మెదక్

రెంఢు పడకల ఇళ్ల నిర్మాణం వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఫిబ్రవరి 27 : సిద్దిపేట జిల్లాలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ ప్రగతిపై తెలంగాణ వేల్ఫేర్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు, ఏజెన్సీ నిర్వాహకులతో కలసి సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 93 గ్రామాల్లో అన్నిప్రాంతాల్లో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ వేగాన్ని పెంచాలని సూచించారు. ముఖ్యమంత్రి నియోజకవర్గమైన గజ్వేల్ ప్రాంతంలోని ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి శనివారం డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై హౌసింగ్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఏజెన్సీలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే తనతో చర్చించాలని, కావాల్సిన వనరులు, సదుపాయాలు సమకూరుస్తానన్నారు. ఈసమీక్షలో తెలంగాణ వేల్పేర్ ఇన్‌ప్రాడెవలప్‌మెంట్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ మల్లేశం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనిల్ కుమార్, డిప్యూటీ ఇఇ హరి యాదవ్, మల్లికార్జున్, రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

రూర్బన్ పథకం అమలుకు సమగ్ర నివేదికలు : కలెక్టర్
సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 27: రూర్‌బన్ పథకం కింద 14అంశాలకు మంజూరైన నిధులను 3సంవత్సరాలకు విభజించి ప్రాధాన్యత పరమైన పనులు చేపట్టడానికి ఆయా శాఖలు నివేదికలు అందజేయాలని జిల్లా కలెక్టర్ మాణిక్యరాజ్ కణ్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రూర్‌బన్ పథకం కింద ఎంపికైన నారాయణఖేడ్ మండలం ర్యాకల్ క్లస్టర్ యాక్షన్ ప్లాన్ నివేదికలపై కలెక్టర్ సమీక్షించారు. రూర్‌బన్ పథకం కింద 3సంవత్సరాలకు గాను యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగిందన్నారు. ర్యాకల్ క్లస్టర్ ఎంపిక కావడంతో పాటు 14అంశాలకు కేంద్ర ప్రభుత్వం నుండి రూ.182 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులను మూడు సంవత్సరాలకు విభజించి నివేదికలు సమర్పించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం సుమారు రూ.5.30కోట్లు మార్చి 31లోపు వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.