మెదక్

దేశాన్ని ముక్కలు చేసే కుట్రల పట్ల అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఫిబ్రవరి 24: కులాలు, మతాలు, వర్గాల పేరిట విడిపోవడం తగదని, దేశంలో పుట్టినవారంతా హిందువులేనని హిందూ దేవాలయ ప్రతిష్ఠాన పీఠాధిపతి శ్రీకమలానంద భారతీ తీర్థ స్వామీజి ఉద్బోధించారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలోని శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప క్షేత్రంలో సమరసతా వేదిక ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరై భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. దేశ సరిహద్దులోని శత్రువుల కంటే దేశంలోని విద్రోహకర శక్తులే అత్యంత ప్రమాదకరమని, దేశాన్ని ఏలే పాలకులు జాగ్రత్తలు తీసుకోకుంటే భవిష్యత్తు తరాలు క్షమించవని స్పష్టం చేశారు. ముఖ్యంగా లోక కల్యాణార్థమే యజ్ఞ యాగాదులు జరుగుతుండగా, దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు జరిగితే పశుపక్ష్యాదులు, జల వనరులు, పాడిపంటలు సంవృద్ధిగా ఉంటాయని తెలిపారు. అయితే అందుకు భిన్నంగా దేవాలయాలు శిథిలావస్థకు చేరితే ఆ ప్రాంతం పాడుబడుతుందని, పురాతన క్షేత్రాల అభివృద్ధి, హింధూ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపడుతున్న పండగలు, సాధుసంతులు, దేవీదేవతలు, గోమాత, రామాయణ, మహా భారత ఇతిహాసాది గాధలు, రామసేతువు సంరక్షించబడాలని ఆకాంక్షించారు. సజీవమైన భగవంతుని ప్రతిరూపం ఎదురుగా కూర్చొని పూజించే ఆచారం హైందవులకే ఉండగా, పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్న నేటితరం యువత హిందూ మతంలోని తీయదనాన్ని కోల్పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమాజాన్ని ప్రతి ఒక్కరూ ప్రేమించాలని, గౌరవించాలని, తోటి మనిషిని మనిషిగా చూడనివారు మనుషులే కాదని ఆయన అన్నారు. అంతరించిపోతున్న వ్యక్తిత్వ విలువలకు ప్రాణం పోయాలని, పురాతన కాలంలో ఒకే వర్గం ఉండగా, తదనంతరం వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడినట్లు పేర్కొన్నారు. కుల వృత్తులతో దేశం ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా విలసిల్లిందని, విదేశీ పాలనలో కులాధారిత వృత్తులు నశించి అస్పృశ్యత, సాంఘిక దురాచారం సమాజంలో ప్రవేశించినట్లు తెలిపారు. అయితే అంటరానితనం, కుల, వర్గ వైషమ్యాలు తొలగించి సమసమాజ స్థాపన లక్ష్యంగా ముందుకు సాగాలని స్వామీజీ హితవుపలికారు. కార్యక్రమంలో సామాజిక సమరసతా వేదిక జిల్లా అద్యక్షుడు డాక్టర్ నరేశ్‌బాబు, ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు డాక్టర్ మల్లయ్య, డాక్టర్ పెంటాచారి, మూట కోడూరి బ్రహ్మం, సిద్ధి భిక్షపతి గుప్త, శ్రీనివాస్‌గుప్త, న్యాయవాది రమణ, అమరాది రమేశ్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పరమేశ్వరాచారి, గంటా శంకరయ్య, గాలెంక నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

పుల్లూరు ఎంపిటిసి స్థానానికి 7 నామినేషన్లు
సిద్దిపేట రూరల్, ఫిబ్రవరి 24: సిద్దిపేట మండలం పుల్లూరు ఎంపిటిసి స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికకు శుక్రవారం ఆరుగురు అభ్యర్థులు ఏడు నామినేషన్లను దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి, ఎంపిడిఓ సమ్మిరెడ్డి తెలిపారు. టిఆర్‌ఎస్ పార్టీ నుండి మృతి చెందిన ఎంపిటిసి సతీమణి గంగపురం సంతోషిమహేష్, మాజీ సర్పంచు కర్రె రాజులు చెరో నామినేషన్‌లను దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ నుండి ఉడుత రవి ఒక సెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. బిజెపి పార్టీ నుండి చిట్కూల్ ప్రసాద్‌రెడ్డి రెండు నామినేషన్లు, పోతరాజు రాజు ఒక నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్య్ర అభ్యర్థిగా ములుగు కనకయ్య నామినేషన్లను దాఖలు చేసినట్లు ఎంపిడిఓ తెలిపారు.

ఉద్యమకారుడి కుటుంబానికి సర్కారు చ్ఘేయూత
హత్నూర, ఫిబ్రవరి 24: తెలంగాణ ఉద్యమకారుడు దివంగత టి.జనార్ధన్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అన్నీ తానై ముందుండి నడిపించిన జనార్ధన్‌రెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. అప్పట్లో అంత్యక్రియలకు హాజరైన మంత్రి హరీష్‌రావు కుటుంబానికి అండగా ఉంటామని హామీఇచ్చారు. ఈక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి రూ.5 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం హత్నూర శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్ యాదవ్, జడ్పీటిసి సభ్యుడు పల్లె జయశ్రీ, టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవేందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఎల్లదాస్, యాదగిరి, అశోక్, దుర్గంగౌడ్ పాల్గొన్నారు.