మెదక్

గీత కార్మికుల ప్రమాద బీమా రూ.5లక్షలకు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, ఫిబ్రవరి 20: రాష్ట్రంలో గీత కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రమాద బీమ ద్వారా వారికి రూ.50 వేల నుండి రూ. 5లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు వెల్లడించారు. త్వరలోనే జిఓను జారి చేయనున్నట్లు తెలిపారు. సోమవారం మండల పరిధిలోని శ్రీకొండపోచమ్మ ఆలయానికి తన కుటుంబ సభ్యలతో వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల పాలనలో నిరధరణకు గురైన కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చెందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇందులో బాగంగానే కులాల వారిగా వివరాలు సేకరించి వారిని ఆర్థికంగా అభివృద్థి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా గీత కార్మీకుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని వారికి స్థానికంగా ఉపాది లభించే విదంగా ప్రభుత్వ, ఖాళి స్థలాలలో 5లక్షల ఈత, తాటి చెట్లను పెంచేందుకు ప్రణాళికలు సిధ్ధం చేసినట్లు చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో భహుళ ప్రాచుర్యం పొందిన కొమురవేల్లి మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు శ్రీకొండపోచమ్మ ఆలయాల అభివృద్ధికి దేవాదాయ శాఖ ద్వారా నిధులు మంజూరి అయ్యెవిదంగా కృషి చేస్తానని ఆమీ ఇచ్చారు. అలాగే ఆదాయ సౌకర్యాలున్న కోమురవేల్లి ఆలయాం అభివృద్ధిలో ఆశించిన ఫలితాలు సాదించక పొవటంతో భక్తులు తీవ్రఇబ్బందులకు గురవుతున్నారని మంత్రి అన్నారు. దిన్ని దృష్టిలో పెట్టుకుని దేవాదాయ శాఖ మంత్రితో చర్చించి రేండు ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని చప్పారు. రాజీవ్ రాహాదారి నుండి రేండు ఆలయాలకు రింగు రోడ్డు సౌకర్యం కల్పిస్తే రవాణ సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బందులుండవని, ఇందుకోసం సిఎం దృష్టికి తీసుకు పోయి రింగు రోడ్డు నిర్మాణం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్‌తో పాటు కార్యకర్తలు ప్గొన్నారు.

వేసవిలో ఇంటింటికీ తాగునీరు
ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి
పాపన్నపేట, ఫిబ్రవరి 20: వచ్చే వేసవిలోగా మిషన్ భగీరథ పథకం ద్వారా మెదక్ నియోజకవర్గ ప్రజలందరికి ఇంటింట తాగునీటిని సరఫరా చేస్తామని తెలంగాణ శాసనసభ ఉపసభాపతి యం.పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ పథకం క్రింద అన్నారం, లక్ష్మీనగర్, యూసూఫ్‌పేట గ్రామాల్లో చేపడుతున్న వాటర్ ట్యాంక్ నిర్మాణాలకు ఉపసభాపతి సోమవారం భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక విలేఖరులతో పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ 820 కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ఈ పథకానికి సింగూర్ రిజర్వాయర్ నుండి నీటి పంపిణీ జరుగుతుందన్నారు. 17 కోట్లతో పైప్‌లైన్ నిర్మాణం పనులు జరుగుతున్నాయని, పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. 2017 డిసెంబర్ వరకు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. జూలై నెలలో మెదక్‌లో ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. వచ్చే వేసవిలోగా మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలందరికి ఇంటింటికి తాగునీరు అందించేందుకు తెరాస ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆమె తెలిపారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కొకుంట రబీ సీజన్ పంటలకు విద్యుత్ కొరత లేకుండా నిరంతరం 9 గంటల పాటు విద్యుత్ అందిస్తామని తెలిపారు.
రబీకి 10 వేల మెగావాట్ల విద్యుత్ అవసరముందన్నారు. ప్రస్తుతం 8 వేల మెగావాట్ల విద్యుత్ ఖర్చు అవుతుందని, మరో రెండు వేల యూనిట్ల విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆమె వివరించారు. యూసూఫ్‌పేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఉపసభాపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల తెరాస అధ్యక్షులు పి.ప్రశాంత్‌రెడ్డి, పాపన్నపేట ఎంపిపి అధ్యక్షురాలు పవిత్ర దుర్గయ్య, జడ్పిటిసి సభ్యురాలు స్వప్న బాలాగౌడ్, పాపన్నపేట మార్కెట్ కమిటి చైర్మన్ రవీందర్‌నాయక్, ఎంపిపి ఉపాధ్యక్షులు జి.విష్ణువర్దన్‌రెడ్డి, మండల సర్పంచ్‌ల ఫొరం అధ్యక్షులు చావ బాపారావు, ఎంపిటిసిల ఫొరం అధ్యక్షులు సత్యనారాయణగౌడ్, తెరాస నాయకులు దుర్గయ్య, బాలాగౌడ్, పి.విష్ణువర్దన్‌రెడ్డి, మండల పరిధిలోని సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.