మెదక్

వైభవంగా నాచగిరీశుడి హనుమంత వాహనోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, మార్చి 26: నాచగిరి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి హనుమంతోత్సవ సేవ ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తజనుల జయజయ ధ్వానాల మధ్య సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన హనుమాన్ విగ్రహంపై అధిష్ఠింపజేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారిని నాచగిరి పురవీధుల్లో ఊరేగించగా, ఆలయ కార్య నిర్వాహణాధికారి సుధాకర్‌రెడ్డి, వేద పండితులు చంద్రకాంతశర్మ, కృష్ణమాచార్యులు, జగన్నాథాచార్యులు, శ్రీనివాసరాఘవన్, గోపాలకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

సాదాబైనామాల అమలులో సిద్దిపేటదే అగ్రపీఠం
జగదేవ్‌పూర్, మార్చి 26: సాదా బైనామాల అమలులో సిద్ధిపేట జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో ఉందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం జేశారు. ఆదివారం మర్కుక్ మండల పరిధిలోని ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన 13బి ధృవీకరణ పత్రాలు, భూయజమాన్య హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హృజరై ఆయన ప్రసంగించారు. సిద్ధిపేట జిల్లా వ్యాప్తంగా 1810 సాదాబైనామాలను క్రమబద్ధీకరించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా జగదేవ్‌పూర్ , మర్కుక్ మండలంలో 570 మంది లభ్ధిదారులకు వారి ఆధీనంలోఉన్న భూమికి పూర్తిస్తాయిలో భూహక్కులు కల్పించి 9 రకాల సర్టిపికెట్లు ఒకే సారి అందజేస్తున్నట్లు వివరించారు. రైతుల భూములపై సర్వ హక్కులు రైతులదేనని తెలిపారు. ఈ పాసుపుస్తకాలతో వచ్చె ఖరీఫ్‌లో బ్యాంకు రుణాలు పొందవచ్చునని చెప్పారు. మన సిఎం, కెసిఆర్ ఎప్పుడు రైతుల కోసమే ఆలోచన చేస్తూ వారి మేలు కోసం కృషి చేస్తున్నాడని అన్నారు. హెచ్‌ఎండీఎ పరిధిలోని రైతుల సాదాబైనామాలను క్రమబద్ధీకరించేందుకు త్వరలోనే చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సిఎం కెసిఆర్ రైతులకు 9 గంటల నాణ్యమైన విధ్యుత్‌ను సరపరా చేస్తున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోని జగదేవ్‌పూర్‌లో17 లక్షల మేట్రిక్ టన్నుల దాన్యం నిలువ గల గోదాముల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి పరిమితి లేకుండా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరిట రూ. 5లవేల నుంచి 75వేలకు పేంచిన ఘనత తమ ప్రభుత్వానిదని అన్నారు. గజ్వేల్ నియోజక వర్గంలో422 మంది లభ్ధిదారులకు రూ.2 కోట్ల 15లక్షల 22వేలు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా లభ్ధిపొందినట్లు తెలిపారు. అలాగే 1778 మంది మైనార్టిలు శాదిముభరక్ పేరిట రూ. 9కోట్ల 6లక్షల 78వేలు లభ్ధి పొందినట్లు చెప్పారు. కాగా హరిత హారం కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతి నిధులు మాగా పని చేసి చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకం కింద పొలం గట్ల మధ్య చెట్లు నాటాలని సూచించారు. అలాగే ఉఫాధి హామిపథకంలో పొలం దగ్గర సిమెంటు కల్లాలు నిర్మించేందుకు నిధులుఇవ్వనున్నామని తెలిపారు. అనంతరం ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన డెంటల్ వైద్య శిబిరంలో కరపత్రాలను మంత్రి హరీష్‌రావు అవిష్కరించారు. ఈ కార్యమ్రంలో జేసి హన్మంతరావు, ఆర్డీఓ విజేయందర్, గజ్వేల్ మన్సిపల్ చైర్మన్ భాస్కర్, వంటి మామిడి మార్కెట్ కమిటి చైర్మన్ జహంగీర్, నియోజకవర్గ ఇంచార్జి భూంరెడ్డి, జడ్పిటీసి రా,చంద్రం, సర్పంచ్ భాగ్య, ఎంపిటీసి భాగ్యమ్మ ఐలయ్య, పిఎసిఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, తహశీల్ధారు పరమేశం, నాయకులు బాలేషం, వెంకటయ్య, కరుణాకర్, సుధాకర్‌రెడ్డి, మల్లేశం , కిష్టారెడ్డి, ఉప్పేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.