మెదక్

వైభవంగా వసంతోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, ఏప్రిల్ 21: గజ్వేల్ పట్టణంలోని సుప్రసిద్ద శ్రీ వెంకటేశ్వర క్షేత్రంలో శుక్రవారం వసంతోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వేద పండితులు శేషం శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో వేద పండితులు సతీసమేతులైన స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, వేద పారాయణం, ద్రావిడ దివ్య ప్రబందము, యాగశాలలో శాంతిపాఠము, సుదర్శన శతక హవనము, స్థాపిత దేవతా హవనము, పంచసూక్త హవనము, పరివార హోమము, నిత్య పూర్ణాహుతి, బలిహరణము, సామూహిక శ్రీ విష్ణుసహస్రనామ పారాయణము, చతుస్నానార్చన, ద్వారతోరణ ధ్వజకుంభ ఆరాధన తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు, మహిళలు విశేష సంఖ్యలో తరలిరాగా, ఆలయ కమిటీ అధ్యక్షుడు బుక్కా వెంకటేశంగుప్త ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలతోపాటు మహా ప్రసాదం అందజేశారు.

అసమ్మత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా
అర్ధనగ్న ప్రదర్శన
సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 21: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను కల్పించడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కంది మండల రెవెన్యూ కార్యాలయం ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి దళిత మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.జగన్ మాట్లాడుతూ 53 శాతం బిసిలు, 20 శాతం ఉన్న ఎస్సీలను మర్చిపోయి రాజ్యాంగ వ్యతిరేకం, మతపరమైన రిజర్వేషన్లను కల్పిస్తూ రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను అవమానించిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందని విమర్శించారు. ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు కల్పించి రజాకార్ల వారసత్వాన్ని తీసుకురావడమే అవుతుందన్నారు. కేవలం ముస్లింల కోసమే ప్రభుత్వం ఏర్పడ్డట్లు టిఆర్‌ఎస్ భావిస్తుందన్నారు. ఇలాంటి ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే సుప్రీంకోర్టు వాటిని కొట్టివేసి ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తించుకోవాలన్నారు. రాజశేఖరరెడ్డికి పట్టిన గతే కెసిఆర్‌కు పట్టి తీరుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి మతపరమైన రిజర్వేషన్లను ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో తగ మూల్యం చెల్లించక తప్పదవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బిజెపి కొండాపూర్ మండల శాఖ అధ్యక్షులు నల్లా నర్సింహారెడ్డి, అసెంబ్లీ కన్వినర్ నర్స్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శివరాజ్, యువమోర్చ నాయకులు సదానందచారి, సతీష్‌గౌడ్, ప్రవీన్‌యాదవ్, దేవయ్య, మల్లేశం, బల్‌రాం, క్రిష్ణ, రాజు, విష్ణు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.