మెదక్

రైల్వేమార్గ పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండపాక, మార్చి 15: రైల్వేలైన్ పనులు వేగవంతం చేసేందుకు కృషి చేయాలని జెసి హన్మంతరావు అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని లక్డారంలో రైల్వేలైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులతో మాట్లాడారు. ఎకరానికి 6.75లక్షలు ఇచ్చేందుకు రైతులు అనుమతించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్, తహశీల్దార్ , అధికారులు పాల్గొన్నారు.

ఖేడ్ వెతలు తీరాలంటే.. ఎత్తిపోతల ప్రాజెక్టులే శరణ్యం

సంగారెడ్డి, మార్చి 15: శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బుధవారం నాటి ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నలు సంధించి అమాత్యుల నుంచి సమాధానాలు రాబట్టి నియోజకవర్గాల ప్రజల ప్రశంసలను సంగారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, భూపాల్‌రెడ్డిలు పొందారు. 2017-18 సంవత్సర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అనంతరం స్పీకర్ మధుసూదనచారి కల్పించిన అవకాశం మేరకు ప్రశ్నోత్తరాల్లో బుధవారం నారాయణఖేడ్, సంగారెడ్డి ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు. ఒకరు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సాగునీటి పారుదల శాఖ మంత్రిని ప్రశ్నించగా, పశు సంరక్షణ కోసం పశు సంవర్ధక శాఖ మంత్రిని మరో ఎమ్మెల్యే ప్రశ్నించి సంతృప్తికరమైన సమధానాలు రాబట్టుకోవడంలో సఫలీకృతులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు శాసన సభ ప్రశ్నోతర్తరాల్లో ఏ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు ప్రశ్నించే అవకాశం వస్తుందో తెలియని అయోమయ పరిస్థితులు ఉండేవి. తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించిన అనంతరం ఎమ్మెల్యేలకు అలాంటి చీకుచింతా లేకుండాపోయింది. ప్రతి శాసన సభ సమావేశాల్లో అన్ని నియోజకవర్గాలకు చెందిన శాసన సభ్యులకు ప్రశ్నలు సంధించే అవకాశం లభిస్తోంది. బుధవారం నాడు మొదటగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.్భపాల్‌రెడ్డిని ప్రశ్నించాల్సిందిగా స్పీకర్ మధుసూదనాచారి అవకాశం కల్పించారు. వ్యవసాయ రంగంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన నారాయణఖేడ్ నియోజకవర్గంలో సాగునీటిని అందించాలనే లక్ష్యంతో ఖేడ్ ఎమ్మెల్యే కృతకృతులయ్యారు. కొత్తగా ఏర్పడిన సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టు స్థితిగతులపై ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రస్తావనకు తీసుకువచ్చారు. అతివృష్టి, అనావృష్టి ఏం జరిగినా ఖేడ్ నియోజకవర్గంలో వ్యవసాయం కుదేలవుతుందని, అలాంటి ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగానికి ఆయువుపట్టుగా నిలుస్తున్న నల్లవాగు ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ప్రశ్నించారు. 0.75 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించిన నల్లవాగు ప్రాజెక్టు పరిధిలో 6030 ఎకరాల ఆయకట్టు ఉందని, కానీ పూర్తిస్థాయిలో సాగునీటిని అందించలేకపోతున్నామని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేసారు. ప్రధానంగా ప్రాజెక్టులో పూడిక శాతం పెరిగిపోవడంతో నీటి సామర్థ్యం తగ్గిందని, దీంతో ఆయకట్టు రైతులను నిరాశకు గురి చేస్తుందని చెప్పారు. వర్షాభావ పరిస్థితులు నెలకొంటే ప్రాజెక్టులోకి నీరు రావడం లేదని, ఇందుకు ప్రత్యామ్నాయంగా సింగూర్ నుంచి మంజీర నీటిని ఎత్తిపోతల ద్వారా తరలిస్తే ఆయకట్టు రైతులకు ఊరటనిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసారు. సుమారు 6 కిలోమీటర్ల మేరకు కాలువలను నిర్మించి ఎత్తిపోతల ద్వారా నీటిని సమకూర్చాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే కట్టుకాలువలు కూడా అధ్వాన్నంగా మారాయని వాటిని కూడా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని, ఈ ప్రశ్నలకు సంబంధిత శాఖ మంత్రి సమాధానం చెప్పాలని కోరారు. స్పీకర్ ఆదేశాల మేరకు భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మాట్లాడుతూ నీటి పారుదల శాఖ అధికారులు నల్లవాగు ప్రాజెక్టు మరమ్మతులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించారని తెలిపారు. మొత్తం 19 కోట్ల ప్రతిపాదలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, ఈ నిధులను మంజూరు చేసి ఏప్రిల్ మాసంలో టెండర్లు పిలిచి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. గతంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు ఏమిటో తమ దృష్టిలో ఉందని అదే ఆలోచనతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెప్పారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ స్పీకర్ ప్రశ్నించే అవకాశం కల్పించగా మూగజీవాల పరిరక్షణ, అణగారిపోతున్న కుల వృత్తుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న ప్రయత్నాలకు, పశుసంవర్ధక శాఖను అభివృద్ధి చేసేందుకు కృతకృతులైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గొర్రెల పెంపకానికి ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని, రాష్ట్రంలో ఎన్ని లక్షల కుటుంబాలకు ఎన్ని గొర్రె పిల్లలను సమకూర్చుతున్నారని, యూనిట్ ధర ఎంత, గతంలో మాదిరిగా కాకుండా కాంట్రాక్టరే స్వయంగా గొర్రె పిల్లలను సమకూర్చుతున్నారా? 2017-18 సంవత్సరానికి మాంసం ఉత్పత్తి లక్ష్యం ఎంత? గొల్లకుర్మలే కాకుండా ఇతర వర్గానికి చెందిన వారు గొర్రెల పెంపకంపై ఆసక్తి కనబరిస్తే వారికి ఏ విధంగా గొర్రె పిల్లలను పంపిణీ చేస్తా? వేసవి కాలంలో గొర్రెల సంక్షరక్షణ చర్యలు, పశుగ్రాసం కొరత నివారణ, రోగాల నివారణకు తీసుకోబోయే చర్యలపై సమాధానం ఇవ్వాలని సభ ద్వారా మంత్రిని కోరారు. ఇందుకు స్పంధించిన పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమాధానం ఇస్తూ పశు సంరక్షణకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందన్నారు. ఆరోగ్య పరిరక్షణ, పశుగ్రాసం కొరత నివారణకు కూడా ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతుందన్నారు. గొర్రెకాపరుల వద్ద స్వంత భూములు ఉంటే రెండెకరాల మేరకు పశుగ్రాసం పెంచుకోవడానికి 75 శాతం సబ్సిడి ఇవ్వనుందని తెలిపారు. గొర్రెకాపరులు కాకుండా ఇతర కులాలకు చెందిన వారు గొర్రెలను పోషించడానికి ముందుకు వస్తే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అనుమతించారని అలాంటి వారికి అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. మొత్తంమీద బుధవారం నాటి శాసన సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రశ్నలను లేవనెత్తి ప్రధాన ఆకర్షితులయ్యారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.