మెదక్

వైభవంగా శ్రీ ధనలక్ష్మిజాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ్వంపేట, మార్చి 25: మండల కేంద్రమైన శివ్వంపేటలో శ్రీ ధనలక్ష్మిఅమ్మవారి జాతర ఉత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఒగ్గుకథ, బండ్లు, బోనాల ఉరేగింపు, పోతరాజుల నృత్యాలు, యువకుల కేరింతల మధ్య మహిళా భక్తులు బోనాలను అమ్మవారికి సమర్పించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
ఆనందోత్సాహాల మధ్య వేడుకలు ముగిశాయి. శ్రీ ధనలక్ష్మీ దేవాలయాన్ని శివ్వంపేట ఎంపిపి కల్లూరి హరికృష్ణ సందర్శించి ప్రత్యేక పూజలు చేసి తీర్థ్దప్రసాదాలు స్వీకరించారు. సర్పంచ్ అర్జున్, నాయకులు రమణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యతా ప్రమాణాలు లేని వాటర్‌ప్లాంట్‌ల సీజ్
తూప్రాన్, మార్చి 25: తూప్రాన్ పట్టణంలోని 3 వాటర్‌ప్లాంట్‌లను సీజ్ చేసినట్లు వెంకటనర్సింహారెడ్డి తెలిపారు. పట్టణంలోని గోదావరి, అక్షర, ఆర్సి, వాటర్‌ప్లాంట్‌ల నిర్వాహకులు ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించనందున సీజ్ చేసినట్లు చెప్పారు.

ఘనంగా శత రుద్రీయ మహా యాగం
గజ్వేల్, మార్చి 25: గజ్వేల్ పట్టణంలోని శ్రీ అన్నపూర్ణా విశే్వశ్వరాంజనేయ క్షేత్రంలో శనివారం శత రుద్రీయ మహా యాగం ఘనంగా జరిగింది. రూపాయితో మహా యజ్ఞం, మాస శివరాత్రి మహోత్సవం 100 మాసములు పూర్తవుతున్న దృష్ట్యా పరమ శివుడి అనుగ్రహం కోసం శత రుద్రీయ మహాయాగం నిర్వహిస్తున్నట్లు వేద పండితులు అమరవాది నిరంజనశర్మ పేర్కొన్నారు. 100 రుద్ర హోమముల పుణ్యఫలం, 100 అన్నదానముల ఫలితం కాగా, ఆదివారంతో11వ రోజుకు చేరుతుండడంతో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చణలు, మహా పూర్ణాహుతి తదితర కార్యక్రమాలుంటాయని స్పష్టం చేశారు. లోక కల్యాణార్థమై నిర్వహిస్తున్న యజ్ఞయాగాదులలో పెద్ద ఎత్తున పాల్గొని పరమ శివుడి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ అరుణ బూపాల్‌రెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు నేతి రాజవౌళిగుప్త, జగ్గయగారి బూమయ్య, ఉప్పల శ్రీనివాస్, రమణయ్య, శంకరయ్య, వేద పండితులు, యశ్వంత్‌శర్మ, సుహాస్‌శర్మ పాల్గొన్నారు.