మెదక్

సంగ్రామానికి సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 4: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎటువంటి విఘాతం కలగకుండా సకాలంలో నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ వి.నాగిరెడ్డి సూచించారు. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీల వ్యవధి జూలై 2018 నాటికి ముగియనున్నందున ఎన్నికలకు సమయాత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న 2018 గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా మంగళవారం ఆయన కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కమీషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం వనరులు, వస్తు సామాగ్రి, సిబ్బంది తదితర వాటిని ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాల పునర్విభజన అనంతరం జరుగుతున్న మొదటి పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. శాసన సభ ఎన్నికల కోసం తయారు చేసే ఎలక్ట్రోరల్ రోల్‌ను ఆధారంగా తీసుకొని పంచాయతీ ఎన్నికల ఎలక్ట్రోరల్ రోల్‌ను తయారు చేయాలన్నారు. ఎలక్ట్రోరల్‌రోల్‌ను ఆన్‌లైన్‌లో పెట్టి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెస్తే ఓటర్ స్లిప్పులను డౌన్‌లోడ్ చేసుకోవడం, ఎదైన మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా సులువుగా ఉంటుందన్నారు. మండల స్థాయిలో డ్రాప్ట్‌రోల్‌ను తయారు చేయాలని మండల అధికారులకు సూచించారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులను ఒకే పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. చివరి నిమిషంలో అడిషన్ వచ్చినప్పుడు చివరి పోలింగ్ బూత్‌లో పేరును నమోదు చేయడం జరుగుతున్నందున ఇది తప్పని సరి కాదని, ఆ పేరును సంబంధిత వార్డులో పొందుపర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సంగారెడ్డి జిల్లాలో రోజుకో డివిజన్ చొప్పున మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా తగు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ఎన్నికల సమయంలో జరిగే ఘర్షణల శాతం చాల మట్టుకు తగ్గినప్పటికి అవినీతి స్థాయిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల వ్యయానికి సంబంధించిన అకౌంట్లను ఏ విధంగా క్రోడికరించాలన్న విషయంపై ఆయన అధికారులతో చర్చించారు. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో గ్రామ పంచాయతీ ఏర్పాటు, డి లిమిటేషన్, రిజర్వేషన్, ఎలక్ట్రోరల్‌రోల్ తయారీ, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణ అను అంశాలు ఉంటాయన్నారు. గ్రామ పంచాయతీల ఏర్పాటు, డి లిమిటేషన్, రిజర్వేషన్లకు సంబంధించిన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అంతకు ముందు పాత గృహా నిర్మాణ శాఖ కార్యాలయంలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్‌లను ఆయన పరిశీలించారు. సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సెక్రటరీ అశోక్‌కుమార్, కలెక్టర్ మాణిక్యరాజ్ కణ్ణన్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, డిఆర్వో రఘురాంశర్మ, డిపిఓ వెంకటేశ్వర్లు, జహీరాబాద్ ఆర్డీఓ హమీద్ తదితరులు పాల్గొన్నారు.

వడగళ్ల బాధిత రైతులను ఆదుకోవాలి

గజ్వేల్, ఏప్రిల్ 4: పంటలు చేతికందే దశలో అకాల వర్షాలు, వడగండ్లు అన్నదాతలను ఆర్థికంగా నష్టపరచగా, ప్రభుత్వం ఆదుకోని పక్షంలో బాదితులకు అండగా నిలిచి పోరాటం చేస్తామని రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వర్గల్ మండలం గౌరారం, సింగాయపల్లి, ముట్రాజ్‌పల్లి తదితర గ్రామాలలో వడగండ్ల ఫలితంగా ద్వంసమైన పంటలను పరిశీలించి ఆయన మాట్లాడారు. సాగుచేసిన పంటలకు బీమా చేసినప్పటికి పరిహారం చెల్లించడంలో బీమా సంస్థలు కొర్రీలు పెడుతుండడంతో ఆశించిన స్థాయిలో ప్రయోజనం జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేయడంతోపాటు పంటల సాగు, పంటల బీమాపై దీమా కల్పించకపోవడం, వచ్చిన దిగుబడులకు గిట్టుబాటు ధర లేకపోవడం, మార్కెట్‌లలో దళారులు దోచుకోవడంతో రైతులు నష్టపోయి చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు స్పష్టం చేశారు.
వరి, మొక్కజొన్న, క్యాబేజి, వంగ, టమాట, కీర, పొట్ల, మామిడి తదితర పంటలు ఈదురు గాలులతో కూడిన వడగండ్లు పడడంతో 90శాతం పంటకు నష్టం వాటిల్లినట్లు చెప్పారు. గజ్వేల్ నుండి సిఎం కెసిఆర్ ప్రాతినిత్యం వహిస్తున్నందున రైతుల సంక్షేమం పై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎకరాకు రూ. 50వేల చొప్పున పరిహారం చెల్లించాలని, నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సమగ్ర సర్వే

* సంగారెడ్డి ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి
పటన్‌చెరు, ఏప్రిల్ 4: సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి గ్రామాలలో పర్యటించాలని నిర్ణయించామని సంగారెడ్డి ఆర్‌డిఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇంటింటికీ తిరిగి సమగ్ర సర్వే నిర్వహించడం ద్వార వారి రెవెన్యూ సమస్యలు పూర్తిగా సమసిపోతాయని అన్నారు. పటన్‌చెరు మండలం బచ్చిగూడ, రామేశ్వంబండ, క్యాసారం, పోచారం తదితర గ్రామాలలో మంగళవారం గ్రామసభలు నిర్వహించారు. గ్రామస్థులతో మాట్లాడి రెవెన్యూ రికార్డులలో ఉన్న తప్పులను అక్కడికక్కడే తొలగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన సంగారెడ్డి ఆర్‌డిఓ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండ వారి ఇండ్ల వద్దకే గ్రామస్థాయి అధికారులు వెళ్లడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వినూత్నమైన కార్యక్రమం ద్వార గత చాల సంవత్సరాలుగా అపరిషృతంగా ఉన్న రెవెన్యూ సమస్యలకు తగిన పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. విలువైన భూముల రికార్డులు సైతం తప్పుగా నమోదు కావడం గ్రామస్థులకు ఆందోళన కలిగించే అంశమన్నారు. తగిన ఆధారాలు తీసుకోవడం ద్వార భూములకు చెందిన పహాణిలలో పేర్లు తప్పుగా నమోదు అయితే సరిచేయడం ద్వార భవిష్యత్తులో వారి వారసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని నిర్ణయించామన్నారు. గ్రామసభలలో గ్రామస్థుల ఆమోదం మేరకు రెవెన్యూ రికార్డులలో తప్పులను సరిదిద్దిన తరువాత వాటిని ఆన్‌లైన్ చేయడం ద్వార ఇకముందు పొరపాట్లు జరగకుండా చేస్తామన్నారు. మండల పరిషత్ అధ్యక్షుడు గొల్ల శ్రీశైలంయాదవ్, ఇంద్రేశం ఎంపిటిసి అంతిరెడ్డిగారి అంతిరెడ్డి తదితరులతో కలిసి ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి గ్రామస్థులతో స్వయంగా వారి వారి సమస్యల గురించి చర్చించారు. స్థానిక అధికారులు గ్రామీణ ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా అక్కడే తగిన ఆదేశాలు జారీ చేసారు. తహశీల్దారు గిరి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ యాదగిరి, క్యాసారం మాజీ ఎంపిటిసి తదితరులు పాల్గొన్నారు.