మెదక్

మనం శుచిగా ఉంటూ ఇతరులకు చెబుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, మార్చి 25: మెదక్ పురపాలక సంఘం మరో 30 రోజుల్లో ఓడిఎఫ్ పట్టణంగా నిర్మించాలని సిడిఓ హేమలత పిలుపునిచ్చారు. శనివారం న్యూ భారత్ ఫంక్షన్‌హాల్లో ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య నిర్వహణ అవగాహన సదస్సులో ఆమె ప్రసంగించారు. స్వయం సహాయక గ్రూప్‌లు ఒడిఎఫ్‌లో ఆదర్శంగా ఉన్నప్పుడే మెదక్ పట్టణాన్ని వంద శాతం ఓడిఎఫ్‌గా తీర్చిదిద్దగలుగుతామని ఆమె తెలిపారు. ప్రతి స్వయం సహాయక సభ్యురాలి ఇంటిలో టాయిలెట్స్ ఉండాలని ఆమె తెలిపారు. ప్రతి మహిళ ఎస్‌హెచ్ సభ్యుల ఇంటిలో టాయిలెట్స్ ఉండాలన్నారు. మనము ఆదర్శంగా నిలబడి పట్టణ ప్రజలకు టాయిలెట్స్‌పై అవగాహన కల్పించడానికి వీలుంటుందన్నారు. దాంతో పాటు తడిపొడి చెత్తను విడివిడిగా వేరు చేసే కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. తడి చెత్తను ప్రతిరోజూ ప్రతి ఇంటి నుంచి సేకరించడం జరుగుతుందని ఆమె తెలిపారు. పొడి చెత్త మాత్రం ప్రతి శుక్రవారం సేకరణ చేయడం జరుగుతుందన్నారు. దీని వలన ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని సిడిఓ హేమలత తెలిపారు. రాష్ట్ర మిషన్ కో ఆర్డినేటర్ మెప్మా సుజాత మాట్లాడుతూ ఇంటి ముందు మోరిలో తడి, పొడి చెత్త పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నుండి రాష్ట్ర మంత్రుల వరకు చీపురుపట్టి వీధులు ఊడ్చుతున్నారని తెలిపారు. ఇందుకోసం ప్రతి మున్సిపాలిటీలో రిసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పొడి చెత్తతో పాటు ప్రమాదకరమైన బ్లెడ్లు, ఇంజక్షన్ నీడిల్స్ వాటిని ప్రత్యేకంగా భద్రపరిచి మున్సిపల్ జవాన్లు వచ్చినప్పుడు అందజేయాలన్నారు. స్వచ్ఛ భారత్ అనేది ఆత్మ గౌరవంగా భారతదేశం భావిస్తుందని తెలిపారు. అప్ఘనిస్తాన్ దేశం చాలా చిన్నది, అయినా ఇంటింటికీ మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకొని స్వచ్ఛ ఆప్ఘనిస్తాన్ దేశంగా పేరొందిందన్నారు. స్వచ్చ మెదక్ పురపాలక సంఘంగా మారుడానికి స్వయం సహాయక గ్రూప్‌ల బాధ్యత తీసుకోవాలన్నారు. బహిరంగ మలవిసర్జనకు ప్రజలంతా దూరంగా ఉండాలన్నారు. మరో నెలలోగా మెదక్‌ను ఓడిఎఫ్ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత సంఘాలపై ఉందని సుజాత స్వయం సహాయక గ్రూప్‌లకు పిలుపునిచ్చారు. పట్టణ సమైక్య సంఘాలు ఈ విషయంలో తీర్మానాలు చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ అధ్యక్షత వహించారు. కౌన్సిలర్లు రాధా గోవింద్, గోదల శోభ కృష్ణ, లక్ష్మీ ముత్యంగౌడ్, చంద్రకళ, ఆర్‌కె.కృష్ణ, సాదిక్ అలీ, పిఆర్‌పి సునీత, మహేశ్వరితో పాటు భారీ సంఖ్యలో స్వయం సహాయక గ్రూప్‌లు పాల్గొన్నాయి. మధ్యమధ్యలో కళాకారులు ఆటపాటలతో ఓడిఎఫ్ పట్టణాల గురించి స్వయం సహాయక గ్రూప్‌లకు వివరించారు.