మెదక్

పదిరూపాయల సిక్కాతో చిక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దుర్తి, ఏప్రిల్ 20: మండల కేంద్రమైన వెల్దుర్తిలోని పలు గ్రామాల్లో పదిరూపాయల నాణేలతో చిక్కులు ఏర్పడుతున్నాయి. ఎక్కడ కెళ్లిన పదిరూపాయల నాణేలు చెల్లవంటు వదంతులు వ్యాపించడంతో ప్రతి ఒక్కరూ పదిరూపాయల నాణాలను తిసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దీంతో దుకాణదారులతో పాటు చిల్లర వ్యాపారువద్ద పదిరూపాయల చిల్లనాణేలు వేలాదిరూపాయలు పేరుకుపోతున్నాయి. గ్రామీణ ప్రజలు పదిరూపాయల నాణేలను తిసుకోవడంలేదు. అందేకాక జనాల వద్ద ఉన్న నాణేలను సైతం దుకాణాల్లో ఇచ్చి చేతులు దులిపేసుకున్నంత పనిచేస్తున్నారు. వ్యాపారులకు చిల్లర కష్టాలు తప్పడంలేదు. ప్రజలు తెచ్చిన పదిరూపాయల నాణాలను తిసుకోని సరుకులు తిసుకెళ్లడం సరేకాని వారికి సరిపడ చిల్లర డబ్బులు పదినాణాలను ఇస్తే మాత్రం ప్రజలు తిసుకోవడంలేదు. దీంతో వ్యాపారస్తులకు చిల్లర కష్టాలు తప్పడంలేదు. నోట్లరద్దుతో పదిరూపాయల నోట్లు తగ్గిపోవడంతో చిల్లర ఇబ్బందులు తొలగించే ఉద్దేశ్యంతో నే బ్యాంకుల్లో ఎక్కువగా పదిరూపాయల నాణాలు అందిస్తున్నట్లు బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. ఎదిఏమైన ప్రజల్లో వస్తున్న ఇవదంతులు తొలగడానికి ప్రజల్లో అవగాహన వచ్చెవిదంగా ఆయాగ్రామాల సర్పంచులు, అధికారులు సూచిచాలి.

సమస్యలు పరిష్కరించండి
కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయుల ధర్నా
సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 20: జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ జారీ చేయాలని, వేసవి సెలవుల్లోనే పదోన్నతులు, బదిలీలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు సమర్పించారు. ఈ సందర్భంగా టిఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మారెడ్డి, టిపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వై.అశోక్‌కుమార్‌లు మాట్లాడుతూ ఏకీకృత సర్వీస్ రూల్స్ జారీ చేసేందుకు రాష్టప్రతి ఉత్తర్వులు తెప్పించేందుకు కేంద్ర హోంశాఖ, రాష్టప్రతితో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్వీస్ రూల్స్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడ్డాక ఒకటిన్నర పేజీలో ఇస్తానన్న ముఖ్యమంత్రి కేసిఆర్ 3యేళ్లు గడుస్తున్న జారీ చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దీంతో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టేంట్లు, పండిత్-పిఈటి పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయన్నారు. దీనికి ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.