన్నారు.

ఉర్సు ఉత్సవాల్లో అలరించిన పశువుల మేళా

* ఉత్తమ ఎడ్లజతకు రూ.2లక్షలు బహుమతి
* వేల సంఖ్యలో వచ్చిన పశువులు
న్యాల్‌కల్, ఫిబ్రవరి 5: ఏడాదికోసారి జరిగె పశువుల సంతకు వేలాది మంది భక్తులు తమ ఎడ్లు, కోడెద్దులు, కోడె దూడలు, గేదెలు, అవులతో తరలివచ్చారు. దీంతో ఉర్సేషరీఫ్ మీర్‌గైబ్‌సాబ్ దర్గా ప్రాంతం కిక్కిరిసింది. ఉర్స్ ఉత్సవాలలో భాగంగా పశువుల సంత నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం దర్గావద్ద నిర్వహించిన పువుల సంతకు వేల సంఖ్యలో పశువులు వచ్చాయి. అత్యధిక ధరలు పలికాయి. న్యాల్‌కల్ గ్రామ శివారులో ఉర్సెఫరీఫ్ మీర్‌గైబ్‌సాబ్ దర్గా వద్ద ఆదివారం జరిగిన పశువుల సంతకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్టల్రనుంచి రైతులు తమ పశువులతో తరలివచ్చారు. భక్తులు తమ పశువులను అమ్మడం కొనడం తదితర లావాదీవీలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పశువుల యజమానులు తమ పశువులకు అందంగా అలంకరించి జాతర సందర్భంగా జరిగే సంతకు తీసుకుని వచ్చారు. మరికొందరు రైతులు ఎడ్లు కొనేందుకు పోటీపడ్డారు. ఎడ్లు, కోడె దూడలు, అవులు, బర్రెలు కొనెందుకు రైతులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో రావడంతో నాణ్యమైన పశువులు ఆశించిన ధరకు అమ్మకమయ్యాయి. జాతరలో ప్రధానంగా దియోని, ఒంగోలు జాతుల ఎడ్లు, కోడెలు, ఆవులు, పాడిగేదెలు, లేక దూడలు తరలివచ్చాయి. జాతరకు తరలివచ్చిన ఒక్కో జత సుమారు రూ.50వేలనుంచి రూ.2లక్షల వరకు ధర పలికింది. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు ఆకర్షణీయమైన పశువుల జతలకు బహుమతి ప్రదానం చేశారు. ఉత్తమ ఆవుదూడ న్యాల్‌కల్ వడ్లమాణిక్‌కు వరించగా, ఉత్తమ కోడెదూడ ప్రథమ బహుమతి రాయికోడ్ మండలం మైకోడ్ లక్ష్మారెడ్డికి వరించింది. ద్వితీయ బహుమతి బర్దీపూర్ మోహన్‌కు లభించింది. ఇక్కడి సంతలో చంద్రకాంత్‌కు చెందిన కోడెల జత రూ.1.75వేలకు అమ్ముడు పోయింది. న్యాల్కల్ మచ్కురి కిష్టన్న జత ఎడ్లకు రూ.2లక్షలకు అమ్మకమైంది. అదేవిధంగా మనె్నల్లి జాఫర్ కోడెదూడలు రూ.1.60వేలకు ధర పలకగా రాయికోడ్ బస్సప్ప ఎడ్లజడ రూ.1.80వేలు పలికింది. అదేవిధంగా తన గుర్రాన్ని కాకిజనవాడ లక్ష్మయ్య రూ.1.50వేలకు అమ్మాడు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆలయ కమిటి అధ్యక్షలు ఎండి.ఉస్మాన్, ఉపాధ్యక్షులు అబ్దుల్హ్రీం చౌదరి, ప్రత్యేక కార్యదర్శి యూసూఫ్‌ఖాన్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వట్టికోట తెలంగాణ అక్షర కోట
సిద్దిపేట టౌన్, ఫిబ్రవరి 5: తెలంగాణ సాహిత్యంలో వట్టికోట ఆళ్వార్‌స్వామి అక్షరాల కోటగా సజీవంగా వుంటాడని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి డా.వి.శంకర్ అన్నారు. ఆదివారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో వట్టికోట ఆళ్వార్‌స్వామి 56వ వర్థంతి జరిగింది. ఆళ్వార్‌స్లామికి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ తెలంగాణ కవులకు, రచయితలకు వట్టికోట గొప్ప స్ఫూర్తిని నింపాడన్నారు. జాతీయోధ్యమాన్ని ఆయన సాహిత్యం ఉత్తేజ పరిచిందన్నారు. తెలంగాణ మాండలికాన్ని సుసంపన్నం చేశారన్నారు. ఆయన రచనల్లో పరుచుకున్న అద్భుత సామెతలు మరువలేనివన్నారు. కవి పొన్నాల బాలయ్య మాట్లాడుతూ సమైక్యపాలనలో వట్టికోట ఆళ్వార్‌స్వామి సాహిత్య వైభవాన్ని వలసదారులు మరుగున పరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. తెరసం ప్రతినిధులు, రచయితలు సిద్దంకి యాదగిరి, భగవాన్‌రెడ్డి, వేముగంటి రఘనందనాచారి, తోటఅశోక్, గంబీపూర్ యాదగిరి, చిలుముల శ్రీనివాస్, టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

