మెదక్

కెసిఆర్ లక్ష ఉద్యోగాలిచ్చేదేంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఏప్రిల్ 27: క్రమ శిక్షణ, అంకిత భావంతో పని చేసే కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ బిజెపియేనని, 2019 ఎన్నికల్లో నిశ్చబ్ద విప్లవంతో తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపడతామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ చౌరస్తాలోని ఓ పంక్షన్ హాలో రెండు రోజుల పాటు జరిగిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ముగింపు రోజు ఆయన పాల్గొన్నారు. గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బండారు మాట్లాడుతూ జన బలాన్ని ప్రదర్శించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహిస్తే ఆయన స్వంత గడ్డ అయిన ఉమ్మడి మెదక్ జిల్లాలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నిర్వహించి భవిషత్ ప్రణాళికలు రూపొందించుకుందన్నారు. ప్రేమ సిద్దాంతాల పునాదుల మీద పుట్టిన బిజెపి పార్టీకి జనాధరణ రోజు రోజుకు పెరుగుతుందన్నారు. ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలో బిజెపి ప్రభంజనానికి అన్ని పార్టీల్లో దడ పుట్టుకొచ్చిందన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన కెసిఆర్ ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించలేదని, కెసిఆర్ లక్ష ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం తెలంగాణ నిరుద్యోగులకు లేదన్నారు. జహీరాబాద్‌లో నిమ్జ్ ద్వారా పరిశ్రమలను స్థాపించడానికి కేంద్రం అనుమతించిందని, దీంతో లక్ష ఉద్యోగాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో లక్ష ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు. రైతాంగ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 1600 కోట్ల నిధులు ఇస్తే ఆ విషయాన్ని కెసిఆర్ ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదని విమర్శించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి బిజెపి నేతృత్వంలోని ఎన్డియే ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతుందన్నారు. నరేంద్ర మోడి నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో బిజెపి సత్తా చాటడానికి వ్యూహాత్మకంగా పార్టీ నిర్మాణం కొనసాగుతుందన్నారు. భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలైన యువమోర్చ, దళిత మోర్చ, కిసాన్ మోర్చ, మహిళా మోర్చ తదితర వాటికి పటిష్టమైన కమిటిలను నియమించి సమన్వయంతో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త స్వచ్చందంగా స్వీకరిస్తారన్నారు. బిజెపిలో పని చేసే వారు ఎప్పుడు కూడా పదవుల కోసం పోటీ పడరన్నారు. పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా పని చేస్తారన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఎప్పుడు నిలదొక్కుకోవని, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దమన్నారు.

జలాల పెంపునకు కృషిచేయాలి
మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట, ఏప్రిల్ 27 : బాల వికాస్ జలమండలి సంస్ధ గ్రామాలను దత్తత తీసుకొని భూగర్భ జలాల పెంపుకు కృషిచేయాలని, ఇబ్రహీంపూర్ స్ఫూర్తితో ముందుకు సాగాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట నుంచి వరంగల్‌కు వెళ్తున్న సందర్భంగా బాల వికాస్ ఏర్పాటు చేసిన గ్రామాభివృద్ధిపై అవగాహన సదస్సులో పాల్గొని మంత్రి మాట్లాడారు. బాల వికాస్ జలమండలి సంస్ధ గ్రామాలను దత్తత తీసుకొని ఇబ్రహీంపూర్ గ్రామం స్ఫూర్తితో ఇంకుడు గుంతల, కందకాలు, ప్రతి గ్రామంలో చేపట్టి భూగర్భ జలాల పెంపుకు కృషిచేయాలని సంస్ధ వారిని మంత్రి కోరారు. అలాగే గ్రామాభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేయాలని, రైతులకు ఎరువులు అందే విధంగా చూడాలనాన్నారు.