మెదక్

ఉల్లి రైతుకు గిట్టుబాటు ధర కల్పనే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణఖేడ్ మార్చి 25: నారాయణఖేడ్ మార్కెట్ యార్డు ద్వారా రైతులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు అదేశాల మేరకు మనూరు మండలంలో ఉల్లి పంట క్వింటాల్ రూ.800 వంతున కొనుగోలు చేస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని మార్కెట్ కమిటీ చైర్మెన్ బి, హన్మంతు తెలిపారు. శనివారంనాడు ఖేడ్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అధికారులతో కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చైర్మెన్ హన్మంతు మాట్లాడుతూ ఇప్పటి వరకు కందులు కొనుగోలు చేసి రాష్ట్రంలోనే అదర్శంగా నిలిచామన్నారు. కందులు కొనుగోలు చేయడం దేశంలోనే మొదటిసారి అన్నారు. దీంతోపాటు ఉల్లి పంట ఎక్కువగా సాగు చేశారని తెలిసి వారికి గిట్టు బాటు ధర కల్పించాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మంత్రి హరీష్‌రావుకు ఉల్లి రైతులతో కలిసి వినతిపత్రం అందించడంతో స్పందించిన మంత్రి సిఎంతో చర్చించి ఉల్లి పంట కొనుగోలు చేయడం ప్రారంభించినట్లు చెప్పారు. రైతులు పండించిన వ్యవసాయ సాగు భూమి వద్దకు వెళ్లి తేమ పరీక్ష చేసి కొనుగోలు చేస్తునట్లు తెలిపారు. గ్రేడ్ వన్ ఉల్లి పంట రూ.800 ధరతో కొనుగోలు చేయాలని అదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. రైతుల అకౌంట్‌లో డబ్బులు వేస్తునట్లు చెప్పారు. మార్కెట్ యార్డు ద్వారా రైతులకు అవసరమయ్యే మేలు చేకుర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులు పండించిన ధాన్యంపై మార్కెట్ రుసుం క్వింటాల్‌కు 1శాతం వసూలు చేస్తారని వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బాషిత్, కార్యదర్శి రామకృష్ణ, కమిటీ సభ్యులు లక్ష్మివిజయకుమార్. సరిత జనార్థన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.