మెదక్

వైభవంగా ఏడుపాయల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, ఫిబ్రవరి 24: రాష్ట్రంలో అతిపెద్ద రెండవ జాతరగా ప్రసిద్ధిచెందిన ఏడుపాయల వనదుర్గ్భావానీ మహాశివరాత్రి జాతర ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రతినిధిగా హాజరైన భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వేద బ్రాహ్మణోత్తములు, ఆలయ అర్చకుల ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ వనదుర్గామాతకు పట్టు వస్త్రాలను సమర్పించారు.శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి మురళీ యాదవ్ తదితరులు ఆయన వెంటవున్నారు. ఆలయ ఈఓ టి.వెంకటకిషన్‌రావు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో, భాజా భజంత్రీల నడుమ ఆలయ మర్యాలతో ఘన స్వాగతం పలికారు. వనదుర్గామాత అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక విశేషాలంకరణ పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి హరీష్‌రావు ఏడుపాయల జారత ఉత్సవాలను లాంచనంగా ప్రారంభించారు. కాగా అంతకు ముందు దేవస్థాన కార్యాలయం నుంచి మంత్రి హరీష్‌రావు తలపై అమ్మవారి పట్టు వస్త్రాలను పెట్టుకొని వనదుర్గామాత గర్భాలయానికి భారీ ఉరేగింపుతో చేరుకొని పట్టువస్త్రాలను సమర్పించి దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రి, ఉపసభాపతి, ఎంపీ, ఎమ్మెల్యే, తెరాస రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి తదితరులకు అమ్మవారి హారతిని ఇచ్చి వనదుర్గామాత ఆశీస్సులను అందజేశారు. ఆలయ మర్యాదలో ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. శాలువలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. మహాశివరాత్రి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు శివదీక్షలు బూని, ఏడుపాయలకు తరలివచ్చి మంజీరలో పుణ్య స్నానాలు ఆచరించి, వనదుర్గామాత అమ్మవారిని దర్శించుకొని కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాక పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ సురేష్‌బాబు, డిఐజి అకున్ సబర్వాల్, జిల్లా ఎస్‌పి చందనాదీప్తి, ఆలయ ఈఓ వెంకటకిషన్‌రావు, మెదక్ ఆర్డీఓ మెంచు నగేష్‌లు ఏడుపాయల జాతరలో మఖాం వేసి భక్తులకు జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. లక్షలాది భక్తులకు ముఖ్యంగా తాగునీరు, తదితర సౌకర్యాలను దేవస్థాన అధికారులు, జిల్లా యంత్రాంగం విస్తృతంగా కల్పించారు. ఆర్టీసీ వారు జాతర కోసం 200 బస్సులను నడుపుతున్నారు. మెదక్ జిల్లా ఎస్‌పి చందనాదీప్తి ఆధ్వర్యంలో వెయ్యి మంది పోలీస్ సిబ్బందితో భారీ పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.

పురాతన ఆలయాల పునరుద్ధరణకు
రూ.7.61 కోట్లు మంజూరు
* మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట, ఫిబ్రవరి 24: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని పురాతన ఆలయాల పునరుద్ధరణకు ఏడు కోట్ల 61 లక్షల, యాభై వేల రూపాయల నిధులు మంజూరైనట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. శుక్రవారం ఫొన్‌లో మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఆధ్యాత్మిక చింతన గల గొప్పవ్యక్తి అన్నారు. ప్రభుత్వం పురాతన ఆలయాలు, మహిమాన్విత క్షేత్రాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. గజ్వేల్‌లోని ప్రాచీన కాకతీయుల నాటి ఆలయాలు ఎన్నో ఉన్నాయని, అవి శిథిలావస్థకు చేరుకుందన్నారు. వాటి పునరుద్ధరణకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పురాతన ఆలయాల అభివృద్ధికై దేవాదాయ శాఖ నుంచి ప్రతిపాదనలు పంపగా రూ.7.61కోట్లు మంజూరైనట్లు తెలిపారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పునరుద్ధరణ పనులు చేపడుతామన్నారు.