మెదక్

రేపటి ఎంసెట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, మే 10: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 12న జరుగే ఎంసెట్‌లో భాగంగా మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంసెట్ పరీక్షలు జరుగుతున్నట్లు పరీక్షల రీజనల్ కో ఆర్డినేటర్ బి.జగనాథం బుధవారం ఇక్కడ మాట్లాడుతూ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 888 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో ఉదయం పరీక్షల్లో ఇంజనీర్ విభాగంలో 625 మంది, మధ్యాహ్నం పరీక్షలో మెడిసిన్ విద్యార్థులు 263 మంది పరీక్షలు రాయబోతున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు ఒక గంట ముందు పరీక్షా కేంద్రానికి రావాలని ఒక నిమిషం ఆలస్యమైన అనుమతించరని ఆయన తెలిపారు. పరీక్షలకు వచ్చే విద్యార్థిని, విద్యార్థులు బ్లూ లేదా బ్లాక్ పెన్ తెచ్చుకోవాలని తెలిపారు. ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షలకు అనుమతించబోమని ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రాలు జిరాక్స్‌తో కూడివని వెంట తెచ్చుకోవాలన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు ఫొటోతో గెజిటెడ్ సంతకంతో పరీక్షకు హాజరు కావాలన్నారు. ఈ పరీక్షా కేంద్రం వద్ద సత్యసాయి సమితి వారు మజ్జిగ, మినరల్ వాటర్ ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇందులో పండితరావు రూట్ ఆఫీసర్‌గా పనిచేస్తారని ఆయన తెలిపారు. డిగ్రీ కళాశాలలో ఎంసెట్ పరీక్ష విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు కళాశాల ప్రిన్సిపల్ సింహారెడ్డి చేసినట్లు ఆయన తెలిపారు.