మెదక్

సత్తా చాటిన టిఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఏప్రిల్ 11 : సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ సత్తా చాటి 34 స్ధానాలకు 22 స్థానాలు కైవసం చేసుకొని బల్దీయా పీఠాన్ని కైవసం చేసుకుంది. దశాబ్దకాలంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి పురిట గడ్డకావటంతో ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించింది. టిఆర్‌ఎస్ పార్టీ అధికారం చేపట్టాగా జరిగిన అన్ని ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధిస్తుండటంతో మున్సిపల్ పీఠాన్ని సైతం మేజార్టీ స్థానాలతో కైవసం చేసుకోవాలని మంత్రి హరీష్‌రావు తన దైన శైలిలో పావులు కదిపారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసేసరికి 6 స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నారు. మిగత 28 స్థానాల్లో సైతం మేజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని తలచారు. మొదట 30 స్థానాలకు పైగా టిఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ప్రచారం జరిగినప్పటికి చివరకు 22 సీట్లతోనే సంతృప్తి పడాల్సి వచ్చింది.
ఉనికి చాటుకున్న కాంగ్రెస్, బిజెపి నేతలు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లో పోటీ చేసిన 2 స్థానాలను కైవసం చేసుకున్నారు. 6వ వార్డులో ఎస్సీ సెల్ కాంగ్రెస్ చైర్మన్ సాకి ఆనంద్, 30వ వార్డులో వజీర్ విజయం సాధించారు. 17వ వార్డులో బాసంగారి వెంకటేశం, 14వ వార్డులో బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డిలు విజయం సాధించారు
సత్తాచాటిన స్వతంత్ర అభ్యర్థులు
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు 7స్థానాలు కైవసం చేసుకొని అధికార పార్టీ షాక్ నిచ్చి, తమ సత్తాను చాటారు. టిఆర్‌ఎస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన అభ్యర్థులు రెబెల్స్‌గా బరిలో నిలిచారు. 3వ వార్డు నుండి సంధ్య శ్రీకాంత్, 4వ వార్డు దీప్తినాగరాజు, 5వ ధర్మవరం స్వప్నబ్రహ్మాం, 22వ నుండి ప్రవీణ్‌కుమార్, 25 నుండి ప్రమీల, 27 నుండి విజయరాణి, 34 నుండి బోనాల మంజుల విజయం సాధించారు. 5వ వార్డు నుండి బ్రహ్మం టిడిపి పార్టీకి రాజీనామా చేసి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
బోణీ కొట్టిన ఎంఐఎం
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం ఆరు స్థానాలు పోటీ చేసినప్పటికి 33వ వార్డు నుండి మోహిస్ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ 10 స్థానాలు పోటీ చేసినప్పటికి కనీసం ఒక్క స్థానం సైతం సాధించలేకపోయింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రక్రియ ఈనెల 16న నిర్వహించనున్నారు. మున్సిపల్ చైర్మన్‌గా కడవేర్గురాజనర్సును ప్రకటించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వైస్ చైర్మన్ మైనార్టీలకు కేటాయించే అవకాశం ఉంది.