వివరాలిచ్చిన ఉద్యోగులకే ఫిబ్రవరి వేతనాలు

మెదక్ రూరల్, ఫిబ్రవరి 5: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పూర్తి వివరాలు సేకరించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉద్యోగులు, వారికుటుంబ సభ్యులు, తీసుకుంటున్న వేతనాలు వివరాలు సక్రమంగా నమోదు కానందున ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పూర్తి స్థాయిలో సమాచారం అందుబాటులో లేదు. ఇలాంటి అంశాలను అధిగమించడానికి ఉద్యోగుల వివరాలు సేకరించేందుకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించింది. ఉద్యోగులు నిర్ధేశించిన ఫార్మాట్‌లో తమ వివరాలు నింపి డ్రాయింగ్ అధికారి ద్వారా డిటీఓ కార్యాలయంకు పంపించాల్సి ఉంటుంది. ఉద్యోగుల వివరాలు తెలిపిన వారికి మాత్రమే ఫిబ్రవరి మాసపు వేతనం చెల్లించనున్నారు. వివరాలు నమోదుకోసం సంబంధిత ఫాంను డ్రాయింగ్ అధికారి ద్వారా ఉచితంగా పొందవచ్చు. ఉద్యోగులు ఎవరైన దీర్ఘకాలిక సెలవుల్లో, విదేశాల్లో, అనధికార సెలవుల్లో ఉన్నా, ఫారిన్ సర్వీసులో ఉన్న అధికారులు, మరే ఇతర కారణాల చేతనైనా కార్యాలయంలో అందుబాటులో లేకుంటే సంబంధిత డ్రాయింగ్ అధికారి ఆ ఉద్యోగికి సంబంధించిన సర్వీస్ పుస్తకంలో వివరాల ఆధారంగా సంబంధిత ట్రెజరీ అధికారి సమాచారం అందజేయాల్సి ఉంటుంది. రాష్ట్ర పరిధిలో పనిచేస్తున్న అన్ని శాఖల ఉన్నతాధికారులు తమ ఉద్యోగుల వివరాలు సేకరించి అన్ని వివరాలు ఉన్నాయాలేదా అని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఉద్యోగులు తమ ఫిబ్రవరి వేతనం బిల్లుతోపాటు వివరాలు అందజేయాల్సి ఉంటుంది.
ఇవ్వాల్సిన వివరాలు
ఉద్యోగులు తమ వివరాలు, తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, వారి ఆధార్ కార్డు నెంబర్లు, నివాస ప్రాంతం పూర్తి చిరునామా, సర్వీస్ వివరాలైన ఉద్యోగంలో చేరిన తేది, బ్యాంకు ఖాతాలు, జీపిఎఫ్, సీపీఎస్; టిఎస్‌జిఎల్‌ఐ, పాన్ కార్డు తదితర వివరాలు అందజేయాలి. ఉద్యోగి ప్రభుత్వానికి చెల్లిస్తున్న లోను వివరాలు, సెలవు వివరాలు, ఆర్జీత, సగము వేతనపు సెలవులతోపాటు ఇతర పూర్తి వివరాలు ఇవ్వాలి.

