మెదక్

ప్రభుత్వ పరంగా ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మార్చి 23: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర పిఆర్టీయు పనిచేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లాకేంద్రంలో జరిగిన పిఆర్టీయు రాష్ట్ర విద్యాసదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పిఆర్టీయులో అత్యంతనైపుణ్యంగల నిష్ణాతులైన టీచర్లు ఉన్నారన్నారు. జిల్లాప్రభుత్వ బడులను గురుకులాలుగా మార్చేందుకు పిఆర్టీయుతో కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకపోతామన్నారు.ప్రభుత్వ బడుల బలోపేతానికై ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి నూతన ప్రైవేట్ స్కూళ్ల అనుమతులు ఇవ్వద్దని కోరనున్నట్లు తెలిపారు. ఈయేడు ఒక్క స్కూల్‌కు కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. కనీస వసతులు లేని ప్రైవేట్ స్కూళ్ల మూసివేయాలని డిమాండ్ చేశారు. జడ్పిహెచ్‌ఎస్‌లను గురుకులాలుగా మార్చితే ఇప్పటివరకు కొనసాగితే హెచ్‌ఎంలు ప్రిన్సిపాళ్లుగా మారుతారన్నారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి చేస్తు పిఆర్టీయు బలోపేతానికి కృషి చేయాలన్నారు. టీచర్లు ఐక్యంగా ఉన్నప్పుడే సమస్య పరిష్కారమైతాయన్నారు. పండిట్, పిఇటి అప్‌గ్రేడ్‌కు, మహిళ టీచర్లకు చైల్డ్‌కేర్‌లీవులు ఇచ్చేలా పోరాడింది పిఆర్టీయు అన్నారు. మంత్రి హరీష్‌రావు సహకారం వల్లే ఈ రెండు ఆంశాలకు జిఓలు జారీ అయ్యాయన్నారు. మొన్నటి ఎన్నికల్లో నమ్ముకున్న నేతలు మోసం చేసినా, టీచర్లు మోసం చేయకపోవడం వల్లే భారీ మెజార్టీతో విజయం సాధించానన్నారు. ప్రతి నెల 1న ఏయిడెడ్ టీచర్లకు వేతనాలు, హెల్త్‌కార్డులు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. నిన్నటి ఎన్నికల్లో అఖండ విజయంకు కృషి చేసిన టీచర్లందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ పూలరవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వ బడుల మనుగడే ధ్యేయంగా పిఆర్టీయు పనిచేస్తుందన్నారు. నూతన విద్యావిధానం ప్రవేశపెట్టాలని, దేశవ్యాప్తంగా ఒకే విద్యావిధానం ఉండాలని పోరాటం చేస్తుందన్నారు. ఎస్సీ,ఎస్టీ, బిసి,మైనార్టీ గురుకులాలు, కెజిబివి టీచర్లకు జీతాలు పెంచేవిషయంలో, చైల్డ్‌కేర్ లీవులు ఇచ్చేలా ప్రయత్నిస్తామన్నారు. ప్రీప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేసినప్పుడే ప్రభుత్వ బడుల పట్ల విశ్వాసం పెరుగుతుందని, అప్పుడే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఒకే విధానం, పరీక్షల విధానం కూడా ఉండాలన్నారు. పిల్లలకు టీచర్లు దగ్గరైతేనే అనుకున్న లక్ష్యం చేరుకుంటారన్నారు. సెలవుల్లోనే టీచర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన జనార్దన్‌రెడ్డిని గజమాలతో సన్మానించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, నేతలు సత్యనారాయణ, రఘోత్తంరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కరీమొద్దీన్, శ్రీనివాస్, రవీందర్, విజయ, శ్రీదేవి, రఘురాం, రాంచంద్రం పాల్గొన్నారు.