మెదక్

అంతటా భక్తి పారవశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఫిబ్రవరి 24: సృష్టికి లయ కారకుడైన బోళాశంకరుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినాల్లో ఒకటైన మహాశివరాత్రి పండుగ ఊరు, వాడ అనే తేడాలేకుండా శివనామ స్మరణతో మారుమ్రోగాయి. చిన్న చిన్న శివాలయాలు మొదలుకుని ప్రసిద్దిగాంచిన అన్ని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. తెల్లవారుజామున 3.30 గంటలకు లింగోద్భవ కాలం నుంచి హర..హర..మహాదేవ, శివపంచాక్షరి మంత్రాలతో భక్తులు ఆదిదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడ్డారు. దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచి భక్తుల విశ్వాసాన్ని పెంపొందిస్తున్న ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్టల్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామి సన్నిదిలో తరించారు. అమృతగుండంలో పుణ్యస్నానాలు చేసి దైవ దర్శనం చేసుకున్నారు. భారీగా క్యూలైను ఉండటంతో కొంత మంది ప్రత్యేక దర్శనానికి ప్రాధాన్యతను ఇచ్చారు. భక్తుల సౌకర్యార్థం చేసిన ఏర్పాట్లలో లోపాలు తలెత్తడంతో ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వం పక్షాన స్వామి వారికి పట్టు వస్త్రాలను శాసన సభ డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి మధ్యాహ్నం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా మహాశివరాత్రి సందర్భంగా అమ్మవారి వేడుకలు నిర్వహించడం ఏడుపాయల వనదుర్గా మాత సన్నిదిలో ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణాకే తలమానికమైన వనదుర్గా మాతను ప్రసన్నం చేసుకోవడానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యుపి, బిహార్ తదితర ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి తరిస్తారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయ అధికారులు చక్కటి ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఏ మాత్రం అసౌకర్యానికి గురికాకుండా మాతను ప్రసన్నం చేసుకున్నారు. కుంకుమార్చనలతో పాటు అలంకారం చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సంప్రదాయం ప్రకారంగా రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు, డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఘన్‌పూర్ ప్రాజెక్టులో నీటి మట్టం అధికంగా ఉండటంతో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అపశృతులు చోటు చేసుకుండా తగిన జాగ్రతలు వహించారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా ప్రధాన కూడళ్లు, గర్భాలయం వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసి పటిష్టమైన నిఘా పెట్టారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు మహాశివరాత్రి వేడుకలను ప్రత్యేకంగా పర్యవేక్షించడం విశేషం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో శివనామ స్మరణతో భక్తులు తరించారు. కొమురవెళ్లి మల్లన్న స్వామి ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు వచ్చి వారి ఇష్ట ప్రకారంగా పూజలు నిర్వహించుకుని స్వామిని ప్రసన్నం చేసుకున్నారు. పెద్దశంకరంపేట మండలం కొప్పోల్ సంగమేశ్వర స్వామి ఆలయంలో కూడా తిరునాళ్లు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. సిద్దిపేట పట్టణంలోని కోటిలింగాల మందిరంలో భక్తులు బారులు తీరారు. పటన్‌చెరు మండలం బీరంగూడ మల్లికార్జున స్వామి మందిరానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి మహాశివరాత్రి ఉపవాస దీక్షలను విరమించారు. భక్తులు ఉపవాస దీక్షలు విరమించేందుకు నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేసారు. మహాశివరాత్రి పర్వదినం రోజున ఉపవాస దీక్షలు ఉండటంతో పాటు రాత్రి జాగారం చేస్తే శివుడు పరవశించి కోరిన కోర్కెలు తీరుస్తాడనే విశ్వాసం మేరకు భక్తులు జాగారం చేసే సౌకర్యం ఆయా మందిరాల్లో కల్పించారు. రాత్రి సమయాల్లో నిద్రపోకుండా ఉండేందుకు కాలక్షేపం నిమిత్తం ధార్మిక కార్యక్రమాలను సైతం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు. ఆయా స్వచ్చంద సంస్థలు, యువజన సంఘాలు మందిరాల వద్ద ఉపవాస దీక్షలు విరమించే భక్తులకు పండ్లను పంపిణీ చేసారు. ప్రధాన మందిరాలన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలంకరణతో కండ్లు మిరిమిట్లు గొలిపేస్తున్నాయి. ప్రశాంత వాతావరణంలో పరమ శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి చిన్నలు, పెద్దలు, మహిళలు, పురుషులు అనే తేడాలేకుండా దేవదేవుడిని తరించారు.