మెదక్

65 మసీదుల మరమ్మతులకు ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జూన్ 16: మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 65 మసీదుల మరమ్మతులకు నిధులు మంజూరు కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం అజంపుర, కువత్ ఇస్లాంలలో 1500 మంది నిరుపేద ముస్ల్లింలకు రంజాన్ దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్ చాలా వెనుకబడిందన్నారు. అధికారులు కూడా మెదక్ రావాలంటే ఇష్టపడేవారు కాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి వలన మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడిందని ఆమె గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా అధికారులంతా మెదక్‌లో ఉండటం వలన మెదక్‌ను అభివృద్ధి చేసుకుందామని ఆమె పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రం కావడం వలన మెదక్ జిల్లా రూపురేఖలు మారుతున్నాయన్నారు. మరో ఏడాదిలో రైలు కూత వినబోతున్నామని పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ వాటా అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనులకు 50 శాతం నిధులు కేటాయించడం జరిగిందన్నారు. రూ.45 వేల కోట్లతో ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులు అయిన మహిళలకు కెసిఆర్ కిట్టును అందజేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన ముఖ్యమంత్రి కెసిఆర్ అని తెలిపారు. షాదీ ముబారక్ క్రింద 75 వేల రుపాయలు ముస్ల్లిం మహిళల వివాహానికి ప్రభుత్వం అందజేస్తుందన్నారు. మెదక్ పట్టణంలోని షాదీఖానా, ఈద్గా అభివృద్ది పనులకు 10 లక్షల రుపాయలు ప్రతిపాధించినట్లు తెలిపారు. ల కలెక్టర్ భారతి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ రాగి అశోక్, జడ్పిటిసి లావణ్యరెడ్డి, కౌన్సిలర్లు సలామ్, మాయ మల్లేశం, ఆర్‌కె.శ్రీనివాస్, వెంకటరమణ, మైనార్టీ పట్టణ అధ్యక్షులు ఫాజిల్, ఆరీఫ్, జీవన్‌రావు, లింగారెడ్డి, సాదిక్ అలీ తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలను ఆదుకునేందుకు కృషి
*ఎమ్మెల్సీ పారుఖ్‌హుస్సేన్
మిరుదొడ్డి, జూన్ 16: అన్ని వర్గాలలో నిరుపేదలను అదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మేల్సీ పారుఖ్‌హుస్సేన్ అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారంనాడు నిరుపేదలైన ముస్లీంలకు రంజాన్ పండుగ సందర్భంగా బియ్యం, బట్టలను పంపిణి చేయడం జరుగుతుందన్నారు. ఖురాన్‌లో చేప్పినట్లు ప్రతి ఒక్కరు సంపాదన కొంత బాగాన్ని దానం చేయాల్సి వుంటుందన్నారు. ఇస్లాం మతస్తులైన ఎంతో మంది దనవంతులు దానం చేస్తున్నారని పెర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోఅప్షన్ సభ్యుడు ఎంపి హస్సేన్, కమిటి అధ్యక్షుడు, కమిటి సభ్యులు పాల్గొన్నారు.
అధిక ఫీజులను నియంత్రించాలని వినతి
సంగారెడ్డి టౌన్, జూన్ 16: ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని, విద్యా హక్కు చట్టం ప్రకారం పేదలకు 25శాతం సీట్లను ఉచితంగా ఇవ్వాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కేవిపిఎస్, సిఐటియు, డివైఎఫ్‌ఐ, మహిళా సంఘం ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లును కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కేవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.మానిక్యం మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ప్రైవేట్ విద్యావ్యాపారం అత్యధికంగా ఉన్నట్లు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యావ్యాపారం బంద్ అవుతుందని కేసిఆర్ ఇచ్చిన హామి అమలుకు నోచుకోవడం లేదన్నారు. గడిచిన మూడేళ్లలో 30-60శాతం ఫీజులు పెరిగాయని, ప్రతియేట ప్రైవేట్ సూల్స్‌లో విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉందన్నారు. ఈ విద్యావ్యాపారాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు యాదవరెడ్డి, శివకుమార్, నర్సింలు, మహబూబ్‌ఖాన్, శ్రీశైలం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.