మెదక్

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, మార్చి 20: పరీక్షలు రాసిన తరువాత ఈతకని చెరువులోకి దిగిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి దుర్మరణం పాలైన సంఘటన సంగారెడ్డి జిల్లా పటన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామ శివారులలో సోమవారం సాయంత్రం జరిగింది. ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు చెరువులో దిగగా ముగ్గురు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన వివరాలు పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం కింది విధంగా ఉన్నాయి. పటన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలోని టర్భో ఇంజనీరింగ్ కళాశాలలో శ్రీకర్‌రెడ్డి, రాహుల్, హరిధర్, అలి, ఓంకార్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. శ్రీకర్‌రెడ్డి కరీంనగర్‌కు చెందినవాడు కాగా రాహుల్ పటన్‌చెరు పట్టణ నివాసి. ఇదిలాఉండగా సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కళాశాలలో పరీక్షలు రాసిన తరువాత ఐదుగురు యువకులు కలిసి బయటికి వచ్చారు. అక్కడి నుండి ఈత కోసమని ఇంద్రేశం గ్రామ శివారులలో గల చౌదరి చెరువు వద్దకు వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండడడంతో అందులోకి దిగిన కొద్దిసేపటికే శ్రీకర్‌రెడ్డి, రాహుల్ ఇద్దరు నీటిలో మునిగిపోగా ముగ్గురు యువకులు హరిధర్, అలి, ఓంకార్ ప్రాణాలతో బయటపడ్డారు. పటన్‌చెరు సిఐ ప్రభాకర్, ముగ్గురు ఎస్‌లు వారి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన్ని గంటల పాటు చెరువు నీటిలో గాలించడంతో రాహుల్ శవం రాత్రి తొమ్మిది గంటల సమయంలో దొరికింది.