మెదక్

రెవెన్యూ సమస్యలకు ఇక చెల్లుచీటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, ఏప్రిల్ 27: గ్రామాలలో రెవెన్యూ సమస్యలకు ఇక స్థానం ఉండదని, సమగ్ర సర్వే పేరిట ఇంటింటికి తిరిగిన అధికారులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు తగిన పరిష్కారం చూపిస్తారని జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్ కన్నన్ అన్నారు. తమ తమ గ్రామాలలో నెలకొన్న భూ సమస్యల పరిష్కరించుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అధికారుల కోసం ప్రజలు ఇక నుండి తిరగాల్సిన పని లేదన్నారు. గురువారం పటన్‌చెరు మండలం కర్ధనూర్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ ఎర్రర్ ఫ్రీ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందు గ్రామంలో విసృతంగా పర్యటించిన ఆయన అధికారులకు, గ్రామస్థులకు పలు సూచనలు చేసారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, వందశాతం పారిశుధ్యం అమలుకు అవసరమైన సహాయ సహకారాలుఅ అందించాలని సూచించారు. పలువురికి ఇ పాస్‌బుక్‌లు అందించిన అనంతరము కలెక్టర్ మాట్లాడుతూ గతంలో కంటే భిన్నంగా ఏమైనా భూ సమస్యలు ఉంటే స్థానిక రెవెన్యూ అధికారులే స్వయంగా గ్రామాలలో పర్యటిస్తారని తెలిపారు. అవసరమైతే గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రజల మధ్య అవసరమైన అవగాహన కల్పిస్తారని, తద్వార వివాదాలు నెలకొన్న భూ సమస్యలకు మోక్షం లబించేలా చూస్తారని వివరించారు. జిల్లాలో రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. త్వరలో కొన్ని గ్రామాలను రెవెన్యూ సమస్యలను లేని గ్రామాలుగా ప్రకటిస్తామని వివరించారు. తెల్ల కాగితాలపై క్రయ విక్రయాలు జరిపిన భూములకు సంబంధించి ప్రభుత్వం సాదాబైనామ క్రింద పక్కా పట్టా అందించేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు. సాదాబైనామ క్రింద ధరఖాస్తులను ప్రభుత్వం ఇప్పటికే ఆహ్వానించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా సాదాబైనామ క్రింద పదివేల వరకు ధరఖాస్తులు రావడం జరిగిందన్నారు. న్యాయస్థానాలలో కేసులు పెండింగ్‌లో ఉన్న భూములను వదిలేసి ఇతరత్రా అన్నింటికి ఆయా మండల రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపిస్తారని వివరించారు. సాదాబైనామ క్రింద క్రయవిక్రయాలు నిర్వహించిన వారు గత కొన్ని సంవత్సరాలుగా అనేక రకాలుగా ఇబ్బందులు అనుభవిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వారందరికి ఊరట లబించిందన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం ఉన్న సాదాబైనామాలకు సంబంధించిన లబ్దిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించనున్నామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, నిజామాబాద్ సబ్ కలెక్టర్ స్నిగ్ధా పట్నాయక్, నిజామాబాద్ అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్‌రాజ్, పటన్‌చెరు తహసీల్దారు గిరి, ఆర్‌ఐలు విశే్వశ్వర్, రవి, కర్థనూర్ గ్రామ సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.