సిఎం కెసిఆర్ కృషితోనే
బ్రాహ్మణ సంక్షేమానికి రూ. 100 కోట్ల నిధి

* బ్రాహ్మణ పరిషత్ నియోజకవర్గ
అధ్యక్షుడు హన్మంతరావు పంతులు
గజ్వేల్, ఫిబ్రవరి 5: సిఎం కెసిఆర్ కృషితో బ్రాహ్మణుల సంక్షేమానికి రూ. వంద కోట్లతో నిధి ఏర్పాటుతోపాటు 7 ఎకరాల విస్తర్ణంలో బ్రాహ్మణ సంఘ భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటుండగా, బ్రాహ్మణులు గౌరవంగా జీవించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం సాహసోపేతమని బ్రాహ్మణ పరిషత్ నియోజకవర్గ అధ్యక్షులు హన్మంతరావు పంతులు పేర్కొన్నారు. ఆదివారం గజ్వేల్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా శాఖా భేదం లేకుండా బ్రాహ్మణులు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని, సమాజంలో బ్రాహ్మణుడికి మంచి గౌరవం, గుర్తింపు ఉందని, వేదధర్మం ఆచరిస్తూ లోక కల్యాణార్థమై విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బ్రాహ్మణత్వానికి విఘాతం కలగకుండా, వ్యక్తిత్వ విలువలు కాపాడు కుంటూ, హిందూ ధర్మ విశిష్టత చాటిచెప్పి సమాజ మార్పునకు కృషి చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా బ్రాహ్మణ పరిషత్ కృషి చేస్తుందని, సవరణలతోనైనా ఆర్థికంగా వెనకబడిన పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి సిఎం కెసిఆర్‌ను మెప్పించి ఒప్పిస్తామని చెప్పారు. కాగా ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలలో బ్రాహ్మణులకు ప్రత్యేక కోటా ఉండేలా చూస్తామని, ఆధ్యాత్మిక భావన కలిగిన సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి, చేపడుతున్న పథకాలు, ప్రజల సంక్షేమానికి నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో బ్రాహ్మణులు చేయూతనిస్తున్న విషయాన్ని గమనించాలని తెలిపారు. బ్రాహ్మణ సంఘ నేతలు విశే్వశ్వర్‌రావు, పాండురంగ శర్మ, రాంఫణిధర్‌రావు, సోమనాథశర్మ, యాయవరం శ్రీ్ధరశర్మ, నందబాల శర్మ, దేశపతి రాజశేఖర శర్మ, రాంప్రసాద్‌రావు, సుధాకర శర్మ, జితేందర్‌రావు, నాగేందర్‌రావు, శశిధరశర్మ, గోపాల్‌రావు పాల్గొన్నారు.
కెసిఆర్, హరీష్‌రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 5: సిద్దిపేట గాయత్రి విశ్వకర్మ ఆలయ భవనానికి 60 లక్షల రూపాయలను మంజూరు చేసినందుకు సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావుల ఫ్లెక్సీకి అదివారంనాడు సిద్దిపేటలో పాలభిషేకం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గాయత్రి విశ్వకర్మ అలయానికి నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజులలో విశ్వకర్మ సమాజానికి చేయుతను అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిధులను మంజూరు చేసినందుకు సిఎం, మంత్రి హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు.