మెదక్

హామీల అమలులో సర్కారు విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు, ఏప్రిల్ 28: రైతులపై కపట ప్రేమ చూపిస్తూ దనవంతుల కొమ్ము కాస్తున్న సిఎం కెసిఆర్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిదిలోని లక్ష్మక్కపల్లిలో రైతులు యువకులు తెలుగుదేశంలో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యంగా లక్ష్మక్కపల్లి సర్పంచ్‌గా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన ఆంజనేయులు, ములుగు మాజీ సర్పంచ్ గండరి నర్సయ్యలు పార్టీలో చేరారు. అనంతరం చంద్రశేఖర్‌రెడ్డి, చికెన్‌బాల్‌రెడ్డి, ప్రవీన్‌లతోకలిసి విలేఖరులతో మాట్లాడుతూ పేద ప్రజలకిచ్చిన హామీల అమలులో సిఎం కెసిఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. డబల్‌బెడ్‌రూంలు, కల్యాణలక్ష్మి, రుణమాఫీ, ఎస్సీలకు 3 ఎకరాల భూమి విషయంలో మోసం చేసాడని ఆ విషయాలను పక్కన పెట్టి ఇప్పుడు కొత్త పాట పాడుతూ కులాల వారిగా విభజించి గొర్లు, కులవృత్తి పనుల గూర్చి కొత్త పాటాలు చెపుతున్నారని, ప్రజలు ఎవరి పనిపై వారుంటే తన పని సాఫీగా కొనసాగించవచ్చనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రతి ఎకరాకు రూ. 4వేలు ఇస్తానని ప్రకటన చేసిన సిఎం ఎంతమంది పేదలకు లబ్ది చేకూరుతుందో చెప్పాలన్నారు. డబ్బులున్నోడు భూములు కొనుక్కోగా, పేదోడికి అర ఎకరం కూడా సరిగ్గా లేదని అలాంటప్పుడు ప్రకటించిన 4వేలు ఎవరి ఖాతాలో చేరుతాయో చెప్పాలన్నారు. హరితహారంలో సంవత్సరానికి 8 కోట్ల మొక్కలు చొప్పున 3 సంవత్సరాలలో 24 కోట్ల మొక్కలు నాటగా, 3300 కోట్లు ఖర్చు చేసారని, నాటిన మొక్కల్లో ఎన్ని మొక్కలను కాపాడారో ప్రజలకు చెప్పాల్సిన బాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అంతేకాకుండా ప్రజలకు పనికి వచ్చే మామిడి, చింత, అల్లనేరేడులాంటి మొక్కలు నాటితే పేదవారు బాగుపడతారు గానీ పనికిమాలిన మొక్కలతో ఏమి లాభమన్నారు. రైతులకు మద్దతు దర ఇవ్వడంలో మేలు రకాల విత్తనాలు అందించడంలో ఆలోచిస్తున్న సిఎం సీడుకంపనీలవారిపై చర్యలు ఎందుకుతీసుకోలేదన్నారు.
ఆదరించండి కలిసికట్టుగా అభివృద్ది సాదిద్దాం
నన్ను మీరందరూ ఆశీర్వదించి ఆదరిస్తే కలసికట్టుగా పనిచేసి అభివృద్ది సాదిద్దామని ప్రతాప్‌రెడ్డి కోరారు. రైతులు పండించిన పంటలకు మద్దతు దరతోపాటు చిన్న, సన్నకారు రైతులకు నెలకు 2వేల పెన్షన్, భూమి లేని పేద రైతులకు 1000 పెన్షన్‌లు అందించనున్నట్లు చెప్పారు.
అలాగే గ్రామాలలో పెంకుటిండ్లు లేని గ్రామాలుగా చేయడమే లక్ష్యంగా ఎస్సి, ఎస్టిలకు 3లక్షలు, ఓసి, బిసిలకు 2లక్షల 50 వేల చొప్పున ఇండ్లు నిర్మాణానికి ఇవ్వనున్నట్లు తెలిపారు. గాంధీజి కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా అన్ని గ్రామాలలో వౌళిక వసతులు కల్పిస్తానన్నారు. అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న సిఎం కెసిఆర్‌ను నమ్మొద్దన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు కాస సుదాకర్, కాస రమేశ్, కనకయ్య, కృష్ణ, సుదాకర్, లక్ష్మినర్సయ్య తదితరులు పాల్గొన్నారు.