మెదక్

ఆధునిక హంగులతో పటన్‌చెరు మార్కెట్ యార్డు అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, మార్చి 20: పట్టణంలో నూతనంగా ఏర్పాటు అయిన మార్కెట్ యార్డును అధునిక హంగులతో అభివృద్ధి చేస్తామని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. గత కొన్ని సంవత్సరముల నుండి జాతీయ రహదారి ఆనుకుని అతి ప్రమాదకరంగా కొనసాగుతున్న గురువారం సంతను తరలించడానికి టిఐఐసి నుండి 14 ఎకరాల భూమి పట్టణ శివారులలో కేటాయించడం జరిగిందన్నారు. స్థానిక జిఎంఆర్ ఫంక్షన్‌హాలులో నూతనంగా ఏర్పాటైన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి తదితరులతో కలిసి ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. అనంతరము మాట్లాడుతూ నగర శివారులో గల మలక్‌పేట ఉల్లి విక్రయ కేంద్రాన్ని సైతం ఇక్కడికి తరలించడానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసామన్నారు. తమ పంటలను విక్రయించడానికి వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చే వ్యవసాయదారులకే కాకుండ వినియోగదారులకు సైతం సరైన వౌళిక వసతులు అందించడానికి అన్నిరకాలుగా ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. అన్నదాతలు ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తోందన్నారు. పటన్‌చెరు నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు బూరుగడ్డ పుష్ప నాగేష్‌యాదవ్, ఉపాధ్యక్షుడు పొగాకు భసవేశ్వర్‌లను సన్మానించిన అనంతరము ఎంపి వారికి పలు సూచనలు చేసారు. మార్కెట్‌ను ఆధునికంగా మార్చడానికి అహర్నిశలు కృషి చేయాలని అన్నారు. అన్నదాతలకు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గాయత్రి, రామచందర్, వంగరి అశోక్, అజీమ్‌అలి, సత్యనారాయణ, నర్సింహాగౌడ్, సాయిప్రకాష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయం
పెద్దశంకరంపేట, మార్చి 20: ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల తహశీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మిచెక్కులను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో ముందుండాలనే దృక్పథంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తుందన్నారు. ఆడపిల్లలు కుటుంభానికి భారమనుకుంటున్న ప్రజల్లో మార్పు తీసుకురావడానికి కళ్యాణ లక్ష్మీ, శాది ముబారక్ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. ఏప్రిల్ 1 నుండి కళ్యాణ లక్ష్మీ పథకానికి 75 వేల రుపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. పెళ్లికి ఆడపిల్ల కట్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ 75 వేల రుపాయలు అందజేస్తుందని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటుగా ప్రతి విషయంలో ప్రజలకు అండగా ఉండాలనే దృక్పథంలో పథకాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తుందని, ముఖ్యంగా రైతులకు అండగా ఉండాలని, వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు సబ్సిడీపై అందజేయడం జరుగుతుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమ పథకాల అమలును ప్రతి ఒక్కరు అభినందిస్తుంటే విపక్షాలు విమర్శించడం సిగ్గుచేటని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 25 మందికి కళ్యాణ లక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రాయిని సంగమేశ్వర్, తహశీల్దార్ పద్మారావు, ఎంపిడిఓ హరిసింగ్, సర్పంచ్ జంగం శ్రీనివాస్, విజయరామరాజు, ఎంపిటిసి సభ్యులు సుభాష్‌గౌడ్, మాణిక్యరెడ్డితో పాటు పలు గ్రామాల సర్పంచ్‌లు, తెరాస నాయకులు మురళీ పంతులు, సాజిత్, సత్యం, సురేష్‌గౌడ్, చాకలి నారాయణ, పున్నయ్య తదితరులు పాల్గొన్నారు.