మెదక్

ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించండి :హరీష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఏప్రిల్ 7: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి హరీష్‌రావు అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమీషనర్ నవీన్ మిట్టల్, కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌తో కలిసి సమాచార, పౌర సంబంధాల శాఖ పని తీరుపై మంత్రి సమీక్షించారు. ప్రజలకు ప్రభుత్వానికి శాఖ వారధిగా పని చేసి అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహాన కల్పించాలన్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల సమాచారాన్ని విజయ గాథల రూపంలో మీడియాకు విడుదల చేసి విస్తృత ప్రచారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సిద్ధిపేట, గజ్వేల్ ప్రాంతాలకు ప్రత్యేకంగా అధికారులను ఇన్‌చార్జిగా నియమించి ప్రముఖుల పర్యటనలకు ప్రచారం కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గల జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ద్వారా విలేకరులకు ప్రెస్ అక్రిడిటేషన్లు జారీ చేసే ప్రక్రియను చేపట్టాలన్నారు. జర్నిలిస్టులకు హెల్త్‌కార్డుల విషయంలో దరఖాస్తు చేసుకున్న 740మందికి కార్డులు జారీకే చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల అడ్మిషన్ల విషయంలో ఏలాంటి అసౌకర్యం కలగకుండా ప్రణాళిక మేరకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. జర్నలిస్టులకు డబుల్‌బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామని, ఈ విషయంలో తుది మార్గదర్శకాలు రాగానే కలెక్టర్‌తో చర్చించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖ కమీషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ జిల్లాలో ఖాళీగా ఉన్న 3డివిజన్లలో అడిషనల్ పౌర సంబంధాల అధికారుల భర్తీకై వారంలోగా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రచార సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నందున పొరుగు సేవల ఉద్యోగులతో భర్తీ చేసి వారి సేవలు ఫోటోగ్రాఫర్లుగా వినియోగించుకునేందుకు ప్రభుత్వ పరంగా పరిశీలించాలని కమీషనర్ మంత్రిని కోరారు. జిల్లాలో ఉన్న నాల్గవ తరగతి సిబ్బందికి 15రోజుల పాటు ఫోటోగ్రాఫీలో శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వాహనాల మరమ్మత్తులకు నిధుల మంజూరుకు తగు చర్యలు తీసుకుంటామని వివరించారు. విలేకరుల అక్రిడిటేషన్ కాలపరిమితిని ఈ నెల చివరి వరకు పొడిగించామని, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీని నియామకం చేశామని, తదుపరి అక్రిడిటేషన్ కార్డులను కమిటీ జారీ చేయాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఇన్‌చార్జ్ జెసి వర్షిణి, ఎంపి బిబి పాటిల్, సంగారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, భూపాల్‌రెడ్డి, సమాచార శాఖ ఇంజనీర్ కిషోర్‌బాబు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు నాగయ్య కాంబ్లే, జెడి సుజాత, ఎడి డి.శ్రీనివాస్, ప్రెస్ అకాడమి సభ్యులు అంజయ్య, అసిస్టెంట్ డెరెక్టర్ ఎస్‌ఎ హాష్మి, డిఈఓ నజీమోద్దీన్, ఆర్టీసి ఆర్‌ఎం వేణు, గృహా నిర్మాణ శాఖ పిడి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.